MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Potato Fry: కడాయికి అతుక్కోకుండా.. హోటల్ స్టైల్ లో పొటాటో ఫ్రై క్రిస్పీగా రావాలా? ఈ చిట్కా మీ కోసమే..!

Potato Fry: కడాయికి అతుక్కోకుండా.. హోటల్ స్టైల్ లో పొటాటో ఫ్రై క్రిస్పీగా రావాలా? ఈ చిట్కా మీ కోసమే..!

Potato Fry: పొటాటో ఫ్రై ఇంట్లో ఎప్పుడు చేసినా రుచిగా రావడం లేదా? అయితే, రెండే రెండు సింపుల్ చిట్కాలు ఫాలో అయితే.. పొటాటో ఫ్రై కరకరలాడుతూ, రుచిగా వస్తుంది.  మళ్లీ మళ్లీ ఇలానే తినాలి అనిపిస్తుంది.

2 Min read
Author : ramya Sridhar
Published : Aug 05 2026, 10:06 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Crispy Potato Fry
Image Credit : our own

Crispy Potato Fry

ఇంట్లో బంగాళదుంప ఫ్రై చేస్తున్న ప్రతిసారీ.. అవి కడాయికి అతుక్కుపోతూ ఉంటాయి. ఎంత ట్రై చేసినా ఫ్రై రుచిగా రాకపోగా.. మెత్తగా అయిపోతూ ఉంటాయి.కానీ, హోటల్ లో మాత్రం బంగాళదుంప ఫ్రై, ఫ్రెంచ్ ఫ్రైస్ మంచిగా కరకరలాడుతూ రుచిగా ఉంటాయి. మరి, ఇంట్లో చేసినా అలా రుచిగా, క్రంచీగా రావాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
చెఫ్ సీక్రెట్...
Image Credit : AI Image

చెఫ్ సీక్రెట్...

బంగాళ దుంపలను దాదాపు అందరూ కోసిన వెంటనే ఫ్రై చేసేస్తారు. ఎందుకంటే.. బంగాళ దుంప కట్ చేసిన కాసేపటికే నల్లగా మారిపోతుంది. అలా అవ్వకూడదని వెంటనే వండేస్తూ ఉంటారు. కానీ, అలా చేయకూడదు. బంగాళ దుంప ముక్కలను మీకు నచ్చిన ఆకారంలో కోట్ చేసిన వెంటనే ఒక గిన్నెలో నీరు పోసి కనీసం 20 నుంచి 30 నిమిషాల పాటు నానపెట్టాలి. అలా చేయడం వల్ల బంగాళదుంపలో ఉండే అదనపు స్టార్చ్ బయటకు వచ్చేస్తుంది. నిజానికి ఇందులో ఉండే స్టార్చ్ కారణంగానే.. కడాయికి వెంటనే అతుక్కుపోతుంది. మనం నీటిలో వేయడం వల్ల స్టార్చ్ పోతుంది. పొటాటో సరిగా ఫ్రై అవ్వడానికి సహాయపడుతుంది.

Related Articles

Related image1
Expensive Fruit: రెండు పండ్లు రూ.34 లక్షలు.. ఈ పండు కొనాలంటే మినిమమ్ అంబానీలు అవ్వాలి..!
Related image2
Crispy Dosa: పప్పు నానపెట్టేటప్పుడు ఇదొక్కటి వేస్తే.. దోశలు ఎర్రగా, క్రిస్పీగా వస్తాయి
34
కడిగిన వాటిని పూర్తిగా ఆరబెట్టాలి...
Image Credit : AI Image

కడిగిన వాటిని పూర్తిగా ఆరబెట్టాలి...

నీటిలో నానపెట్టిన తర్వాత ఆ ముక్కలు తీసి మరోసారి శుభ్రమైన నీటితో కడగాలి. ఆ తర్వాత... ఏదైనా కాటన్ టవల్ తో వాటిని పూర్తిగా తడిపోయే వరకు తడవాలి. లేదంటే కాసేపు ఆరబెట్టొచ్చు. ఇలా చేయడం వల్ల ముక్కలపై తడిపోతుంది. నూనెలో వేసినప్పుడు చిటపటలాడకుండా ఉంటాయి. ఫ్రై కూడా కరకరలాడుతూ వస్తుంది. పూర్తిగా తడి మొత్తం పోయిన తర్వాత .. ఈ ముక్కలపై కాస్త పసుపు వేసి బాగా కలపాలి. ఇలా చేయడం వల్ల వీటిని వేయించినప్పుడు మంచి గోల్డెన్ షేడ్ వస్తుంది. హోటల్ లో ఈ చిట్కానే ఫాలో అవుతారు. అందుకే చూడటానికి చాలా బాగుంటుంది.

44
నూనె వేడయ్యాకే వేయాలి...
Image Credit : AI Image

నూనె వేడయ్యాకే వేయాలి...

కడాయిలో నూనె వేసి.. బాగా కాగిన తర్వాత మాత్రమే.. తుడిచి ఆరబెట్టిన ముక్కలను వేయాలి. నూనె వేడి అవ్వకముందే వేస్తే.. ముక్కలు నూనె ఎక్కువగా పీల్చుకుంటాయి. అలా జరగకుండా ఉండాలంటే నూనె వేడి అయ్యాక మాత్రమే వేయాలి. అంతేకాకుండా.. ఈ ఫ్రై చేసేటప్పుడు స్టవ్ ఎప్పుడూ మీడియం మంట మీద మాత్రమే ఉంచాలి. ఎక్కువ హైలో పెట్టి వేయించకూడదు. మాడిపోతాయి. మీడియం మంట మీద చేస్తే.. కూర రుచిగా వస్తుంది. ఇక.. నూనెలో వేసిన వెంటనే గరిటెతో కలపకూడదు. కనీసం 2 నుంచి 3 నిమిషాలు అలాగే ఉంచి, తర్వాత నెమ్మదిగా తిప్పితే.. ముక్కలు చెదరకుండా.. సమానంగా వేగుతాయి. ఇవి సరిగా వేగాలంటే ముందే ఉప్పు వేయకూడదు. పూర్తిగా ఫ్రై అయిన తర్వాత.. చివర్లో ఉప్పు, కారం, మసాలాలు వేస్తే సరిపోతుంది.

ఈ చిన్న చిట్కాలు ఫాలో అయితే.. బంగాళ దుంప కడాయికి అతుక్కోదు. మాడిపోదు. అంతేకాదు.. బయట కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉంటూ. హోటల్ స్టైల్ లో గోల్డెన్ కలర్ వస్తాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
ఆహారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Period Diet: పీరియడ్స్ టైంలో ఇలాంటి ఫుడ్ తీసుకుంటే చాలా మంచిది!
Recommended image2
భారతీయులు ఎంజాయ్ చేయడానికి బ్యాంకాక్‌కు ఎందుకు వెళ్తారు?
Recommended image3
Blouse:ట్రెండింగ్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్..చీర అందాన్ని పెంచుతాయి
Related Stories
Recommended image1
Expensive Fruit: రెండు పండ్లు రూ.34 లక్షలు.. ఈ పండు కొనాలంటే మినిమమ్ అంబానీలు అవ్వాలి..!
Recommended image2
Crispy Dosa: పప్పు నానపెట్టేటప్పుడు ఇదొక్కటి వేస్తే.. దోశలు ఎర్రగా, క్రిస్పీగా వస్తాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved