MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Hair Care: వర్షాకాలంలో జుట్టు రాలుతోందా? షాంపూ మార్చడం కాదు..ఇదొక్కటి చేస్తే చాలు..!

Hair Care: వర్షాకాలంలో జుట్టు రాలుతోందా? షాంపూ మార్చడం కాదు..ఇదొక్కటి చేస్తే చాలు..!

Hair Care: వర్షాకాలంలో జుట్టు విపరీతంగా రాలుతోందా? అయితే వెంటనే మీరు వాడే షాంపూ, నూనె మార్చడం కాకుండా.. కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అయితే చాలు. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది.

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 31 2026, 09:39 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Monsoon Hair Care
Image Credit : Getty

Monsoon Hair Care

ఈ రోజుల్లో చాలా మంది హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారు. జుట్టు రాలుతుందనే భయంతో వెంటనే మార్కెట్లో దొరికే కొత్త కొత్త షాంపూలు, కండిషనర్లు కొనేసి వాడేస్తూ ఉంటారు. కానీ, వాటి వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. జుట్టు పెరుగుదల కేవలం పై పైన రాసే నూనెలు, షాంపూలు, కండిషనర్లలో ఉండదు. అందుకే, కొన్ని సింపుల్ అలవాట్లను అలవరుచుకుంటే.. హెయిర్ ఫాల్ తగ్గడమే కాదు.. జుట్టు ఒత్తుగా కూడా పెరుగుతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
1.రెగ్యులర్ గా హెయిర్ వాష్ చేయాలి..
Image Credit : Getty

1.రెగ్యులర్ గా హెయిర్ వాష్ చేయాలి..

జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరగాలంటే తల చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. కేవలం ఎండాకాలంలో మాత్రమే కాదు, వర్షాకాలంలో కూడా తలలో చెమట, దుమ్ము పేరుకుపోతాయి. ఆ మురికి, దుమ్మూ అలానే ఉంటే.. హెయిర్ ఫాల్ ఎక్కువగా పెరుగుతుంది. అందుకే.. ఆ దుమ్ము వదిలించడానికి.. రెగ్యులర్ గా తలస్నానం చేస్తూ ఉండాలి. అయితే... మనం వాడే షాంపూలు చాలా మైల్డ్ గా ఉండాలి. అప్పుడు హెయిర్ డ్యామేజ్ అవ్వగుండా ఉంటుంది. జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.

34
2.ఆయిల్ మసాజ్..
Image Credit : Getty

2.ఆయిల్ మసాజ్..

చాలా మంది జుట్టు మంచిగా పెరగాలని.. ప్రతిరోజూ నూనె రాసేస్తూ ఉంటారు. కానీ, అలా రాయకూడదు. అలా అని.. అసలు నూనె రాయకుండా కూడా ఉండకూడదు. వారానికి ఒకటి లేదా రెండు సార్లు అయినా నూనెతో తలకు మంచిగా మసాజ్ చేయాలి. రెగ్యులర్ గా ఆయిల్ మసాజ్ చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. జుట్టు కుదుళ్లు బలపడి.. జుట్టు ఒత్తుగా పెరగడానికి హెల్ప్ చేస్తుంది. అయితే.. ఈ వర్షాకాలంలో జుట్టుకు నూనె రాసి అలానే వదిలేయకూడదు. గంట తర్వాత తలస్నానం చేస్తే సరిపోతుంది.

3.తడి జుట్టును అలానే వదిలేయకూడదు..

వర్షాకాలం బయటకు వెళ్లినప్పుడు.. ఎప్పుడు వర్షం పడుతుందో ఊహించలేం. వర్షం పడి పొరపాటున తడిచిపోయే ప్రమాదం ఉంది. అలా తడిచినప్పుడు లేదా.. తలస్నానం చేసినప్పుడు.. జుట్టును గట్టిగా టవల్ తో తుడవకూడదు. దీని వల్ల జుట్టు బలహీనంగా మారిపోతుంది. హెయిర్ ఫాల్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. అందుకే.. జుట్టును చాలా నెమ్మదిగా తుడవాలి.

44
4.పోషకాలతో నిండిన ఆహారం..
Image Credit : Getty

4.పోషకాలతో నిండిన ఆహారం..

మనం ఎంత ఖరీదైన షాంపూలు, కండిషనర్లు వాడినా కూడా పోషణ లోపలి నుంచి రాకపోతే హెయిర్ ఫాల్ కంట్రోల్ లో ఉండదు. అందుకే..మంచి పోషకాలతో ఉన్న ఆహారం తప్పకుండా తీసుకోవాలి. అంటే.. ప్రోటీన్, ఐరన్, బయోటిన్, జింక్, విటమిన్లు ఎక్కువగా ఉండే ఆహారాలను ప్రతిరోజూ తీసుకోవాలి. అంతేకాకుండా.. రోజంతా నీరు పుష్కలంగా తీసుకోవాలి. అప్పుడు జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

5.హీట్ స్టైలింగ్, కెమికల్స్ ఉన్న ఉత్పత్తుల వాడకం తగ్గించాలి. ఈ రోజుల్లో చాలా మంది స్టైల్ గా కనిపించడానికి బ్లూ డ్రయ్యర్, స్ట్రైయిట్నర్, కర్లర్ లాంటివి వాడుతున్నారు. వీటి వల్ల జుట్టు డ్రైగా మారి హెయిర్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి..వీటి వాడకం వీలైనంత వరకు తగ్గించాలి.

6.ఓపికగా ఉండాలి.. మనం ఏ పని చేసినా వెంటనే రిజల్ట్ వచ్చేయదు. ముఖ్యంగా ఒక్క రోజుల్లో జుట్టు రాలడం ఆగదు. క్రమం తప్పకుండా.. ప్రతిరోజూ ఈ రూల్స్ ఫాలో అయితే.. అప్పుడు జుట్టు రాలడం కంట్రోల్ లో ఉంటుంది. అప్పటి వరకు ఓపికగా ఉండాలి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Vinayaka Chavithi 2026: వినాయక చవితి నాడు కచ్చితంగా చేయాల్సిన 5 ముఖ్యమైన పనులు ఇవే!
Recommended image2
Wrinkles: వయసు పెరుగుతుంటే ముఖంపై ముడతలు వస్తున్నాయా? ఇలా చేస్తే ముడతలు మాయం
Recommended image3
Rice Water: బియ్యం నీటిని ఇలా వాడితే ముఖం మెరిసిపోవడం పక్కా!
Related Stories
Recommended image1
Parenting: మగ పిల్లలకు తల్లి చెప్పాల్సిన 7 లైఫ్ లెసెన్స్.. జీవితాన్నే మార్చేస్తాయి..!
Recommended image2
Cinnamon Water:15 రోజులు దాల్చిన చెక్క నీరు తాగితే బాడీలో ఏం జరుగుతుంది? బరువు తగ్గుతారా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved