MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • Sleep Study: హైబీపీ, డయాబెటిస్ రాకూడదంటే రాత్రినిద్ర ఎంతుండాలో చెప్పేసిన కొత్త స్టడీ

Sleep Study: హైబీపీ, డయాబెటిస్ రాకూడదంటే రాత్రినిద్ర ఎంతుండాలో చెప్పేసిన కొత్త స్టడీ

Sleep Study: ఇప్పుడు చిన్నవయసులోనే హైబీపీ, షుగర్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. ఆ వ్యాధులు రాకుండా ఉండాలంటే ఎంతసేపు నిద్రపోవాలో ఒక కొత్త అధ్యయనం చెప్పేసింది. మీరు కూడా ప్రతిరోజూ రాత్రి అంతే సమయం నిద్రపోతే ఆరోగ్యం.

2 Min read
Author : Haritha Chappa
Published : Mar 08 2026, 12:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఎంత నిద్ర అవసరం?
Image Credit : Getty

ఎంత నిద్ర అవసరం?

ఒక వ్యక్తి ఆరోగ్యంగా జీవించాలంటే ఆహారంతోపాటూ నీరు, నిద్ర కూడా ఎంతో ముఖ్యం. చాలా మంది నిద్రను నిర్లక్ష్యం చేస్తారు. నిద్ర తగ్గితే ఎన్నో ఆరోగ్యసమస్యలు వస్తాయి, అలాగే నిద్ర అధికమైనా కూడా సమస్యే. సరైన నిద్ర లేకపోతే బీపీ, షుగర్, గుండె జబ్బులు వంటివి వచ్చే అవకాశం పెరిగిపోతుంది. ఓ కొత్త మనం ఎన్నిగంటలు నిద్రపోతే ఆరోగ్యంగా ఉంటామో తేల్చి చెప్పింది. ముఖ్యంగా హైబీపీ, డయాబెటిస్ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే ఎన్ని గంటల రాత్రి నిద్ర అవసరమో తెలుసుకోండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఎన్ని గంటలు?
Image Credit : Getty

ఎన్ని గంటలు?

సాధారణంగా వైద్య నిపుణులు 7 నుంచి 9 గంటల నిద్ర అవసరమని వివరిస్తారు. కానీ  'BMJ ఓపెన్ డయాబెటిస్ రీసెర్చ్ & కేర్' సంస్థ చేసిన అధ్యయనం చెబుతున్న ప్రకారం బీపీ, షుగర్, గుండె జబ్బులు వంటివి రాకుండా ఉండాలంటే ఆ వ్యక్తి  7 గంటల 18 నిమిషాలు పాటూ రాత్రినిద్ర అవసరం. ఇక్కడ చెప్పినంత సమయం నిద్ర పోతే చాలు ఆరోగ్యంగా జీవిస్తారు.

34
నిద్రపోయే పద్ధతి
Image Credit : Getty

నిద్రపోయే పద్ధతి

చాలామంది వారం రోజుల్లో అయిదు రోజులు బాగా పనిచేసి తక్కువ నిద్రపోతారు.  వల్ల వారంలో 5-6 రోజులు సరిగా నిద్రపోరు. ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి వారంలో వచ్చే సెలవు రోజున ఎక్కువసేపు నిద్రపోతారు. ఇలా చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు… సరికదా ప్రమాదమే ఎక్కువ.  ఇది గ్లూకోజ్ మెటబాలిజంపై చెడు ప్రభావం చూపి, ఆరోగ్యాన్ని మరింత పాడుచేస్తుంది.

టైప్ 2 డయాబెటిస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించుకోవాలంటే కచ్చితంగా మీరు 7 గంటల 18 నిమిషాలు నిద్రపోయి తీరాలి. మంచం మీద పడుకుని ఇటూ అటూ దొర్లితే సరిపోదు, గాఢ నిద్రపోవాలి. శరీరం ఇన్సులిన్‌ను సరిగా వాడకపోయినా, ప్యాంక్రియాస్ తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయకపోయినా రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. దీనివల్ల డయాబెటిస్ పెరిగిపోతుంది.

44
ఎన్నో అధ్యయనాలు
Image Credit : Pixabay

ఎన్నో అధ్యయనాలు

ఈ కొత్త అధ్యయనాన్ని 2009 నుంచి 2023 వరకు పరిశోధన చేశారు. ఇందులో 20 నుంచి 80 ఏళ్ల మధ్య వయసున్న 23,475 మంది ఆరోగ్యడేటాను, నిద్ర సమయాన్ని తీసుకున్నారు. ఈ సుదీర్ఘ అధ్యయనం ద్వారా ఆరోగ్యకరమైన నిద్ర ఫార్ములాను కనుగొన్నారు.

నిద్ర చాలా ముఖ్యం. కానీ ఏ టైమ్‌లో పడితే ఆ టైమ్‌లో నిద్రపోకూడదు. రాత్రిపూట ఆలస్యంగా పడుకోవడం మంచి అలవాటు కాదు. రాత్రి 10 గంటలలోపు నిద్రపోవాలి. కచ్చితంగా 7 గంటల 18 నిమిషాలు నిద్రపోతే మంచి ఆరోగ్యం మీ సొంతం.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Silver Mettelu: ఈ అందమైన మెట్టెలు చూస్తే ఫిదా అయిపోతారు
Recommended image2
Aloe Vera: కలబందను ఇలా వాడితే మీ అందం రెట్టింపు కావడం పక్కా!
Recommended image3
దేవుడి గదిలో మట్టి కుండ, రాతి ఉప్పు పెట్టి చూడండి... కొన్ని రోజుల్లోనే మీ జీవితంలో మార్పులు
Related Stories
Recommended image1
Planetary Conjunction: మూడు గ్రహాల్లో కదలిక, ఈ 3 రాశుల వాళ్లకు మాట, డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం
Recommended image2
Rashmika Mandanna: నువ్వు రిక్వెస్టు చేస్తే తప్ప నీతో సినిమాలు చేయను... భర్తకు రష్మిక కండిషన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved