MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Quinoa: నెల రోజులు వైట్ రైస్ కి బదులు క్వినోవా రైస్ తింటే ఏం జరుగుతుంది?

Quinoa: నెల రోజులు వైట్ రైస్ కి బదులు క్వినోవా రైస్ తింటే ఏం జరుగుతుంది?

Quinoa: రోజూ వైట్ రైస్ తినే అలవాటు ఉందా? అయితే, ఈ వైట్ రైస్ కి బదులు.. నెల రోజుల పాటు క్వినోవా రైస్ తింటే ఏమౌతుంది? మీ శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా?

2 Min read
Author : ramya Sridhar
Published : Aug 10 2026, 10:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
క్వినోవా తింటున్నారా?
Image Credit : GeminiAi

క్వినోవా తింటున్నారా?

ఈ రోజుల్లో ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్న ప్రతి ఒక్కరి నోటా వినపడుతున్న పేరు క్వినోవా. వైట్ రైస్ లో కేవలం కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఉంటాయి. అదే.. క్వినోవాలో అయితే... ఫైబర్, ప్రోటీన్ కూడా పుష్కలంగా ఉంటాయి. మరి, అలాంటి ఈ క్వినోవాని వైట్ రైస్ స్థానంలో నెల రోజులు తింటే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి? ముఖ్యంగా జీర్ణక్రియ మెరుగుపడటం దగ్గర నుంచి.. బరువు తగ్గడం వరకు ఈ 30 రోజుల్లో ఎలాంటి మార్పులు చూస్తారో ఇప్పుడు చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
1.ఆకలి కంట్రోల్ లో ఉంటుంది..
Image Credit : social media

1.ఆకలి కంట్రోల్ లో ఉంటుంది..

వైట్ రైస్ తో పోలిస్తే క్వినోవా లో ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. వైట్ రైస్ కి బదులుగా క్వినోవా తినడం వల్ల ఆకలి అదుపులో ఉంటుంది. ఇది తిన్నప్పుడు రోజంతా పొట్ట నిండుగా అనిపిస్తుంది. దీని వల్ల జంక్ ఫుడ్ తినాలనే కోరిక తగ్గుతుంది. ఆకలి కూడా కంట్రోల్ లో ఉంటుంది. ఫలితంగా సులభంగా బరువు తగ్గుతారు.

2.జీర్ణక్రియ బాగా పనిచేస్తుంది..

క్వినోవాలోని అధిక ఫైబర్ ప్రేగుల కదలికలను సులభతరం చేస్తుంది. రోజూ తగినంత నీరు తాగుతూ క్వినోవా తింటే మలబద్ధకం సమస్యకు చెక్ పెట్టవచ్చు. అయితే, ఒక్కసారిగా ఎక్కువ మొత్తంలో తినడం ప్రారంభిస్తే మొదట్లో కాస్త గ్యాస్ లేదా పొట్ట ఉబ్బరంగా అనిపించవచ్చు, కాబట్టి నెమ్మదిగా అలవాటు చేసుకోవడం మంచిది.

34
3.బరువు తగ్గించే క్వినోవా..
Image Credit : Getty

3.బరువు తగ్గించే క్వినోవా..

క్వినోవా తిన్నంత మాత్రాన మ్యాజిక్‌లా బరువు తగ్గిపోరు. కానీ, ఇది ఎక్కువ సేపు కడుపు నిండిన భావన కలిగించడం వల్ల రోజువారీ కేలరీల వినియోగం తగ్గుతుంది. ఇది క్రమంగా బరువు తగ్గడానికి దోహదపడుతుంది.అలా అని దీనిని కూడా మరీ ఎక్కువగా తినకూడదు.

4. ప్లాంట్-బేస్డ్ ప్రోటీన్ బూస్ట్!

క్వినోవాలోని అతిపెద్ద ప్రత్యేకత ఏంటంటే..దీని వల్ల మనకు ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్‌ను అందిస్తుంది. శాకాహారులకు వైట్ రైస్ కంటే ఇది ఒక అద్భుతమైన, పుష్కలమైన ప్రోటీన్ మూలం.

5. బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో.. వైట్ రైస్ తిన్న వెంటనే రక్తంలో షుగర్ స్థాయిలు వేగంగా పెరుగుతాయి. కానీ క్వినోవాలో ఉండే ప్రోటీన్, ఫైబర్ వల్ల రక్తంలో గ్లూకోజ్ కలవడం చాలా నెమ్మదిగా జరుగుతుంది. ఇది డయాబెటిస్‌ను పూర్తిగా తగ్గించకపోయినా, షుగర్ లెవెల్స్ స్పైక్ అవ్వకుండా నియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

6. పోషకాల గని – మల్టీ విటమిన్ బూస్టర్.. వైట్ రైస్‌తో పోలిస్తే క్వినోవాలో మెగ్నీషియం, ఫాస్ఫరస్, మాంగనీస్, ఫోలేట్ , ఐరన్ వంటి ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మీ శరీరానికి అవసరమైన మైక్రో-న్యూట్రియంట్స్‌ను అందిస్తుంది.

44
వైట్ రైస్ పూర్తిగా మానేయాలా?
Image Credit : our own

వైట్ రైస్ పూర్తిగా మానేయాలా?

ఈ ప్రయోజనాలన్నింటినీ పొందడానికి వైట్ రైస్ ని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. అన్నం మన భారతీయ ఆహారంలో భాగం. దాన్ని పూర్తిగా మానాల్సిన పనిలేదు. కానీ, వైట్ రైస్‌కు ఒక ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా రోజులో ఒకసారి తీసుకోవచ్చు. లేదంటే.. వైట్ రైస్ , క్వినోవా రెండూ కలిపి వండుకొని తిన్నా కూడా అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Coin Necklace:పట్టుచీరల మీదకు మీ అందాన్ని పెంచే కాసుల నక్లెస్ డిజైన్లు
Recommended image2
Banana: రాత్రిపూట అరటి పండు తింటే ఏమౌతుంది? నిజంగా బరువు పెరుగుతారా?
Recommended image3
Kitchen Hacks: ఉల్లిపాయలు, బంగాళాదుంపలు కలిపి నిల్వ చేయకూడదా? చేస్తే ఏమవుతుంది?
Related Stories
Recommended image1
Paneer: మీరు తినే పనీర్ లో కల్తీ జరిగిందా? ఎలా గుర్తించాలో తెలుసా?
Recommended image2
Blood River: నీళ్లు కాదు.. రక్తం ఏరులైపారే నది మన దేశంలో ఎక్కడ ఉందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved