MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Honey: తేనే తయారుచేసే వింతైన చీమలు ఇవిగో.. వీటి తేనే ఖరీదు తెలిస్తే షాకవుతారు

Honey: తేనే తయారుచేసే వింతైన చీమలు ఇవిగో.. వీటి తేనే ఖరీదు తెలిస్తే షాకవుతారు

Honey: తీయని తేనె తయారుచేసేది తేనెటీగలే కదా అనుకుంటారు. నిజానికి ఒకరకమైన చీమలు కూడ తేనెను తయారుచేస్తాయి. అవే హనీపాట్ చీమలు. ఇవి చేసే తేనె చాలా ఖరీదు. సాధారణ వ్యక్తులు కొనలేరు.

2 Min read
Author : Haritha Chappa
Published : Oct 14 2026, 05:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
తేనె తయారుచేసే చీమలు
Image Credit : Gemini AI

తేనె తయారుచేసే చీమలు

తేనె అనగానే మనందరికీ ముందుగా తేనెటీగలే గుర్తుకువస్తాయి. అయితే కేవలం తేనెటీగలు మాత్రమే కాకుండా కొన్ని రకాల చీమలు కూడా తేనెను తయారుచేస్తాయి. ఈ వింతైన చీమలను ‘హనీపాట్ చీమలు’ అని పిలుస్తారు.

ఇవి పశ్చిమ ఆస్ట్రేలియాలోని ఎడారి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. సాధారణ చీమల కంటే భిన్నంగా కనిపిస్తాయి. ఇవి పువ్వుల మకరందాన్ని సేకరించి తేనెగా మారుస్తాయి. అలా తయారైన తేనెను తమ పొత్తికడుపు చివర ఉండే సంచిలాంటి గుండ్రని భాగంలో నిల్వ చేసుకుంటాయి. ఆ సమయంలో వాటి పొట్ట పెద్ద గాలిబుడగలా మారి తేనె కనిపిస్తుంది.

ఎడారిలో భూగర్భంలో గూళ్లను తవ్వుకుని పైకప్పుకు ఇవి తలకిందులుగా వేలాడుతూ జీవిస్తాయి. ఎడారిలో ఆహారం దొరకని కరవు కాలంలో ఈ తేనే తాగి బతుకుతాయి. ఒక చీమ తన శరీరంలోని తేనెను స్వయంగా తాగలేదు. ఆకలి వేసినప్పుడు మరొక చీమ వచ్చి దాని నోటి నుంచి తేనెను తాగుతుంది. ఇలా ఇవి ఒకరి తేనెను మరొకరు తాగుతూ ఆకలి తీర్చుకుంటారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఈ తేనె ఎంతో ఖరీదు
Image Credit : Wikipedia

ఈ తేనె ఎంతో ఖరీదు

హనీపాట్ చీమల తేనె మార్కెట్లో ఎంతో ఖరీదైనది. ఎడారిలో భూమి అడుగున ఉండే గూళ్ల నుంచి ఈ చీమలను వెతికి తేనె సేకరించడం చాలా కష్టమైన పని. అందుకే ఇది చాలా అరుదుగా లభిస్తుంది. సాధారణంగా తేనెటీగల తేనెతో పోల్చి చూస్తే ఈ చీమల తేనె కాస్త పలుచగా ఉంటూ తీపి తక్కువగా ఉంటుంది. అయినా కూడా దీనికి అంతర్జాతీయ మార్కెట్లో ఎంతో గిరాకీ ఉంది.

ఆస్ట్రేలియాలోని స్థానిక ఆదివాసీ తెగల ప్రజలు వేల ఏళ్ల నుంచి ఈ చీమల తేనెను ఇష్టంగా తింటున్నారు. ప్రకృతి సిద్ధంగా లభించే ఈ అమృతాన్ని వారు పవిత్రమైన ఆహారంగా భావిస్తారు. దీనికి వీరు అమ్ముతారు. కిలో తేనె యాభైవేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు పలుకుతుంది.

33
తేనెలో ఔషధగుణాలు
Image Credit : Ant Shop

తేనెలో ఔషధగుణాలు

ఈ తేనెలో అద్భుతమైన ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. దీనిలో బ్యాక్టీరియా, ఫంగస్ వంటి క్రిములను నశింపజేసే గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులోని హైడ్రోజన్ పెరాక్సైడ్, ఇతర సహజ రసాయనాలు గాయాలు త్వరగా మానడానికి తోడ్పడతాయి. అందుకే అక్కడి ప్రజలు దెబ్బలు, చర్మ సమస్యలు వచ్చినప్పుడు దీనిని మందులా పూస్తారు.

ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి, జలుబు, దగ్గు, గొంతు ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం పొందడానికి ఎంతగానో మేలు చేస్తుంది. అరుదైన గుణాలు ఉండటం వల్లే ఈ చీమల తేనె ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైనదిగా గుర్తింపు పొందింది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వైరల్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Public Transport: మెట్రో, బస్సు ఎక్కేముందు ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి
Recommended image2
Peaceful Beaches: సూర్యలంక మాత్రమే కాదు.. ఏపీలో ఎవరికీ తెలియని ఈ ప్రశాంతమైన బీచ్‌లను చూశారా?
Recommended image3
ఈ సెంట‌ర్ ఫ్రెష్ యాడ్ చూస్తే.. మీ ఆలోచ‌న విధాన‌మే మారుతుంది, ఇక‌పై అస్స‌లు ఓవ‌ర్ థింక్ చేయ‌రు
Related Stories
Recommended image1
ప్రతి వారం అక్కడ ‘తెల్లని అబ్బాయిల మార్కెట్’... వారిని కొనేది ఎవరో, ఎందుకు కొంటారో తెలుసా?
Recommended image2
Shukraditya Yoga: శుక్రాదిత్య యోగంతో ఈ 3 రాశులకు పండగే పండగ.. స్థాయి పెరుగుతుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved