UPSC Interview Questions : మొబైల్, సెల్ ఫోన్ కి తేడా ఏమిటి..?
Tricky Question and Answers : యూపీఎస్సీ ఇంటర్వ్యూలో జ్ఞానమే కాదు, అభ్యర్థి ఆలోచనా విధానాన్ని కూడా పరీక్షిస్తారు. అలాంటి 5 ట్రిక్కీ ప్రశ్నలు, వాటి సమాధానాలు ఇక్కడ చదవండి. ఇవి యూపీఎస్సీ తయారీకి సహాయపడతాయి.

ప్రశ్న: మొబైల్ ఫోన్, సెల్ ఫోన్‌కు తేడా ఏమిటి?
సమాధానం: సాంకేతికంగా పెద్ద తేడా లేదు. 'సెల్ ఫోన్' సెల్యులార్ నెట్‌వర్క్ నుండి వచ్చింది. 'మొబైల్ ఫోన్' దాని పోర్టబిలిటీని సూచిస్తుంది. ప్రస్తుతం రెండూ ఒకే అర్థంతో వాడుతున్నారు.
ప్రశ్న: ఎగిరే ఉడుత ఎక్కడ కనిపిస్తుంది?
సమాధానం: మధ్యప్రదేశ్‌లోని బోరి అభయారణ్యంలో ఎగిరే ఉడతలు కనిపిస్తాయి. అయితే ఇవి నిజానికి ఎగరవు… కానీ చర్మం సహాయంతో ఓ చెట్టు నుండి మరో చెట్టుపైకి ఈజీగా దూకుతాయి. అందుకే ఎగురుతున్నట్లు కనిపిస్తాయి.
ప్రశ్న: మీరు చిన్నారులకు పాఠం చెబుతుండగా కొడితే ఏం చేస్తారు?
సమాధానం: ముందు ప్రశాంతంగా ఉంటాను... వైలెంట్ గా స్పందించను. పిల్లాడి ప్రవర్తనకు కారణం తెలుసుకుని, ప్రేమతో మాట్లాడి హింస తప్పని వివరిస్తాను.
ప్రశ్న: రాజస్థాన్ 'రాధ' అని ఎవరిని పిలుస్తారు?
సమాధానం: మీరాబాయిని రాజస్థాన్ 'రాధ' అంటారు. కృష్ణుడిపై ఆమెకున్న అపారమైన భక్తి, ప్రేమ కారణంగా ఆమెకు ఆ పేరు వచ్చింది. ఆమె ప్రేమతో కృష్ణుడికి రేగు పండ్లు తినిపించిందని చెబుతారు.
ప్రశ్న: అంకె, సంఖ్యకు తేడా ఏమిటి?
సమాధానం: అంకెలు (Digits) సంఖ్యలను ఏర్పరిచే చిహ్నాలు (0-9). సంఖ్యలు (Numbers) అంకెల కలయికతో ఏర్పడతాయి (ఉదా: 25, 108). 2026 ఒక సంఖ్య… కానీ అందులోని 2, 0, 6 అనేవి అంకెలు.

