MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Parenting: మగ పిల్లలకు తల్లి చెప్పాల్సిన 7 లైఫ్ లెసెన్స్.. జీవితాన్నే మార్చేస్తాయి..!

Parenting: మగ పిల్లలకు తల్లి చెప్పాల్సిన 7 లైఫ్ లెసెన్స్.. జీవితాన్నే మార్చేస్తాయి..!

Parenting: పిల్లలకు తల్లిదండ్రులు ఆస్తులు ఇచ్చినా, ఇవ్వకపోయినా కచ్చితంగా విలువలు నేర్పించాలి. అది పెద్దయ్యాక చెబితే ఉపయోగం ఉండదు. ముఖ్యంగా 8 ఏళ్లలోపే పిల్లలకు నేర్పించాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం..

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 30 2026, 11:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Parenting..
Image Credit : AI Generated Photo

Parenting..

ఈ రోజుల్లో ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఎంత ఎక్కువ ఆస్తులు కూడబెట్టాలా అని తిప్పలు పడుతూ ఉంటారు. కానీ, పిల్లలకు డబ్బు, ఇల్లు, ఆస్తి ఇచ్చినా, ఇవ్వకపోయినా చిన్నప్పటి నుంచి చెప్పే కొన్ని విలువలు వారి జీవితాన్ని నడిపిస్తాయి. ఒక మంచి భర్తగా, మంచి తండ్రిగా, మంచి పౌరుడిగా ఎదగాలంటే చిన్న వయసు లోనే కొన్ని విషయాలు నేర్పించాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
1.అబ్బాయిలు కూడా ఏడవచ్చు..
Image Credit : AI Generated Photo

1.అబ్బాయిలు కూడా ఏడవచ్చు..

మన సమాజంలో ఎక్కువగా వినిపించే మాటలు.. ‘ అబ్బాయిలు ఏడ్వకూడదు’ అని. ఎవరైనా ఏడుస్తుంటే.. ఆడపిల్లలా ఏడుస్తావేంటి..? అని అంటూ ఉంటారు. కానీ, అందులో ఎలాంటి నిజం లేదు అని తల్లి తన కొడుక్కి చెప్పాలి. కోపం, ప్రేమ, బాధ, సంతోషం ఎలా వ్యక్తపరుస్తామో.. ఏడ్వడం కూడా అలాంటిదే అని పిల్లలకు చెప్పాలి. ఎమోషన్స్ ని కంట్రోల్ లో ఉంచుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పాలి. ఏడవడం అంటే బలహీనత కాదు అని అర్థమయ్యేలా చెప్పాలి. ఏడవకుండా లోపలే బాధను దాచుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు.

2.ఆడ పిల్లలను గౌరవించాలి...

ఇంట్లో తల్లికి మాత్రమే కాదు భార్య, చెల్లి, అక్క, స్నేహితురాలు ఎవరైనా సరే మహిళలను కచ్చితంగా గౌరవించాలి. ఈ విషయాన్ని చిన్నప్పటి నుంచే నేర్పించాలి. నిజమైన గొప్పతనం ఎదుటివారిని గౌరవించడంలోనే ఉంటుంది. అది ఒక్కసారిగా పెద్దయ్యాక రాదు.. చిన్న వయసు నుంచే ఈ విషయాన్ని తల్లి తన కొడుక్కి నేర్పించాలి.

Related Articles

Related image1
Chips Packet:ఎంత మోసం..! చిప్స్ ప్యాకెట్ లో సగం చిప్స్ ఎందుకు ఉంటాయి..? అసలు కారణం ఇదే
Related image2
Parenting: పిల్లల కోసం తండ్రి మార్చుకోవాల్సిన 3 అలవాట్లు.. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి టిప్స్
33
3.తప్పు చేస్తే ఒప్పుకోవడం, క్షమాపణ చెప్పడం..
Image Credit : AI Generated Photo

3.తప్పు చేస్తే ఒప్పుకోవడం, క్షమాపణ చెప్పడం..

ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో తప్పులు చేయడం చాలా సహజం. కానీ, చేసిన తప్పును ఒప్పుకోవడం చాలా ముఖ్యం. అందుకే.. పిల్లలు తప్పు చేసినా ఒప్పకోవడం నేర్పించాలి. చేసిన తప్పుకు ఇతరులకు క్షమాపణ చెప్పడం కూడా చాలా మంచి లక్షణం. ఈ విషయాన్ని పిల్లలకు నేర్పించాలి.

4.ఇంటి పనులు అందరి బాధ్యత..

చాలా మంది ఇంటి పనులు.. కేవలం స్త్రీల బాధ్యత అనే భావన పిల్లల్లో చిన్నప్పటి నుంచి నాటుకుపోయి ఉంటుంది. ఆ ఆలోచనను మార్చేయాలి. ఇంటి పని ఇంట్లో అందరి బాధ్యత అని చిన్నప్పటి నుంచి నేర్పించాలి. అది ఆడవాళ్ల పని అనే భావన పిల్లల మనసులో రానివ్వకూడదు. వంట చేయడం. ఇల్లు శుభ్రం చేయడం, పాత్రలు శుభ్రం చేయడం... పని ఏదైనా మగ పిల్లలకు చేయడం నేర్పాలి. ఇది కూడా చిన్నప్పటి నుంచే నేర్పించాలి.

5.డబ్బు సంపాదించడం ఒక్కటే ముఖ్యం కాదు...

జీవితంలో విజయం సాధించడం అంటే డబ్బు సంపాదించడం, జీతం ఎక్కువగా ఉండటం కాదు. నిజాయితీతో ఉండటం, ఇతరులతో దయగా ఉండటం, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం కూడా చాలా ముఖ్యం. నిజమైన విజయం వీటితోనే సాధ్యం అవుతుంది.

6.కోపంలో మాట జారడం..

మనిషికి కోపం రావడం చాలా సహజం. కానీ, కోపంలో మాట్లాడిన మాటలు జీవితాంతం మనసును గాయపరుస్తాయి. అందుకే, ఎంత కోపంలో అయినా మాట జారకూడదు. ఏదైనా మాట మాట్లాడే ముందు ఒకటికి వంద సార్లు ఆలోచించడం చాలా ముఖ్యం.

7.నేర్చుకోవడం ఆపకూడదు..

జీవితంలో ప్రతి రోజూ కొత్త పాఠమే. పుస్తకాల నుంచి మాత్రమే కాదు, మనుషుల నుంచి, అనుభవాల నుంచి, తప్పుల నుంచి కూడా నేర్చుకోవాలి. ఇది జీవితంలో గెలవడానికి సహాయపడుతుంది. అందుకే, ఈ మాటలు పిల్లలకు తల్లి మాత్రమే చెప్పగలదు.

పేరెంట్స్ చేయాల్సిన పని ఇదే..

పిల్లలు మనం చెప్పేది విన్నా.. అన్ని ఫాలో అవుతారు అనుకోవడం మన భ్రమ. వాళ్లు నిజంగా మనం చెప్పినవి.. పిల్లలు నేర్చుకోవాలి అంటే.. ముందు అది మనం ఫాలో అవ్వాలి. పిల్లలు మనం చేసింది చూసి ఎక్కువ నేర్చుకుంటారు. కాబట్టి గౌరవం, నిజాయితీ, ప్రేమ, బాధ్యత వంటి విలువలను మాటలతో పాటు మన ప్రవర్తన ద్వారా పిల్లలకు నేర్పించాలి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
చిన్నారుల సంరక్షణ
Latest Videos
Recommended Stories
Recommended image1
Lucky Bamboo: ఇంట్లో లక్కీ బ్యాంబూ మొక్కను ఇలా పెంచితే అదృష్టం
Recommended image2
Silver Bracelet: రాఖీకి మీ సోదరికి నచ్చే బడ్జెట్ లో బెస్ట్ రాఖీ గిఫ్ట్
Recommended image3
Pearl Necklace: ఈ ముత్యాల నక్లెస్ పెట్టుకుంటే.. అందరి కళ్లు మీవైపే
Related Stories
Recommended image1
Chips Packet:ఎంత మోసం..! చిప్స్ ప్యాకెట్ లో సగం చిప్స్ ఎందుకు ఉంటాయి..? అసలు కారణం ఇదే
Recommended image2
Parenting: పిల్లల కోసం తండ్రి మార్చుకోవాల్సిన 3 అలవాట్లు.. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి టిప్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved