MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Face Tan: ఈ పండు గుజ్జుతో రుద్దారంటే ముఖంపై ఉన్న ట్యాన్ మొత్తం మాయం

Face Tan: ఈ పండు గుజ్జుతో రుద్దారంటే ముఖంపై ఉన్న ట్యాన్ మొత్తం మాయం

Face Tan: ఎండకు ముఖం నల్లగా మారిపోతుంది. దీనికి కారణం ట్యాన్ పట్టేయడమే.  కేవలం 10 నిమిషాల్లోనే ముఖంపై ట్యాన్‌ను తొలగించుకుని, మళ్లీ కాంతివంతంగా మారొచ్చు. దీనికి మీరు ఉపయోగించాల్సిన పండు ఒకటుంది.

1 Min read
Author : Haritha Chappa
Published : Apr 26 2026, 06:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ట్యాన్ వల్ల అందవిహీనంగా
Image Credit : Getty

ట్యాన్ వల్ల అందవిహీనంగా

వేసవిలో ఒక్కసారి ఎండలో బయటికి వెళ్లినా చాలు  ముఖంపై ట్యాన్ పట్టేస్తుంది. నల్లటి మచ్చలు కూడా వస్తాయి. దీని వల్ల అందవిహీనంగా కనిపిస్తారు. ఇంట్లోనే సహజమైన పద్ధతుల్లో ఈ ట్యాన్‌ను  చాలా సులువుగా వదిలించుకోవచ్చు. ఇందుకు మీకు బొప్పాయి పండు అద్భుతంగా పనిచేస్తుంది. అ పండు చాలా తక్కువ ధరకే మార్కెట్లో దొరుకుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఫేస్ ప్యాక్ తయారీ
Image Credit : Getty

ఫేస్ ప్యాక్ తయారీ

ముఖంపై ఉన్న ట్యాన్ పోవడానికి బొప్పాయితో  ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. ఇందుకోసం బొప్పాయి, తేనె అవసరం. ముందుగా, కొన్ని బొప్పాయి ముక్కలు తీసుకుని మెత్తగా గుజ్జులా చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో అర కప్పు బొప్పాయి గుజ్జు, ఒక చెంచా తేనె తీసుకోండి. దాన్ని బాగా కలిపాలి.

34
వాడే విధానం ఇలా
Image Credit : Getty

వాడే విధానం ఇలా

ఈ రెండు పదార్థాలను బాగా కలిపి, మెత్తటి పేస్ట్‌లా తయారు చేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్‌ను ముఖం, మెడ భాగాలకు ఫేస్ ప్యాక్‌లా బాగా పట్టించాలి. ఈ మిశ్రమంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. 

మంచి ఫలితాలు రావాలంటే, ఈ ప్యాక్‌ను ముఖంపై సుమారు 10 నిమిషాల పాటు ఉంచుకోవాలి. పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. అయితే, ప్యాక్ వేసుకునే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్యాక్ తీసేశాక కనీసం 4 నుంచి 5 గంటల వరకు ముఖానికి సబ్బు పెట్టకపోతే పూర్తి ప్రయోజనం ఉంటుంది.

44
మంచి ఫలితాల కోసం
Image Credit : Asianet News

మంచి ఫలితాల కోసం

ట్యాన్‌ను సహజంగా తొలగించడానికి బొప్పాయి, తేనె మిశ్రమం బాగా పనిచేస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ వాడితే చర్మం కాంతివంతంగా మారుతుంది. పొడి చర్మాన్ని మృదువుగా మార్చడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా స్వచ్ఛమైన తేనెనే వాడటానికి ప్రయత్నించండి. రసాయనాలు కలిపిన తేనె చర్మానికి హాని చేస్తుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
సౌందర్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Printed Saree: ఆఫీస్ వేర్ కి పర్ఫెక్ట్ గా సూటయ్యే ప్రింటెడ్ చీరలు
Recommended image2
Chapati Dough: చపాతీ పిండి కలిపిన కాసేపటికే నల్లగా ఎందుకు మారుతుంది? తాజాగా ఉండాలంటే ఏం చేయాలి?
Recommended image3
Silver Anklet:భారత్ లో కాకుండా ఏదేశంలో మహిళలు పట్టీలు ధరిస్తారో తెలుసా
Related Stories
Recommended image1
Oats: ఓట్స్ తింటే కొలెస్ట్రాల్ నిజంగా తగ్గుతుందా? రెండ్రోజుల్లోనే ఫలితం కనిపిస్తుందా?
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వాళ్లు అక్రమ సంబంధాలు పెట్టుకునే అవకాశం ఎక్కువ, వీరితో జాగ్రత్త
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved