MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Divorce Survey: విడాకుల తర్వాత మెమోరీస్ దాచుకుంటున్నారట.. మాజీ భాగస్వాములతో హద్దులపై కొత్త సర్వే

Divorce Survey: విడాకుల తర్వాత మెమోరీస్ దాచుకుంటున్నారట.. మాజీ భాగస్వాములతో హద్దులపై కొత్త సర్వే

Divorce Survey: విడాకుల తర్వాత పెళ్లి ఫొటోలు ఏం చేస్తారు? మాజీ భాగస్వామితో అన్ని సంబంధాలు తెంచుకోవాల్సిందేనా? డివోర్స్ తర్వాత కొత్త జీవితాన్ని ప్రారంభించే సమయంలో మాజీతో ఎలా ఉండాలనే అంశంపై ఓ కొత్త సర్వేలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.

2 Min read
Author : Nandini Arava
Published : Sep 29 2026, 03:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
విడాకుల తర్వాత పెళ్లి ఫొటోలు ఏం చేస్తారు?
Image Credit : stockPhoto

విడాకుల తర్వాత పెళ్లి ఫొటోలు ఏం చేస్తారు?

విడాకులు తీసుకున్న తర్వాత పాత జ్ఞాపకాలను పూర్తిగా చెరిపేయాల్సిందేనా? మాజీ భాగస్వామితో సంబంధాలు తెంచుకోవాల్సిందేనా? దీనిపై తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. విడాకులు తీసుకున్న 10 మందిలో 7 మంది ఇప్పటికీ తమ పెళ్లి ఫొటోలను దాచుకుంటున్నట్లు సర్వే వెల్లడించింది.

భారత్‌కు చెందిన మ్యాచ్మేకింగ్ యాప్ Rebounce ఈ సర్వే నిర్వహించింది. 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న, కనీసం రెండేళ్ల క్రితం విడాకులు తీసుకున్న 9,283 మంది ఇందులో పాల్గొన్నారు. మాజీ భాగస్వామితో హద్దులు, పాత జ్ఞాపకాలు, కొత్త సంబంధాల్లో ఎదురయ్యే సమస్యలపై వారి అభిప్రాయాలను సేకరించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
సంబంధాలు తెంచుకోవడం సాధ్యమేనా?
Image Credit : chatgpt.com

సంబంధాలు తెంచుకోవడం సాధ్యమేనా?

సర్వే ప్రకారం.. మాజీ భాగస్వామితో పూర్తిగా సంబంధాలు తెంచుకోవడమనే అభిప్రాయం సరైంది కాదని 35 ఏళ్లు పైబడిన విడాకులు తీసుకున్న వారిలో 47 శాతం మంది చెప్పారు. ముఖ్యంగా పిల్లలు ఉన్నప్పుడు మాజీ భాగస్వామితో పూర్తిగా సంబంధాలు తెంచుకోవడం సాధ్యం కాకపోవచ్చు. దాదాపు 31 శాతం మంది మాజీ భాగస్వామితో అప్పుడప్పుడు మాట్లాడుతున్నట్లు తెలిపారు. పిల్లల స్కూల్ కార్యక్రమాలు, ఆస్తి లేదా చట్టపరమైన విషయాలు, కుటుంబ సంబంధాలే ఇందుకు ప్రధాన కారణాలుగా ఉన్నాయని సర్వే పేర్కొంది.

34
పిల్లల వల్లే
Image Credit : Getty

పిల్లల వల్లే

ఇక పెళ్లి ఫొటోల విషయానికి వస్తే.. 70 శాతం మంది వాటిని ఇప్పటికీ తమ వద్ద ఉంచుకున్నట్లు తెలిపారు. అయితే ఫొటోలు దాచుకోవడం అంటే పాత వివాహ బంధాన్ని కొనసాగించాలనే ఉద్దేశం కాదని సర్వే అభిప్రాయపడింది. ముఖ్యంగా పిల్లలు, కుటుంబ జ్ఞాపకాలు, కలిసి గడిపిన సంవత్సరాలకు సంబంధించిన రికార్డుగా వాటిని ఉంచుకునే అవకాశం ఉందని పేర్కొంది.

44
కొత్త జీవితంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?
Image Credit : Getty

కొత్త జీవితంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?

అలాగే 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్న విడాకులు తీసుకున్నవారిలో 36 శాతం మంది గతంలోని కొన్ని ప్రదేశాలు, వేడుకలు, జ్ఞాపకాలపై ఇప్పటికీ సానుకూల భావన ఉందని చెప్పారు. అయితే అవి తమ ప్రస్తుత సంబంధంపై ప్రభావం చూపడం లేదని తెలిపారు.

విడాకుల తర్వాత మాజీ భాగస్వామితో ఎలా ఉండాలనే విషయంలో అందరికీ ఒకే నియమం వర్తించదు. పిల్లలు, కుటుంబం, ఆస్తులు, గత బంధం వంటి పరిస్థితులను బట్టి హద్దులు మారుతుంటాయి. ముఖ్యంగా కొత్త సంబంధంపై పాత బంధం ప్రభావం చూపకుండా ఉండటమే ప్రధాన అంశంగా సర్వే పేర్కొంది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mutton: చలికాలంలోనే మటన్ ఎందుకు ఎక్కువ రుచిగా ఉంటుంది..? అసలు కారణం ఇదే..!
Recommended image2
Jowar Roti: జొన్న రొట్టె రోజూ తింటున్నారా? అయితే ఈ తప్పులు అస్సలు చేయకండి!
Recommended image3
Kiwi: కివీని ఎలా తింటున్నారు? ఇలా మాత్రం తినకండి, నిపుణులు ఏం చెప్తున్నారంటే?
Related Stories
Recommended image1
Kiwi: కివీని ఎలా తింటున్నారు? ఇలా మాత్రం తినకండి, నిపుణులు ఏం చెప్తున్నారంటే?
Recommended image2
Bedroom Deep Cleaning: ఎంత క్లీన్ చేసినా బెడ్ రూంలో దుమ్ము ఉంటుందా? అయితే ఈ సింపుల్ టిప్స్ ట్రై చేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved