MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Rice and Chapati: చపాతీ, అన్నం రెండూ కలిపి తినొచ్చా?తింటే ఏమౌతుంది?

Rice and Chapati: చపాతీ, అన్నం రెండూ కలిపి తినొచ్చా?తింటే ఏమౌతుంది?

Rice and Chapati: మనలో చాలా మందికి చపాతీ, అన్నం రెండూ కలిపి తినే అలవాటు ఉంటుంది. అయితే, ఇలా తినడం వల్ల శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి.అసలు, ఈ రెండూ కలిపి తినొచ్చా?

2 Min read
Author : ramya Sridhar
Published : Aug 10 2026, 06:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Rice and Chapati
Image Credit : our own

Rice and Chapati

చపాతీ, అన్నం.. రెండూ మన రోజువారీ ఆహారంలో ముఖ్యమైన భాగాలు. అయితే వీటిని వేర్వేరుగా తినడానికి, ఒకే భోజనంలో కలిపి తినడానికి చాలా తేడా ఉంది. రోజువారీగా ఒక చపాతీ, ఆ తర్వాత మళ్లీ అన్నం తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. దీని వల్ల మీ జీర్ణక్రియ, రక్తంలో షుగర్ లెవల్స్ పై చాలా ఎక్కవ ప్రభావం చూపించే అవకాశం ఉంది. అసలు, ఈ రెండూ కలిపి తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
కార్బోహైడ్రేట్స్ ఎక్కువ...
Image Credit : Getty

కార్బోహైడ్రేట్స్ ఎక్కువ...

అన్నం, చపాతీ రెండూ కూడా కార్బోహైడ్రేట్లు (Carbohydrates) ఎక్కువగా ఉండే ఆహారాలే. రెండింటినీ ఒకే భోజనంలో కలిపి తీసుకున్నప్పుడు శరీరానికి ఒకేసారి భారీగా పిండి పదార్థాలు అందుతాయి. ఇది రోజువారీ అవసరానికి కంటే ఎక్కువైతే, శరీరం ఆ అదనపు గ్లూకోజ్‌ను కొవ్వుగా మార్చి దాచిపెడుతుంది.

షుగర్ లెవల్స్ బాగా పెరుగుతాయి…

అన్నానికి గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఎక్కువ. చపాతీలో ఫైబర్ ఉన్నప్పటికీ, రెండింటినీ కలిపి పెద్ద మొత్తంలో తింటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు (Blood Sugar Spikes) వేగంగా పెరుగుతాయి. ముఖ్యంగా డయాబెటిస్ (మధుమేహం) ఉన్నవారికి ఈ అలవాటు అస్సలు మంచిది కాదు.

33
బరువు పెరిగే అవకాశం
Image Credit : Gemini AI

బరువు పెరిగే అవకాశం

రెండు రకాల ధాన్యాలను ఒకేసారి తినడం వల్ల కేలరీల వినియోగం పెరుగుతుంది. కడుపు నిండిన భావన వచ్చినా, ఓవర్ ఈటింగ్ (ఎక్కువగా తినడం) జరిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల బరువు తగ్గాలనుకునే వారికి అనుకున్న ఫలితాలు రావు, పైగా బరువు పెరిగే ప్రమాదం ఉంది.

4. జీర్ణక్రియపై ప్రభావం 

అన్నం త్వరగా జీర్ణమవుతుంది, కానీ గోధుమలతో చేసే చపాతీ జీర్ణం కావడానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది. ఈ రెండింటి జీర్ణక్రియ వేగం వేర్వేరుగా ఉండటం వల్ల కొందరిలో గ్యాస్, కడుపు ఉబ్బరం లేదా జీర్ణసమస్యలు వచ్చే అవకాశం ఉంది.

నిపుణులు ఏం చెబుతున్నారు..? 

ఏదో ఒకటే ఎంచుకోండి: ఒకే పూటలో అన్నం లేదా చపాతీ... ఏదో ఒక దాన్ని మాత్రమే ప్రధాన ఆహారంగా తీసుకోవడం ఉత్తమం.

కూరగాయలు, ప్రోటీన్‌కు ప్రాధాన్యం ఇవ్వండి: ప్లేట్‌లో సగం భాగం కూరగాయలు (సలాడ్స్), పావు భాగం ప్రోటీన్ (పప్పు, పనీర్, గుడ్లు లేదా చికెన్/ఫిష్), మిగిలిన పావు భాగం మాత్రమే అన్నం లేదా చపాతీ ఉండేలా చూసుకోవాలి.

తప్పనిసరిగా రెండూ తినాలనుకుంటే: ఒక వేళ రెండూ తినాలనిపిస్తే, ఒక చిన్న చపాతీ, చాలా తక్కువ పరిమాణంలో అన్నం తీసుకుంటూ, కూరలు ఎక్కువ మోతాదులో తినడం మంచిది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Printed Saree: ఆఫీస్ వేర్ కి పర్ఫెక్ట్ గా సూటయ్యే ప్రింటెడ్ చీరలు
Recommended image2
Chapati Dough: చపాతీ పిండి కలిపిన కాసేపటికే నల్లగా ఎందుకు మారుతుంది? తాజాగా ఉండాలంటే ఏం చేయాలి?
Recommended image3
Silver Anklet:భారత్ లో కాకుండా ఏదేశంలో మహిళలు పట్టీలు ధరిస్తారో తెలుసా
Related Stories
Recommended image1
Skeleton Lake : ఈ నదిలో కుప్పలు తెప్పలుగా మానవ అస్థిపంజరాలు.. ఎవరివి ఇవన్నీ..?
Recommended image2
Quinoa: నెల రోజులు వైట్ రైస్ కి బదులు క్వినోవా రైస్ తింటే ఏం జరుగుతుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved