MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Cinnamon Water:15 రోజులు దాల్చిన చెక్క నీరు తాగితే బాడీలో ఏం జరుగుతుంది? బరువు తగ్గుతారా?

Cinnamon Water:15 రోజులు దాల్చిన చెక్క నీరు తాగితే బాడీలో ఏం జరుగుతుంది? బరువు తగ్గుతారా?

Cinnamon Water:చాలా రకాల వంటలకు రుచిని పెంచే దాల్చిన చెక్క..మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మరి, ఈ దాల్చిన చెక్కను వంటల్లో కాకుండా.. నీటి రూపంలో తీసుకుంటే ఏం జరుగుతుంది?

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 25 2026, 08:03 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
దాల్చిన  చెక్క నీరు..
Image Credit : Getty

దాల్చిన చెక్క నీరు..

మన అందరి వంట గదిలో ఉండే మసాలా దినుసు దాల్చిన చెక్క. ఈ దాల్చిన చెక్కను దాదాపు చాలా మంది మసాలా టీ, మసాలా కూరలు, బిర్యానీల్లో వాడుతూ ఉంటారు. కొన్ని రకాల స్వీట్స్ లోనూ.. దీనిని వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. కమ్మని వాసన, రుచిని అందించగల దాల్చిన చెక్క.. మన బరువును కూడా కంట్రోల్ చేస్తుందనే విషయం తెలుసా? మరి, ప్రతిరోజూ మిస్ అవ్వకుండా వరసగా 15 రోజులపాటు దాల్చిన చెక్క నీటిని తాగితే నిజంగానే బరువు తగ్గుతారా? దీనిని ఎలా తీసుకోవాలి? ఈ దాల్చిన చెక్క నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
దాల్చిన చెక్కతో ప్రయోజనాలు..
Image Credit : Getty

దాల్చిన చెక్కతో ప్రయోజనాలు..

పరగడుపున దాల్చిన చెక్క నీళ్లు తాగడం వల్ల బరువు తగ్గే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రక్తంలో షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది. ఈ రెండూ ఆరోగ్యకరమైన బరువుకు సహాయపడతాయి. దాల్చిన చెక్కలో ప్రోబయోటిక్ గుణాలు కూడా ఉంటాయి. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పేగు ఆరోగ్యం మెరుగుపడుతుంది.

33
దాల్చిన చెక్క నీరు తాగితే ఏమౌతుంది..?
Image Credit : our own

దాల్చిన చెక్క నీరు తాగితే ఏమౌతుంది..?

దాల్చిన చెక్క నీటిని ప్రతిరోజూ పరగడుపున తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఈ నీటిని తాగడం వల్ల శరీరం ఆహారాన్ని సులభంగా జీర్ణం చేస్తుంది. భోజనం చేసిన తర్వాత కడుపు ఉబ్బరం, అసౌకర్యం లాంటి సమస్యలు ఉండవు.

అంతేకాదు, దాల్చిన చెక్క రక్తంలో షుగర్ లెవల్స్ ని బ్యాలెన్స్ గా ఉంచడానికి సహాయపడుతుంది. దీని వల్ల తొందరగా ఆకలి వేయదు.జంక్ ఫుడ్ తినాలనే కోరిక తగ్గుతుంది. దీని వల్ల అదనంగా కేలరీలు తీసుకోం కాబట్టి... సులభంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఈ నీటిని తీసుకోవడం వల్ల జీవక్రియ కూడా మెరుగుపడుతుంది.

ఈ దాల్చిన చెక్క నీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో, బరువు కంట్రోల్ లో ఉంచడానికి సహాయపడతాయి. అంతేకాదు, దాల్చిన చెక్క రుచికి తియ్యగా ఉంటుంది. ఈ నీటిని తాగడం వల్ల మన షుగర్ క్రేవింగ్స్ కూడా తీరిపోతాయి. ప్రాసెస్ చేసిన షుగరీ ఫుడ్స్ తినాలనే కోరిక కూడా తగ్గుతుంది. ఫలితంగా బరువు తగ్గడం సులభం అవుతుంది.

బరువు తగ్గించే దాల్చిన చెక్క నీరు ఎలా తయారు చేయాలి?

ఈ దాల్చిన చెక్క నీటిని తయారు చేయడానికి మనకు ఒక చిన్న దాల్చిన చెక్క లేదంటే.. అర టీస్పూన్ దాల్చిన చెక్క పొడి ఉంటే సరిపోతుంది. ముందుగా, దాల్చిన చెక్క పొడిని నీటిలో కలిపి బాగా కలిపి మరిగించాలి. కనీసం 5 నుంచి 7 నిమిషాల పాటు చిన్న మంటపై మరిగించాలి. ఆ తర్వాత నీటిని చల్లార్చాలి. కాస్త గోరు వెచ్చగా ఉన్నప్పుడు ఆ నీటిని వడగట్టి... పరగడుపున తాగితే సరిపోతుంది. క్రమం తప్పకుండా 15 రోజుల పాటు తాగితే బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఈ నీటిని తాగితే మాత్రమే బరువు తగ్గరు. సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే బరువు తగ్గడం సులభం అవుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Kiwi: కివీని ఎలా తింటున్నారు? ఇలా మాత్రం తినకండి, నిపుణులు ఏం చెప్తున్నారంటే?
Recommended image2
Wedding Ritual: ఇక్కడ పెళ్లికి ముందు ఏకంగా పెళ్లి కూతురినే కిడ్నాప్ చేస్తారు..!
Recommended image3
Bedroom Deep Cleaning: ఎంత క్లీన్ చేసినా బెడ్ రూంలో దుమ్ము ఉంటుందా? అయితే ఈ సింపుల్ టిప్స్ ట్రై చేయండి
Related Stories
Recommended image1
Leafy Greens: ఆకుకూరలను తూకంతో ఎందుకు అమ్మరు?కట్టలు కట్టి అమ్మడం వెనక రీజన్ ఏంటి?
Recommended image2
Coriander: కొత్తిమీర ఆకులు తుంచి, కాడలు పారేస్తున్నారా? ఇక నుంచి ఇలా వాడేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved