నెలరోజుల ఫోన్ వాడకుండా ఉండగలరా? రూ.8లక్షలు మీకే..!
మీరు కనుక నెల రోజులు మీ ఫోన్ కి దూరంగా ఉంటే... ఆ కంపెనీ మీకు రూ.8లక్షలు ఆఫర్ చేస్తుంది. మరి ఈ బంపర్ ఆఫర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని ఉందా..? ఇంకెందుకు ఆలస్యం చదివేయండి..
mobile phone ban
ఈ రోజుల్లో ఫోన్ వాడనివారు ఎవరూ ఉండరు. ఉదయం లేవగానే చేతిలో ఫోన్ ఉండాల్సిందే. మళ్లీ రాత్రి పడుకునే క్షణం ముందు వరకు ఫోన్ చూస్తేనే ఉంటున్నారు. రోజంతా ఎంత పని ఉన్నా.. ఫోన్ వాడకుండా ఉండేవారు చాలా అరుదు అనే చెప్పొచ్చు. ఇంతలా ఫోన్ వాడేవారు ఉన్నవారికి ఓ కంపెనీ అద్భుతమైన ఆఫర్ ఇచ్చింది. మీరు కనుక నెల రోజులు మీ ఫోన్ కి దూరంగా ఉంటే... ఆ కంపెనీ మీకు రూ.8లక్షలు ఆఫర్ చేస్తుంది. మరి ఈ బంపర్ ఆఫర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని ఉందా..? ఇంకెందుకు ఆలస్యం చదివేయండి..
ప్రపంచంలో వివిధ రకాల పోటీలు జరుగుతున్నాయి, మీరు దాని గురించి వినే ఉంటారు. ఎక్కడో ఒక చోట ఎక్కువ నిద్రించడానికి పోటీ, ఎక్కడో తక్కువ సమయంలో ఎక్కువ తిండి తినాలనే పోటీ లాంటివి నిర్వహిస్తారు. మీరు ఈ పోటీలో గెలిస్తే, మీకు బహుమతి కూడా వస్తుంది. అలాంటి మరో పోటీ గురించి ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం.
phone usage in kids
ఒక యోగర్ట్ కంపెనీ పోటీని నిర్వహిస్తోంది, దీనిలో పోటీదారుడు తన మొబైల్ ఫోన్‌కు ఒక నెల పాటు పూర్తిగా దూరంగా ఉండాలి. అందుకు ప్రతిగా రూ.8 లక్షలు బహుమతిగా ఇస్తారు. పోటీని నిర్వహించే బ్రాండ్ పేరు సిగ్గి, ఐస్‌ల్యాండ్‌కు చెందిన పెరుగు బ్రాండ్. ఈ పోటీ పేరు సిగ్గీ అనే యోగర్ట్ బ్రాండ్ నిర్వహిస్తున్న 'డిజిటల్ డిటాక్స్ ప్రోగ్రామ్'. ఈ పోటీలో మీరు ఒక నెల పాటు మీ మొబైల్ ఫోన్‌కు పూర్తిగా దూరంగా ఉండాలి. ఈ పోటీ 'డ్రై జనవరి' పోటీ నుండి ప్రేరణ పొందింది.
ambani phone.
ఈ కాంటెస్ట్‌లో పాల్గొనే వ్యక్తులు తమ స్మార్ట్ ఫోన్లను బాక్స్‌లో భద్రంగా ఉంచుకోవాలి. వచ్చే ఒక నెల పాటు వాటిని ఉపయోగించకూడదు. పది మంది పోటీదారులను ఎంపిక చేసి.. వారిలో ఒకరికి ఈ రూ.8లక్షల బహుమతి అందిస్తారు.
ambani phone 1
పోటీలో విజేతకు బహుమతి లభిస్తుంది
$10,000 (రూ. 8.5 లక్షలు), అత్యవసర పరిస్థితుల కోసం ప్రీపెయిడ్ సిమ్ కార్డ్‌తో కూడిన రెట్రో ఫ్లిప్ ఫోన్ , మూడు నెలల పాటు ఉచిత సిగ్గీ పెరుగు కూడా అందిస్తారు.
ఈ పోటీకి దరఖాస్తు చేయడానికి చివరి తేదీ జనవరి 31, దీని గురించి పూర్తి సమాచారం సిగ్గి వెబ్సైట్లో ఇవ్వబడింది. డిజిటల్ బ్రేక్‌లు మీ ఆరోగ్యానికి మంచి మాత్రమే కాదు, మంచి ఫలితాలు కూడా ఇస్తాయి అనే ఉద్దేశంతో ఈ పోటీని నిర్వహిస్తుండటం విశేషం.