MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Parenting: మీ పిల్లలు ఎప్పుడూ గొడవ పడుతున్నారా? ఈ 5 చేస్తే వారి మధ్య ప్రేమ పెరగడం పక్కా!

Parenting: మీ పిల్లలు ఎప్పుడూ గొడవ పడుతున్నారా? ఈ 5 చేస్తే వారి మధ్య ప్రేమ పెరగడం పక్కా!

Parenting: ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే చాలు… రోజులో కనీసం ఒకటి, రెండు సార్లైనా వారి మధ్య గొడవలు రావడం సహజం. చిన్న చిన్న విషయాలకే పోట్లాడుకునే పిల్లలను చూసి తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటారు. మరి ఈ పిల్లల మధ్య ప్రేమ పెరగాలంటే పేరెంట్స్ ఏం చేయాలో చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : Sep 29 2026, 03:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
పిల్లల మధ్య ప్రేమ పెంచే 5 అలవాట్లు
Image Credit : AI

పిల్లల మధ్య ప్రేమ పెంచే 5 అలవాట్లు

ఇంట్లో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే వారి మధ్య చిన్నచిన్న గొడవలు జరగడం చాలా సహజం. బొమ్మ ఎవరిది, టీవీ రిమోట్ ఎవరి చేతిలో ఉండాలి, అమ్మ పక్కన ఎవరు కూర్చోవాలి, ఎవరి మాట వినాలి వంటి విషయాలపై పిల్లలు తరచూ వాదించుకోవచ్చు. కొన్నిసార్లు ఈ గొడవలు తల్లిదండ్రులకు చాలా ఇబ్బందిగా అనిపిస్తాయి. అయితే పిల్లలు తమ భావాలను ఎలా వ్యక్తపరచాలో నేర్చుకుంటున్న దశలో ఇలాంటివి జరగడం సహజమే. తల్లిదండ్రులు సరైన విధంగా స్పందిస్తే పిల్లల మధ్య అనుబంధం క్రమంగా బలపడుతుంది. అందుకోసం ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఒకరితో ఒకరిని పోల్చడం మానేయాలి
Image Credit : Freepik

ఒకరితో ఒకరిని పోల్చడం మానేయాలి

“అన్నయ్యను చూడు ఎంత బాగా చదువుతున్నాడో లేదా చెల్లెను చూడు చెప్పిన మాట ఎంత బాగా వింటోందో” అంటూ పోల్చడం తల్లిదండ్రులకు సాధారణంగా అనిపించినా, పిల్లల మనసులో మాత్రం అసూయ లేదా అసంతృప్తిని పెంచవచ్చు. ప్రతి పిల్లవాడికి తనదైన స్వభావం, ఆసక్తులు, సామర్థ్యాలు ఉంటాయి. కాబట్టి ఒకరిని మరొకరితో పోల్చకుండా, ప్రతి పిల్లవాడి ప్రత్యేకతను గుర్తించి ప్రశంసించడం మంచిది. ముఖ్యంగా ఒక పిల్లవాడిని పొగడటానికి మరో పిల్లవాడిని తక్కువ చేసి అస్సలు మాట్లాడకూడదు.

36
కలిసి చేసే పనులకు ప్రాధాన్యం ఇవ్వడం
Image Credit : Freepik

కలిసి చేసే పనులకు ప్రాధాన్యం ఇవ్వడం

పిల్లలు ఎప్పుడూ పోటీ పడే పరిస్థితుల్లో ఉంటే ఒకరిని ఒకరు ప్రత్యర్థులుగా భావించే అవకాశం ఉంటుంది. అందుకే గెలుపు, ఓటమి లేని పనులను చేయించాలి. కలిసి పజిల్ పూర్తి చేయడం, మొక్కలకు నీళ్లు పోయడం, గదిని సర్దడం, కథల పుస్తకం చదవడం, కలిసి వంటలో హెల్ప్ చేయడం వంటి పనులు చేయించవచ్చు. ఒకే లక్ష్యాన్ని సాధించడానికి ఇద్దరూ కలిసి పనిచేసినప్పుడు “నేను–నువ్వు” అనే భావన కంటే “మనిద్దరం” అనే భావన బలపడుతుంది.

46
వారే సమస్యను పరిష్కరించేలా చేయడం
Image Credit : our own

వారే సమస్యను పరిష్కరించేలా చేయడం

గొడవ జరిగిన ప్రతిసారీ వెంటనే తీర్పు చెప్పకుండా, సమస్యను వాళ్లే పరిష్కరించుకునేలా చేయాలి. ఒక బొమ్మ కోసం ఇద్దరూ గొడవపడితే వెంటనే ఒకరిని మందలించడం లేదా మరొకరి వైపు నిలబడటం కంటే, దాన్ని ఎలా పంచుకోవచ్చో సూచించాలి. కొంతసేపు ఒకరు ఆడటం, తర్వాత మరొకరు ఆడటం లేదా కలిసి ఆడటం వంటివి చెప్పవచ్చు. ఇలా చేయడం ద్వారా పిల్లలు తమ సమస్యలను మాటల ద్వారా పరిష్కరించుకోవడం నేర్చుకుంటారు.

56
ప్రత్యేకంగా కొంత సమయం గడపడం
Image Credit : Freepik

ప్రత్యేకంగా కొంత సమయం గడపడం

తల్లిదండ్రుల దృష్టి ఆకర్షించడం కోసం కూడా పిల్లలు ఒకరితో ఒకరు పోటీ పడవచ్చు. అందుకే రోజులో ఎక్కువ సమయం కాకపోయినా, ప్రతి పిల్లవాడితో వ్యక్తిగతంగా మాట్లాడటం, వారికి ఇష్టమైన ఆట ఆడటం, పుస్తకం చదవడం వంటి చిన్న చిన్నపనులు పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. ముఖ్యంగా తల్లిదండ్రుల ప్రేమను పొందడానికి తోబుట్టువుతో పోటీ పడాల్సిన అవసరం లేదనే భావన పిల్లల్లో కలుగుతుంది.

66
ప్రేమను వ్యక్తపరచే సందర్భాలు సృష్టించడం
Image Credit : AI

ప్రేమను వ్యక్తపరచే సందర్భాలు సృష్టించడం

అన్నయ్య పుట్టినరోజున చెల్లెలితో చిన్న గ్రీటింగ్ కార్డు తయారు చేయించడం, చెల్లెలు అనారోగ్యంగా ఉంటే అన్నయ్యతో ఆమెకు నీళ్లు ఇప్పించడం, ఒకరి విజయాన్ని మరొకరితో అప్రిషియేట్ చేయించడం వంటివి చేయవచ్చు. “నీ చెల్లెలు నిన్ను చూసి చాలా సంతోషపడింది” లేదా “నీ అన్నయ్యకు నువ్వు హెల్ప్ చేసినందుకు అతను హ్యాపీగా ఫీల్ అయ్యాడు వంటివి చెప్పడం ద్వారా పిల్లలు తమ ప్రవర్తన వల్ల తోబుట్టువుకు కలిగే ఆనందాన్ని గుర్తించగలుగుతారు. పేరెంట్స్ ఓపికగా ఇలాంటి పనులు చేయడం ద్వారా పిల్లల మధ్య బంధం మరింత బలపడుతుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
చిన్నారుల సంరక్షణ
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Ear Cuff Jhumka:చీరలు,లెహంగా మీదకు గ్రాండ్ లుక్ ఇచ్చే ఇయర్ కఫ్ జుంకాలు
Recommended image2
Divorce Survey: విడాకుల తర్వాత మెమోరీస్ దాచుకుంటున్నారట.. మాజీ భాగస్వాములతో హద్దులపై కొత్త సర్వే
Recommended image3
Mutton: చలికాలంలోనే మటన్ ఎందుకు ఎక్కువ రుచిగా ఉంటుంది..? అసలు కారణం ఇదే..!
Related Stories
Recommended image1
Birth Date: ఈ 4 తేదీల్లో పుట్టినవారు ఏ పని చేసినా త్వరగా సక్సెస్ అవుతారు!
Recommended image2
Jowar Roti: జొన్న రొట్టె రోజూ తింటున్నారా? అయితే ఈ తప్పులు అస్సలు చేయకండి!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved