Telugu

Coriander: మట్టి లేకుండా ప్లాస్టిక్ బాటిల్ లోనే కొత్తిమీర పెంచండి ఇలా

Telugu

బయట కొనాల్సిన అవసరమే లేదు..

రెగ్యులర్ గా అందరూ కొత్తిమీర బయట కొంటూ ఉంటారు. మీ ఇంట్లో మొక్కలు పెంచడానికి ప్లేస్ లేకపోయినా, మట్టి లేకపోయినా సింపుల్ గా ఈజీగా  ప్లాస్టిక్ బాటిల్ లోనే పెంచేయచ్చు. 

Image credits: Instagram
Telugu

కావాల్సినవి ఇవే...

కావాల్సినవి: ఒక పెద్ద ప్లాస్టిక్ బాటిల్, 1 కప్పు పీట్ మాస్, 1 నుంచి 2 టీస్పూన్ల సేంద్రియ ఎరువు, 1 టీస్పూన్ ధనియాలు, గుప్పెడు గులకరాళ్లు లేదా చిన్న రాళ్లు.
Image credits: Getty
Telugu

ధనియాలను నానపెట్టుకోవాలి..

ముందుగా, ధనియాలను తీసుకుని రాత్రంతా నీటిలో నానబెట్టాలి. తర్వాత ఒక ప్లాస్టిక్ బాటిల్ తీసుకుని, దాని మూత ఉండే పై భాగాన్ని కత్తిరించాలి.
Image credits: Getty
Telugu

మట్టి అవసరం లేదు రాళ్లు ఉంటే చాలు..

ఇప్పుడు ఆ బాటిల్ ఒక కంటైనర్‌లా కనిపిస్తుంది. ఈ బాటిల్‌లో సగం వరకు చిన్న చిన్న రాళ్లతో నింపాలి.
Image credits: Getty
Telugu

ఎరువులు చాలా ముఖ్యం..

ఇప్పుడు ఒక స్పూన్‌తో సేంద్రియ ఎరువు, పీట్ మాస్ వేసి, మధ్యలో ధనియాలను చల్లాలి.
Image credits: Getty
Telugu

సూర్యరశ్మి చాలా ముఖ్యం..

కనీసం 1 గ్లాసు నీళ్లు పోయాలి. ఇప్పుడు సూర్యరశ్మి తగిలే చోట ఈ బాటిల్‌ను వేలాడదీయాలి. 20 రోజుల్లో విత్తనాల నుంచి మొలకలు వస్తాయి. మరికొన్ని రోజుల్లో కొత్తిమీర కోతకు సిద్ధమవుతుంది.
Image credits: Getty

Gold Bracelet Designs: తక్కువ గ్రాములో అందమైన బ్రేస్లేట్ డిజైన్లు..!

Silk Sarees: ఈ పట్టు చీరలు కట్టారంటే ఎవరైనా మెరిసిపోవాల్సిందే

Gold Necklace: లైట్ వెయిట్ లో వచ్చే బంగారు నెక్లెస్ లు.. ఓ లుక్కేయండి!

Ragi Ambali: రాగి అంబలి ఇలా చేశారంటే రుచి అదుర్స్