MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Birth Date: ఈ 4 తేదీల్లో పుట్టినవారు ఏ పని చేసినా త్వరగా సక్సెస్ అవుతారు!

Birth Date: ఈ 4 తేదీల్లో పుట్టినవారు ఏ పని చేసినా త్వరగా సక్సెస్ అవుతారు!

Birth Date: న్యూమరాలజీ ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టినవారిలో ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. వారు ఏ పని చేసినా త్వరగా సక్సెస్ అవుతారు. ముఖ్యంగా కొన్ని పుట్టిన తేదీలను విజయానికి అనుకూలమైన తేదీలుగా పరిగణిస్తారు. ఆ అదృష్ట తేదీలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

2 Min read
Author : Kavitha G
Published : Sep 28 2026, 03:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
త్వరగా సక్సెస్ అయ్యే పుట్టిన తేదీలు
Image Credit : Chatgpt

త్వరగా సక్సెస్ అయ్యే పుట్టిన తేదీలు

మనలో చాలామందికి పుట్టిన తేదీకి, వ్యక్తిత్వానికి, జీవితంలో ఎదురయ్యే పరిణామాలకు ఏదైనా సంబంధం ఉందా అనే ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా సంఖ్యా శాస్త్రం, జ్యోతిష్య శాస్రాల ప్రకారం పుట్టిన తేదీ ఆధారంగా వ్యక్తుల స్వభావం, ఆలోచనా విధానం, నిర్ణయాలు తీసుకునే తీరు గురించి అంచనా వేయవచ్చు. కొన్ని తేదీల్లో పుట్టినవారు పట్టుదల, ఆత్మవిశ్వాసం, నాయకత్వం, వేగంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం వంటి లక్షణాలను కలిగి ఉంటారని న్యూమరాలజీ చెబుతోంది. దానివల్ల వారు జీవితంలో త్వరగా సక్సెస్ అవుతారట. ఆ తేదీలేంటో చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
1వ తేదీన జన్మించిన వారు
Image Credit : chatgpt

1వ తేదీన జన్మించిన వారు

సంఖ్యా శాస్త్రం ప్రకారం.. ఏ నెలలో అయినా 1వ తేదీన పుట్టినవారిపై సూర్యుడి ప్రభావం ఉంటుంది. వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువ. ఇతరులు చెప్పిన దారిలో నడవడం కంటే తమకంటూ ఒక ప్రత్యేకమైన మార్గాన్ని ఎంచుకోవడాన్ని వీరు ఇష్టపడతారు. ఒక పని చేయాలని నిర్ణయించుకున్న తర్వాత దాన్ని పూర్తి చేయాలనే పట్టుదల ఎక్కువ. ఉద్యోగం, వ్యాపారం, సృజనాత్మక రంగం లేదా వృత్తి ఏదైనా సరే.. త్వరగా అవకాశాలను అందిపుచ్చుకునే స్వభావం వీరిలో ఉంటుంది.

35
5వ తేదీన పుట్టినవారు
Image Credit : chatgpt

5వ తేదీన పుట్టినవారు

ఏ నెలలో అయినా 5వ తేదీన పుట్టినవారు చాలా చురుకుగా, తెలివిగా వ్యవహరిస్తారని న్యూమరాలజీ చెబుతోంది. కొత్త విషయాలను త్వరగా నేర్చుకోవడం, పరిస్థితులకు అనుగుణంగా మారడం వీరి ప్రత్యేకత. ఎక్కడ అవకాశం కనిపించినా దాన్ని ఉపయోగించుకోవడానికి వీరు ప్రయత్నిస్తారు. కమ్యూనికేషన్, వ్యాపారం, మార్కెటింగ్, మీడియా వంటి రంగాల్లో వీరి చురుకుదనం వల్ల త్వరగా గుర్తింపు పొందుతారు.

45
8వ తేదీన పుట్టినవారు
Image Credit : chatgpt

8వ తేదీన పుట్టినవారు

సంఖ్యా శాస్త్రం ప్రకారం ఏ నెలలో అయినా 8వ తేదీన జన్మించినవారు కష్టపడి పనిచేసే స్వభావం కలిగి ఉంటారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు భయపడకుండా ఓర్పుతో ముందుకు సాగడం వీరి బలం. వీరికి విజయం కొన్నిసార్లు ఆలస్యమైనప్పటికీ, స్థిరంగా కొనసాగుతుంది. వీరు బాధ్యత, క్రమశిక్షణ, పట్టుదలతో పనిచేయడం వల్ల కెరీర్‌లో మంచి స్థాయికి చేరుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందట.

55
9వ తేదీన జన్మించినవారు
Image Credit : chatgpt

9వ తేదీన జన్మించినవారు

న్యూమరాలజీ ప్రకారం.. 9వ తేదీన పుట్టినవారు ధైర్యం, ఆత్మవిశ్వాసం, ఉత్సాహం కలిగి ఉంటారు. వీరు ఏదో ఒకటి సాధించాలనే బలమైన కోరికతో ముందుకు సాగుతారు. కష్టమైన పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గరు. ఇతరులకు సహాయం చేయాలనే మనస్తత్వం కూడా వీరిలో ఎక్కువగా ఉంటుంది. తమ ప్రతిభను పూర్తిగా ఉపయోగించుకుని పనిచేస్తే జీవితంలో వేగంగా గుర్తింపు, విజయాన్ని పొందుతారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac Signs: ఈ రాశులవారికి 40 ఏళ్లు దాటాక రాజయోగం పడుతుంది, పట్టిందల్లా బంగారమే..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి!
Recommended image3
Weekly Horoscope: ఈ వారం ఈ నాలుగు రాశులవారు ఎంత ఓపికగా ఉంటే అంత మంచిది!
Related Stories
Recommended image1
Birth Stars: ఈ 3 నక్షత్రాల్లో పుట్టిన అమ్మాయిలు భర్తను ప్రాణంగా ప్రేమిస్తారు!
Recommended image2
Chanakya Niti: చాణక్యుడి ప్రకారం మనిషి పతనానికి దారితీసే 5 అలవాట్లు ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved