నమాజ్ చేసేటప్పుడు ఈ 4 తప్పులు చేయకండి
రంజాన్ మాసం ప్రారంభమైంది. దీంతో ముస్లింలంతా రోజుకు ఐదు సార్లు నమాజ్ చేస్తారు. ప్రార్థనల వల్ల అల్లాహ్ దయ తమపై ఉంటుందని నమ్ముతారు. అయితే నమాజ్ చేసేటప్పుడు కొన్ని తప్పులు మాత్రం అస్సలు చేయకూడదు. ఒకవేళ చేస్తే ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
రంజాన్ మాసం ప్రారంభమవడంతో ముస్లింలంతా ఉపవాసాలు ఉంటూ.. అల్లాహ్ కు ప్రార్థనలు చేస్తుంటారు. అయితే ఇస్లాం మతంలో అల్లాహ్ ను, ఆయన ప్రవక్తను విశ్వసించిన తర్వాత.. మగ, ఆడ, పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రజలందరూ ప్రార్థన చేయడం తప్పనిసరి. అయితే అల్లాహ్ కు ప్రార్థనలు చేసేటప్పుడు కొన్ని తప్పులు చేయకూడదట. దీనివల్ల మీరు ప్రార్థనలు చేసిన ఫలం కూడా పొందలేరు.
Ramadan
ప్రార్థన చేసేటప్పుడు ఈ తప్పులు చేయకండి
ముస్లింలు అల్లాహ్ కు ప్రార్థనలు చేయడం మీరు చూసే ఉంటారు. ఎందుకంటే రోజుకు ఐదుసార్లు ప్రార్థనలు చేయడం ఇస్లాంలో ప్రాథమిక భాగం. కానీ ప్రార్థనలో చిన్న చిన్న విషయాల పట్ల శ్రద్ధ వహించడం ముఖ్యం. అలా చేయకపోతే ఆరాధన ఫలం కూడా ఉండదు.
Ramadan
ప్రార్థన అంటే ఏంటి?
నమాజ్ ను అరబిక్ భాషలో సలాహ్ అని పిలుస్తారు. దీనిలో అల్లాహ్ ను ఆరాధిస్తారు. అలాగే ఖురాన్ చదువుతారు. ప్రార్థన లోపల అనేక రకాల భంగిమలు ఉంటాయి. ఇవి మనశ్శాంతిని కలిగించడంతో పాటుగా ఎన్నో శారీరక ప్రయోజనాలను కూడా అందిస్తాయి.
పరిశుభ్రత లేకపోవడం
మీరు నమాజ్ చేయబోయే ప్రదేశం చాలా పరిశుభ్రంగా ఉండాలి. భూమి స్వచ్ఛమైనది కాబట్టి మీరు నేలపై ఎక్కడైనా ప్రార్థన చేయొచ్చు. కానీ మీరు ప్రార్థన చేసే స్థలంలో ఎలాంటి మురికి లేకుండా చూసుకోవాలి.
Ramadan
ప్రార్థిస్తున్నప్పుడు చుట్టూ చూస్తూ..
ప్రార్థనలో ధ్యానం చేయడం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఖిబ్లాను కనుక్కోవాలి. ఖిబ్లా అంటే నమాజ్ ప్రార్థనలు చేసేటప్పుడు మీ ముఖం ఏ దిశలో ఉండాలో తెలియజేస్తుంది. ప్రార్థన చేసేటప్పుడు మీ ముఖం సరైన దిశలోనే ఉండాలి. అలాగే ఈ సమయంలో మీరు దిక్కులు చూడకూడదు.
త్వరగా ప్రార్ధించడం
అల్లాహ్ కు ప్రార్థనలు చేయడం చాలా పవిత్రమైనది. ముస్లింలంతా రోజుకు ఐదు సార్లు ప్రార్థన చేయాలి. కానీ తొందర తొందరగా ప్రార్థన చేయకూడదు. ఎందుకంటే పఠించిన ప్రార్థనల అర్థాన్ని మారుస్తుంది. అందుకే ప్రార్థనలకు సమయాన్ని కేటాయించండి.
వస్త్రాలు శుభ్రంగా లేకపోవడం
ప్రార్థించే సమయంలో మీ బట్టలు శుభ్రంగా ఉండాలి. దుస్తులపై మురికి ఉండకూడదని చెప్తారు. అందుకే ఉతికిన దుస్తులను వేసుకుని ప్రార్థన చేయాలి. దీంతో ప్రార్థన ఫలాలను పొందుతారు.