MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Coconut Water: కొబ్బరి బొండాం ఆకారం చూసి, తియ్యటి కొబ్బరి నీళ్లు ఎలా గుర్తించాలో తెలుసా?

Coconut Water: కొబ్బరి బొండాం ఆకారం చూసి, తియ్యటి కొబ్బరి నీళ్లు ఎలా గుర్తించాలో తెలుసా?

 Coconut Water: ఎండాకాలం వచ్చింది అంటే చాలు ప్రతి ఒక్కరూ కొబ్బరి నీళ్లు తాగుతూ ఉంటారు. ఎండ వేడి నుంచి బయటపడటానికి కొబ్బరి నీళ్లు ఎంతగానో సహాయం చేస్తాయి. 

2 Min read
Author : ramya Sridhar
Published : Mar 14 2026, 11:19 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
కొబ్బరి నీళ్లు..
Image Credit : Pixabay

కొబ్బరి నీళ్లు..

కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ముఖ్యంగా ఎండాకాలంలో కొబ్బరి నీళ్లు తాగితే.. చాలా ప్రయోజనాలు కలుగుతాయి. అయితే, దాదాపు అందరూ తియ్యటి కొబ్బరి నీళ్లు తాగడానికే ఇష్టపడతారు. కానీ, కొన్ని కాయ నీళ్లు చాలా వగరుగా ఉంటాయి. అలా కాకుండా.. కొబ్బరి బోండం చూసి అందులో నీళ్లు తియ్యగా ఉన్నాయో.. వగరుగా ఉన్నాయో గుర్తించొచ్చని మీకు తెలుసా? అదెలాగో ఇప్పుడు చూద్దాం..

23
తియ్యటి కొబ్బరి నీళ్లు..
Image Credit : Getty

తియ్యటి కొబ్బరి నీళ్లు..

కొబ్బరికాయను దాని రంగు ద్వారా అందులో నీళ్లు తియ్యగా ఉన్నాయో లేదో తెలుసుకోవచ్చు. ముదురు ఆకుపచ్చ లేదా లేత పసుపు కొబ్బరికాయ నీళ్లు తియ్యగా ఉంటాయి. గోధుమ రంగులో లేదా ఏదైనా మచ్చలు ఉన్న కాయలు ఉంటే.. అలాంటివి ఎంచుకోకపోవడమే మంచిది. ఎందుకంటే, అలాంటి కొబ్బరి బోండాలు పాతవి కావచ్చు. వాటిలో నీరు తక్కువగా ఉంటుంది. అంతేకాదు, కొబ్బరి బోండం కొనే ముందు, మీ చెవి దగ్గర దాన్ని కదిలించండి. ఆ శబ్దాన్ని బట్టి.. కాయలో నీళ్లు ఎన్ని ఉన్నాయో తెలుసుకోవచ్చు. నీరు ఎక్కువగా ఉంటే శబ్దం రాదు. ఎందుకంటే కాయ నిండుగా ఉన్నప్పుడు నీరు కదలడానికి ఖాళీ ఉండదు.గలగలమని శబ్దం వస్తే అందులో నీరు తక్కువగా ఉండి, కాయ ముదిరిపోయిందని అర్థం.

కొబ్బరి బోండం తాకి కూడా అందులో నీళ్లు తియ్యగా ఉన్నాయో లేదో తెలుసుకోవచ్చు. కొబ్బరి బోండం పై భాగం మృదువుగా అనిపిస్తే, కొబ్బరి నీళ్లు తియ్యగా ఉంటాయని అర్థం.

Related Articles

Related image1
Saturn Effect on Relationship: దాంపత్య జీవితంపై శని ప్రభావం ఉంటుందా? కలిసిపోతారా? విడిపోతారా?
Related image2
Idli: తెల్లటి ఇడ్లీ కాదు.. హెల్దీగా పాలకూర ఇడ్లీ, ఎలా చేయాలో తెలుసా?
33
 ఆకారం (Shape):
Image Credit : Getty

ఆకారం (Shape):

చాలా మంది గుండ్రంగా (Round) ఉన్న కొబ్బరికాయ బాగుంటుంది అనుకుంటారు. కానీ, ఎక్కువ నీరు , తియ్యని రుచి కోసం శంఖాకారంలో (Conical/Longer shape) ఉన్న కొబ్బరికాయను ఎంచుకోవడం ఉత్తమం. వీటిలో నీరు ఎక్కువగా ఉండటమే కాకుండా, లేత కొబ్బరి ఉంటుంది.

2. బరువు (Weight):

బరువు అనేది నీటి పరిమాణానికి ముఖ్యమైన సూచిక.

బరువైన కొబ్బరి: కాయ పరిమాణంతో సంబంధం లేకుండా బరువుగా అనిపిస్తే, అందులో నీరు నిండుగా ఉందని అర్థం.

తేలికైన కొబ్బరి: కాయ పెద్దగా ఉన్నా తేలికగా ఉంటే, లోపల నీరు ఎండిపోయిందని లేదా కాయ ముదిరిపోయిందని అర్థం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆహారం
జీవనశైలి
Latest Videos
Recommended Stories
Recommended image1
Cancer: ఒక చిన్న క‌ణం మ‌నిషిని చంపే స్థాయికి ఎలా చేరుకుంటుంది.? క్యాన్స‌ర్ క‌థేంటో తెలుసా.?
Recommended image2
Women Weight Loss Food: ఆడవాళ్లు బరువు తగ్గాలంటే ముందుగా ఇది తినాలి!
Recommended image3
Gold Earrings: తక్కువ బడ్జెట్ లో అమ్మాయిలు మెచ్చే బంగారు జుంకాలు
Related Stories
Recommended image1
Saturn Effect on Relationship: దాంపత్య జీవితంపై శని ప్రభావం ఉంటుందా? కలిసిపోతారా? విడిపోతారా?
Recommended image2
Idli: తెల్లటి ఇడ్లీ కాదు.. హెల్దీగా పాలకూర ఇడ్లీ, ఎలా చేయాలో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved