MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Skeleton Lake : ఈ నదిలో కుప్పలు తెప్పలుగా మానవ అస్థిపంజరాలు.. ఎవరివి ఇవన్నీ..?

Skeleton Lake : ఈ నదిలో కుప్పలు తెప్పలుగా మానవ అస్థిపంజరాలు.. ఎవరివి ఇవన్నీ..?

Skeleton Lake: నీళ్లతో నిండిన నది చూసి ఉంటారు. కానీ, అస్థిపంజరాలతో నిండి ఉన్న నదిని ఎప్పుడైనా చూశారా? ఆ అస్థిపంజరాలన్నీ మంచుతో కప్పి ఉంటాయి.. ఆ మంచు కరిగినప్పుడు మాత్రమే భయటపడే అస్థిపంజరాలు ఎవరివి? ఈ వింత నది ఎక్కడ ఉంది?

2 Min read
Author : ramya Sridhar
Published : Aug 10 2026, 03:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
మిస్టరీ సరస్సు..
Image Credit : our own

మిస్టరీ సరస్సు..

హిమాలయాలు ఎంత అందంగా ఉంటాయో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. తెల్లటి మంచుతో కప్పేసి, మండే ఎండల్లోనూ చల్లదనాన్ని పంచుతాయి.అలాంటి హిమాలయాల్లో మనం ఊహించని భయంకరమైన ప్రదేశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఎత్తైన కొండల మధ్యలో.. రద్దీగా ఉండే నగరాలకు దూరంగా, బిజీ రహదారులు ఏమీ లేని ఓ అందమైన సరస్సు ఉంది. ఈ సరస్సు చూడటానికి ఎంతో అందంగా, ఆకర్షించేలా ఉంటుంది. కానీ, ఒక్కసారి ఆ సరస్సులో మంచు కరిగితే.. దానిలోని అస్థిపంజరాలన్నీ బయపడతాయి. అదే రూప్ కుండ్ సరస్సు. దీనిని అస్థిపంజరాల సరస్సు అని కూడా పిలుస్తారు. మరి, ఆ సరస్సులో ఉన్న అస్థిపంజరాలు ఎవరివి?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
మంచు కింద దాగిన రహస్యం...
Image Credit : Gemini AI

మంచు కింద దాగిన రహస్యం...

ఈ రూప్ కుండ్ సరస్సును చూడటానికి ప్రతి సంవత్సరం చాలా మంది పర్యాటకులు వెళ్తూ ఉంటారు. దట్టమైన అడవుల మధ్యలో ట్రెక్కింగ్ చేస్తూ వెళ్తే.. సముద్ర మట్టానికి 5వేల మీటర్లపైగా ఎత్తులో మంచుతో గడ్డకట్టిన సరస్సు ఒకటి ఉంటుంది. అదే రూప్ కుండ్ సరస్సు. దీని వెడల్పు కేవలం 40 మీటర్లు మాత్రమే. దాదాపు ఇది ఎప్పుడూ మంచుతో గడ్డకట్టుకొనే ఉంటుంది. కానీ.. సంవత్సరం మొత్తంలో ఏదో ఒక సమయంలో మాత్రమే మంచు కొద్దిగా కరుగుతుంది. అప్పుడు ఈ అస్థిపంజరాలు కనపడతాయి. ఇక్కడ అస్థిపంజరాలు ఉండటాన్ని 1942లో హరి కిషన్ మాద్వాల్ అనే ఫారెస్ట్ రేంజర్ కనుగొన్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో చనిపోయిన సైనికుల ఎముకలు అని మొదట అనుకున్నారు. కానీ, పరిశోధనల్లో అవి శతాబ్దాల నాటి ప్రాచీన అస్థిపంజరాలు అని తేలింది.

పరిశోధనలు ఏం చెబుతున్నాయి?

ఈ అస్థిపంజరాల సరస్సు వెనక చాలా కథలు వినపడుతూ ఉంటాయి. భయంకరమైన వడగండ్ల వాన పడి చనిపోయారని అక్కడివారు నమ్ముతారు. ఆ సరస్సులో లభించిన అస్థిపంజరాల పుర్రెలపై గుండ్రని వస్తువుల కారణంగా ఏర్పడిన గాయాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. అందుకే, ఆకాశం నుంచి పడిన అతి పెద్ద వడగండ్ల వాన కారణంగా చనిపోయారని కొందరు నమ్ముతుంటారు.

అయితే, తాజా నివేదికల ప్రకారం ఈ అస్థిపంజరాలు ఒకే సమూహానికి చెందినవి కావు. ఇవి దాదాపు 1,000 సంవత్సరాల వ్యవధిలో, వేర్వేరు సమయాల్లో మరణించిన వేర్వేరు వ్యక్తులవని తేలింది. మరీ విస్తుపోయే విషయమేమిటంటే.. వీరిలో కొందరు భారతదేశానికి చెందినవారు కూడా కారు. వారి DNA ఆగ్నేయాసియా , మధ్యధరా ప్రాంతాలకు (Mediterranean) చెందిందని తేలింది. అంటే ఈ ప్రదేశం శతాబ్దాలుగా ఎన్నో విషాదాలను చూసింది, కానీ అలా ఎందుకు జరిగిందో ఇప్పటికీ ఎవరికీ పూర్తిగా తెలియదు.

Related Articles

Related image1
Quinoa: నెల రోజులు వైట్ రైస్ కి బదులు క్వినోవా రైస్ తింటే ఏం జరుగుతుంది?
Related image2
Blood River: నీళ్లు కాదు.. రక్తం ఏరులైపారే నది మన దేశంలో ఎక్కడ ఉందో తెలుసా?
33
పౌరాణిక కథలు ఏం చెబుతున్నాయి..?
Image Credit : Gemini AI

పౌరాణిక కథలు ఏం చెబుతున్నాయి..?

స్థానిక కథల ప్రకారం, రాజు జస్ధవాల్ తన గర్భవతి అయిన రాణి, నాట్యగత్తెలు, సేవకుల పెద్ద బృందంతో కలిసి నందాదేవి అమ్మవారిని దర్శించుకోవడానికి పవిత్ర యాత్రకు బయలుదేరాడు. కానీ వారి ప్రవర్తన వల్ల అమ్మవారికి కోపం వచ్చింది. ఫలితంగా, ఆమె భయంకరమైన తుఫానును సృష్టించి, సరస్సు సమీపంలో ఉన్న ప్రతి ఒక్కరినీ నాశనం చేసింది. అని స్థానికులు నమ్ముతుంటారు.

పర్యాటకుల ఫేవరేట్ ప్లేస్.. భయానక నేపథ్యం ఉన్నప్పటికీ, రూప్‌కుండ్ భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధ ట్రెక్కింగ్ పాయింట్లలో ఒకటి. సాధారణంగా 6 నుండి 8 రోజులు పట్టే ఈ ట్రెక్కింగ్, సాహసాన్ని ఇష్టపడే వారికి పర్ఫెక్ట్ ఛాయిస్. ఈ ప్రయాణంలో అత్యంత సుందరమైన ఘట్టం క్యాంపింగ్. పర్వతాల మధ్య, పచ్చటి మైదానాలలో ప్లాన్ చేసుకునే టెంట్ల నివాసం కొత్త అనుభూతినిస్తుంది. చూడటానికి చాలా అందంగా కూడా ఉంటుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్
Recommended image2
Neck Pain: వర్క్ ఫ్రం చేసేవాళ్లు ఈ తప్పులు చేయకండి..లేదంటే జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది
Recommended image3
Pachimirchi Kodi Vepudu: వీకెండ్ సెట్ అవ్వాలంటే ఈ నాన్ వెజ్ రెసిపీ ఉండాల్సిందే
Related Stories
Recommended image1
Quinoa: నెల రోజులు వైట్ రైస్ కి బదులు క్వినోవా రైస్ తింటే ఏం జరుగుతుంది?
Recommended image2
Blood River: నీళ్లు కాదు.. రక్తం ఏరులైపారే నది మన దేశంలో ఎక్కడ ఉందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved