Telugu

ఇంట్లోనే కీరదోస సాగు.. ఈ సింపుల్ టిప్స్‌తో చాలా ఈజీ!

Telugu

నీరు నిలవని ప్రదేశం

కీర దోస పెంచడానికి మంచి సూర్యరశ్మి తగిలే, నీరు నిలవని ప్రదేశాన్ని ఎంచుకోవాలి. మట్టిని బాగా తవ్వి, పశువుల ఎరువు, వేపపిండి వేసి పాదులు సిద్ధం చేసుకోవాలి.

Image credits: pixabay
Telugu

ఒక్కో పాదులో 3-4 విత్తనాలు

విత్తనాలను వరుసల మధ్య 4-5 అడుగుల దూరంలో నాటాలి. ప్రతి పాదులో 3-4 విత్తనాలు వేయవచ్చు. విత్తే ముందు 2-3 గంటలు నీటిలో నానబెడితే, అవి త్వరగా మొలకెత్తుతాయి.
Image credits: pixabay
Telugu

మల్చింగ్ అవసరం

మొక్క పెరగడం మొదలయ్యాక, పాదులో పచ్చి ఆకులు లేదా ఎండుటాకులతో మల్చింగ్ చేయాలి. అలాగే తీగలు పాకడానికి పందిరి వేయాలి. తీగలు నేలను తాకకుండా ఉంటే కాయలు కుళ్లిపోకుండా ఉంటాయి.

Image credits: pixabay
Telugu

తడి అవసరం

కీరదోసకు రోజూ క్రమం తప్పకుండా నీరు పెట్టాలి. కానీ నీరు నిల్వకుండా చూసుకోవాలి. కాయలు కాసే సమయంలో నీరు తక్కువైతే, కీరదోస చేదుగా మారే అవకాశం ఉంటుంది.

Image credits: pixabay
Telugu

సేంద్రియ ఎరువులు

తీగ పాకేటప్పుడు, పులియబెట్టిన వేరుశనగ పిండి, జీవామృతం లేదా గంజినీటిలో పశువుల ఎరువు కలిపిన మిశ్రమం వంటి సేంద్రియ ఎరువులను వాడాలి.
Image credits: pixabay
Telugu

కవర్లతో రక్షణ

కీరదోస సాగులో పండు ఈగ పెద్ద సమస్య. కాయలు చిన్నగా ఉన్నప్పుడే వాటిని పేపర్ కవర్లు లేదా పాలిథిన్ కవర్లతో చుట్టి రక్షించుకోవాలి.

Image credits: pixabay
Telugu

పురుగు నివారణ

పురుగులను నివారించడానికి వేప నూనె-వెల్లుల్లి మిశ్రమాన్ని వారానికి ఒకసారి సాయంత్రం టైంలో పిచికారీ చేయాలి. మొక్కకు పూత వచ్చిన 45–50 రోజుల్లో కాయలు కోతకు వస్తాయి.

Image credits: pixabay

Coriander: మట్టి లేకుండా ప్లాస్టిక్ బాటిల్ లోనే కొత్తిమీర పెంచండి ఇలా

Gold Bracelet Designs: తక్కువ గ్రాములో అందమైన బ్రేస్లేట్ డిజైన్లు..!

Silk Sarees: ఈ పట్టు చీరలు కట్టారంటే ఎవరైనా మెరిసిపోవాల్సిందే

Gold Necklace: లైట్ వెయిట్ లో వచ్చే బంగారు నెక్లెస్ లు.. ఓ లుక్కేయండి!