- Home
- Feature
- ప్రతి వారం అక్కడ ‘తెల్లని అబ్బాయిల మార్కెట్’... వారిని కొనేది ఎవరో, ఎందుకు కొంటారో తెలుసా?
ప్రతి వారం అక్కడ ‘తెల్లని అబ్బాయిల మార్కెట్’... వారిని కొనేది ఎవరో, ఎందుకు కొంటారో తెలుసా?
అమ్మాయిలకే కాదు ఇప్పుడు అబ్బాయిలకూ రక్షణ లేదు. మంచి రంగున్న టీనేజీ అబ్బాయిలను సంతలో పశువుల్లా అమ్మేస్తున్నారు.ప్రతివారం జరిగే సంతలో అక్కడ ఎంతో మంది అబ్బాయిలు అమ్ముడుపోతున్నారు. ఇదంతా జరిగేది మన పొరుగుదేశం పాకిస్తాన్లో.

అబ్బాయిలను అమ్మే సంత
ప్రపంచంలో పిల్లలపై జరుగుతున్న అన్యాయాలు, లైంగిక వేధింపుల గురించి వింటేనే ఎంతో బాధనిపిస్తుంది. కానీ పాకిస్తాన్లో ప్రతవారం అబ్బాయిల మార్కెట్ జరుగుతుంది. తెల్లగా ఉండే అబ్బాయిలను ఈ మార్కెట్లో పెట్టి అమ్మేస్తారు. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రాంతంలో 'చోక్రా మండి' పేరిట ప్రతి వారం సంతలు జరుగుతాయి. అక్కడ కూరగాయలు అమ్మినట్లుగా, పేద కుటుంబాల మగపిల్లలను నిలబెట్టి వేలం వేసి అమ్ముతున్నారు. ముఖ్యంగా బన్ను, స్వాబీ, డేరా ఇస్మాయిల్ ఖాన్ వంటి ప్రాంతాల్లో శుక్రవారం, ఆదివారాల్లో ఈ అంగళ్లు తెరుస్తారు. డబ్బున్న పెద్ద మనుషులు అక్కడికి వచ్చి, తమ పైశాచిక సరదాల కోసం టీనేజీ వయసున్న అబ్బాయిలను కొనుక్కుని వెళ్తున్నారు.
బాచా బాజీ ఆచారం కోసమే
ఈ దారుణానికి ప్రధాన కారణం అక్కడ ఎప్పటినుంచో నడుస్తున్న 'బాచా బాజీ' అనే చెడ్డ ఆచారం. ఈ పేరుతో పిల్లలతో అసభ్యకరంగా డ్యాన్సులు చేయించి, ఆ తర్వాత వారిపై లైంగిక దాడికి ఒడిగడతారు. తీవ్రమైన పేదరికం వల్ల కొందరు తల్లిదండ్రులు తిండి కూడా పెట్టలేక పిల్లలను అమ్ముకుంటున్నారు. మరికొందరు దళారుల మాయమాటలకు మోసపోయి పిల్లలను పోగొట్టుకుంటున్నారు. ఇటీవల హయాత్ పరిగల్ అనే సామాజిక కార్యకర్త ఈ అక్రమాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో ఈ నిజాలు బయటకు వచ్చాయి. దాంతో ప్రపంచమంతా పాకిస్తాన్ తీరుపై మండిపడుతోంది.
పాకిస్తాన్లో ఘోరాలు
పాకిస్తాన్లో ఇలాంటి అక్రమ రవాణాను ఆపడానికి చట్టాలు ఉన్నప్పటికీ, అవి కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. తప్పు చేసిన వాళ్లకు జైలు శిక్షలు వేసే నిబంధనలు ఉన్నా, పోలీసులు, అధికారులు పట్టించుకోరు. అధికారులు కళ్లు మూసుకోవడం వల్లే ఈ అక్రమ వ్యాపారులు ఏమాత్రం భయం లేకుండా రెచ్చిపోతున్నారు. పెద్ద పెద్ద వేదికలపై పిల్లల హక్కుల గురించి గొప్పలు చెప్పే పాలకులు, కళ్ల ముందే నాశనమవుతున్న ఈ చిన్నపిల్లల జీవితాలను కాపాడటానికి మాత్రం చర్యలు తీసుకోరు. ఎందుకంటే దీనికి ఆచారం అని బలమైన కారణాలను చూపిస్తున్నారు.

