MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Multani Mitti: ముల్తానీమట్టిలో ఇదొక్కటి కలిపి ముఖానికి రాయండి చాలు.. మెరుపు గ్యారెంటీ

Multani Mitti: ముల్తానీమట్టిలో ఇదొక్కటి కలిపి ముఖానికి రాయండి చాలు.. మెరుపు గ్యారెంటీ

Multani Mitti: ముఖానికి సహజమైన కాంతి కావాలా? అయితే ముల్తానీ మట్టిని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి. ఇందులో కొన్ని పదార్థాలు కలిపి రాయడం వల్ల ముఖంలో మెరుపు పెరుగుతుంది. మీ చర్మతత్వాన్ని బట్టి ఏమి కలపాలో తెలుసుకోండి.

2 Min read
Author : Haritha Chappa
Published : Aug 05 2026, 12:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ముల్తానీమట్టితో మెరుపు
Image Credit : Gemini AI

ముల్తానీమట్టితో మెరుపు

ప్రకాశవంతమైన చర్మం కోసం మీరు ఖరీదైన కాస్మోటిక్స్ వాడుతున్నారా? నిజానికి చాలా తక్కువ ఖర్చులో మన ఇంట్లోనే లభించే సహజసిద్ధమైన పదార్థాలతో ముఖాన్ని కాంతిమంతంగా మార్చుకోవచ్చు. అటువంటి ప్రకృతి ప్రసాదించిన ఔషధాలలో ‘ముల్తానీ మట్టి’ ఒకటి. దీన్ని పూర్వకాలం నుంచి సౌందర్య ఉత్పత్తుల్లో వాడుతున్నారు. చర్మంలోని అదనపు జిడ్డు, ధూళి, మురికిని ఇది తొలగిస్తుంది. అయితే ముల్తానీ మట్టిని నేరుగా కాకుండా మీ చర్మ తత్వానికి తగ్గట్టు... కొన్ని సహజ పదార్థాలతో కలిపి వాడితే రెట్టింపు ఫలితాలు లభిస్తాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఆయిలీ స్కిన్ అయితే
Image Credit : Pexels

ఆయిలీ స్కిన్ అయితే

మీది ఆయిల్ స్కిన్ అయితే ముల్తానీ మట్టిలో రోజ్ వాటర్ కలిపి పేస్ట్‌లా చేసి ముఖానికి రాసుకోవడం మంచిది. ఇది చర్మంలోని అధిక నూనెను ఉత్పత్తి కాకుండా అడ్డుకుంటుంది. ముఖాన్ని తాజాగా ఉంచుతుంది. మీది పొడి చర్మం అయితే లేదా ఎండ వల్ల ట్యానింగ్ సమస్య వచ్చినా పెరుగు లేదా తేనెను ముల్తానీమట్టిలో కలిపి ఉపయోగిస్తే మంచిది. పెరుగులోని లాక్టిక్ యాసిడ్ చర్మంపై ఉన్న మృతకణాలను తొలగిస్తే, తేనె చర్మానికి అవసరమైన తేమను అందించి మెరుపును పెంచుతుంది. ఇక ఎండ దెబ్బకు చర్మం కందిపోయినట్లయితే అలోవెరా జెల్ కలిపి వాడటం వల్ల చర్మానికి మంచి చల్లదనం లభిస్తుంది. ముఖం సహజంగా ప్రకాశించాలంటే ముల్తానీ మట్టిలో ఒక చిటికెడు పసుపు, రోజ్ వాటర్ కలిపి ఫేస్ ప్యాక్‌లా ఉపయోగించవచ్చు.

Related Articles

Related image1
Saturn Transit: శని గ్రహం వల్ల ఈ 4 రాశులవారికి రెండున్నరేళ్ల పాటూ పట్టిందల్లా బంగారమే
Related image2
IRCTC: మీకు తెలుసా? రైలు టికెట్‌పై ఈ ప్రయాణికులకు 75 శాతం డిస్కౌంట్
33
ఈ జాగ్రత్తలు తీసుకోండి
Image Credit : Pexels

ఈ జాగ్రత్తలు తీసుకోండి

ఈ ఫేస్ ప్యాక్‌లను ఉపయోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. రెండు చెంచాల ముల్తానీ మట్టికి తగిన సహజ పదార్థాలను కలిపి మెత్తటి పేస్ట్‌లా చేసుకుని ముఖం, మెడ భాగంలో రాయాలి. 10 నుండి 15 నిమిషాల పాటు ఉంచి, ఆరిన తర్వాత చల్లటి లేదా సాధారణ నీటితో మెల్లగా మసాజ్ చేస్తూ శుభ్రం చేసుకోవాలి. ఫేస్ ప్యాక్‌లో పసుపు ఉపయోగిస్తున్నట్లయితే కేవలం చిటికెడు మాత్రమే కలపాలి. లేదంటే ముఖం పసుపు రంగులోకి మారే అవకాశం ఉంది. ఈ ప్యాక్‌లను వారానికి ఒకటి లేదా రెండు సార్లు వాడడం వల్ల చర్మ సమస్యలు తగ్గి, ముఖం కెమికల్స్ ప్రభావం లేకుండా అందంగా మారుతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
సౌందర్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Rakhi: మార్కెట్లో కొనే అవసరం లేకుండా, ఇంట్లోనే రాఖీ తయారు చేసేయండిలా
Recommended image2
Bangles:ఎంత చూసినా తనివి తీరని గాజుల డిజైన్లు.. చీరల మీదకు అదిరిపోతాయి
Recommended image3
Matheran: మిట్ట మధ్యాహ్నమే చీకట్లు పడే ప్రదేశం ఇది.. మన దేశంలో ఎక్కడ ఉందో తెలుసా?
Related Stories
Recommended image1
Saturn Transit: శని గ్రహం వల్ల ఈ 4 రాశులవారికి రెండున్నరేళ్ల పాటూ పట్టిందల్లా బంగారమే
Recommended image2
IRCTC: మీకు తెలుసా? రైలు టికెట్‌పై ఈ ప్రయాణికులకు 75 శాతం డిస్కౌంట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved