MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • March Horoscope: మార్చి నెలలో ఏ తేదీలో పుట్టిన వారికి ఎలా ఉండనుందో తెలుసా?

March Horoscope: మార్చి నెలలో ఏ తేదీలో పుట్టిన వారికి ఎలా ఉండనుందో తెలుసా?

March Horoscope:   న్యూమరాలజీ ప్రకారం.. మనం పుట్టిన తేదీ ఆధారంగా మన భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. మరి, మార్చి నెలలో ఏ తేదీలో పుట్టిన వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం…

3 Min read
Author : ramya Sridhar
Published : Feb 16 2026, 05:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
  నెంబర్ 1 (1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వారు)
Image Credit : Getty

నెంబర్ 1 (1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వారు)

ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 1కిందకు వస్తారు. వీరికి మార్చి నెలలో అద్భుతంగా ఉండనుంది.

మార్చి నెలలోని 3వ సంఖ్య , మీ 1వ సంఖ్య కలయిక అద్భుతమైన నాయకత్వాన్ని ఇస్తుంది.

స్వభావం: వీరు చాలా ప్రతిష్టాత్మకమైన వారు. సూర్యుడు (1) , గురువు (3) కలవడం వల్ల వీరికి సమాజంలో గౌరవం లభిస్తుంది.

కెరీర్: ప్రభుత్వ ఉద్యోగాలు లేదా పెద్ద సంస్థలకు నాయకత్వం వహించే అవకాశం ఉంటుంది.

సలహా: మీరు కొంచెం మొండిగా ఉండవచ్చు, ఇతరుల సలహాలను కూడా వినడం నేర్చుకోవాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
నెంబర్ 2 (2, 11, 20, 29 తేదీల్లో పుట్టిన వారు)
Image Credit : Getty

నెంబర్ 2 (2, 11, 20, 29 తేదీల్లో పుట్టిన వారు)

ఏ నెలలో అయినా 2, 11, 20, 29 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 2 కిందకు వస్తారు. మార్చి నెలలో చంద్రుడు (2) , గురువు (3) కలయిక 'గజకేసరి యోగం' వంటి ఫలితాలను ఇస్తుంది.

స్వభావం: వీరు చాలా తెలివైన వారు , కరుణ గలవారు. గొప్ప ఊహాశక్తి ఉంటుంది.

కెరీర్: క్రియేటివ్ ఫీల్డ్స్, సైకాలజీ లేదా టీచింగ్ రంగాల్లో రాణిస్తారు.

సలహా: వీరి మనసు ఊరికే మారిపోతూ ఉంటుంది.  మానసిక స్థిరత్వం కోసం ధ్యానం చేయండి.

39
నెంబర్ 3 (3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన వారు)
Image Credit : Getty

నెంబర్ 3 (3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన వారు)

ఏ నెలలో అయినా 3, 12, 21, 30 తేదీల్లో పుట్టినవారంతా నెంబర్ 3 కిందకు వస్తారు.

ఈ తేదీల్లో పుట్టిన వారికి మార్చి నెలలో  గురు ప్రభావం ఉంటుంది.

స్వభావం: వీరు పరమ జ్ఞానులు. ఎప్పుడూ నవ్వుతూ, ఇతరులను నవ్విస్తూ ఉంటారు. ఆధ్యాత్మికత ఎక్కువగా ఉంటుంది.

కెరీర్: ప్రవచనాలు చెప్పడం, మతపరమైన సంస్థలు లేదా విద్యారంగంలో అగ్రస్థానంలో ఉంటారు.

సలహా: విలాసాల కోసం అనవసరంగా డబ్బు ఖర్చు చేయకండి.

49
నెంబర్ 4 (4, 13, 22, 31 తేదీల్లో పుట్టిన వారు)
Image Credit : Getty

నెంబర్ 4 (4, 13, 22, 31 తేదీల్లో పుట్టిన వారు)

ఏ నెలలో అయినా 4, 13, 22, 31 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 4 కిందకు వస్తారు. 

మార్చి నెలలో ఈ తేదీల్లో పుట్టిన వారికి… రాహువు (4) , గురువు (3) కలయిక వ్యాపార చతురతను ఇస్తుంది.

స్వభావం: వీరు సంప్రదాయాలకు విరుద్ధంగా ఆలోచిస్తారు. చాలా ప్రాక్టికల్‌గా ఉంటారు. కష్టపడే తత్వం ఎక్కువ.

కెరీర్: సాఫ్ట్‌వేర్, రీసెర్చ్ లేదా రియల్ ఎస్టేట్ రంగాల్లో రాణిస్తారు.

సలహా: జీవితంలో ఆకస్మిక మార్పులు రావచ్చు, ఎప్పుడూ ప్లాన్-బి సిద్ధంగా ఉంచుకోండి.

59
నెంబర్ 5 (5, 14, 23 తేదీల్లో పుట్టిన వారు)
Image Credit : Getty

నెంబర్ 5 (5, 14, 23 తేదీల్లో పుట్టిన వారు)

ఏ నెలలో అయినా 5, 14, 23 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 5 కిందకు వస్తారు.

మార్చి నెలలో ఈ తేదీల్లో పుట్టిన వారికి  బుధుడు (5) , గురువు (3) కలయిక అద్భుతమైన మేధస్సును ఇస్తుంది.

స్వభావం: వీరు మాటల మాంత్రికులు. మార్కెటింగ్ , బిజినెస్ డీల్స్ చేయడంలో వీరికి వీరే సాటి.

కెరీర్: బ్యాంకింగ్, మీడియా లేదా ట్రేడింగ్ రంగాల్లో విజయం సాధిస్తారు.

సలహా: ఒకే పనిపై ఏకాగ్రత పెట్టడం నేర్చుకోండి, తరచుగా మనసు మార్చుకోకండి.

69
నెంబర్ 6 (6, 15, 24 తేదీల్లో పుట్టిన వారు)
Image Credit : Getty

నెంబర్ 6 (6, 15, 24 తేదీల్లో పుట్టిన వారు)

ఏ నెలలో అయినా 6, 15, 24 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 6 కిందకు వస్తారు. మార్చి నెలలో ఈ తేదీల్లో పుట్టిన వారికి శుక్రుడు (6) , గురువు (3) కలయిక విలాసవంతమైన జీవితాన్ని ఇస్తుంది.

స్వభావం: వీరు అందం, కళలు , కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తారు. విలాసవంతమైన వస్తువుల పట్ల మక్కువ ఎక్కువ.

కెరీర్: డిజైనింగ్, ఫ్యాషన్, లేదా హోటల్ మేనేజ్‌మెంట్ రంగాల్లో రాణిస్తారు.

సలహా: ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్త, బరువు పెరిగే అవకాశం ఉంది.

79
నెంబర్ 7 (7, 16, 25 తేదీల్లో పుట్టిన వారు)
Image Credit : Getty

నెంబర్ 7 (7, 16, 25 తేదీల్లో పుట్టిన వారు)

కేతువు (7) , గురువు (3) కలయిక లోతైన ఆధ్యాత్మికతను ఇస్తుంది.

స్వభావం: వీరు లోతైన ఆలోచనాపరులు. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. దేన్నైనా లోతుగా పరిశోధిస్తారు.

కెరీర్: సైన్స్, రీసెర్చ్, జ్యోతిష్యం లేదా తత్వశాస్త్రంలో రాణిస్తారు.

సలహా: లోకంతో సంబంధం తెంచుకోకండి, సామాజికంగా కలవడం అవసరం.

89
నెంబర్ 8 (8, 17, 26 తేదీల్లో పుట్టిన వారు)
Image Credit : Getty

నెంబర్ 8 (8, 17, 26 తేదీల్లో పుట్టిన వారు)

శని (8) , గురువు (3) కలయిక కష్టపడి పైకి వచ్చే తత్వాన్ని ఇస్తుంది.

స్వభావం: వీరు చాలా గంభీరంగా ఉంటారు. విజయం ఆలస్యంగా వచ్చినా, అది చాలా స్థిరంగా ఉంటుంది.

కెరీర్: న్యాయశాస్త్రం, ఫైనాన్స్ లేదా ఇండస్ట్రీస్ నిర్వహణలో రాణిస్తారు.

సలహా: నిరాశవాదాన్ని వదిలేయండి, కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది.

99
నెంబర్ 9 (9, 18, 27 తేదీల్లో పుట్టిన వారు)
Image Credit : Getty

నెంబర్ 9 (9, 18, 27 తేదీల్లో పుట్టిన వారు)

కుజుడు (9) , గురువు (3) కలయిక వీరత్వాన్ని , పట్టుదలను ఇస్తుంది.

స్వభావం: వీరు పోరాట యోధులు. అన్యాయాన్ని అస్సలు సహించరు. సమాజం కోసం ఏదైనా చేయాలనుకుంటారు.

కెరీర్: డిఫెన్స్, స్పోర్ట్స్ లేదా మెడికల్ రంగాల్లో రాణిస్తారు.

సలహా: మీ తొందరపాటు నిర్ణయాల వల్ల చిక్కులు రావచ్చు, ఓర్పు వహించండి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఏషియానెట్ న్యూస్
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Kova Sweet: పాలు కాచే పనిలేకుండా మిల్క్ పౌడర్‌తో ఈజీగా కోవాలు చేసేయండిలా
Recommended image2
Diamond Ring: అమ్మాయిల మనసు దోచే లైట్ వెయిట్ డైమండ్ రింగ్స్
Recommended image3
ఈ పండు గుజ్జుతో ఫేస్ ప్యాక్ రోజూ వేశారంటే వారంలో ముఖానికి మెరుపు ఖాయం
Related Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు కారణం లేకుండా మీ జీవితంలోకి రారు, అస్సలు వదులుకోకూడదు
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు కష్టాలను కూడా అదృష్టంగా మార్చుకుంటారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved