ప్రతిరోజూ జుట్టుకు షాంపూ పెడుతున్నరా? ఈ విషయం తెలిస్తే ఆ పని ఇకనుంచి అస్సలు చేయరు
చాలా మంది రెగ్యులర్ గా తలస్నానం చేస్తుంటారు. ప్రతిరోజూ షాంపూను జుట్టుకు పెడుతుంటారు. షాంపూ జుట్టును క్లీన్ చేసినా.. ఇది జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రెగ్యులర్ గా జుట్టుకు షాంపూను పెట్టడం వల్ల జుట్టు డ్యామేజ్ అవ్వడమే కాకుండా జీవం లేనట్టుగా కూడా కనిపిస్తుంది. అలాగే జుట్టు ఊడిపోయే అవకాశం కూడా ఉంది.
మన జుట్టును క్లీన్ గా ఉంచడానికి, చుండ్రును నివారించడానికి హెయిర్ వాష్ చేయడం చాలా ముఖ్యం. కానీ హెయిర్ వాష్ ను ఎన్నిరోజులకోసారి చేయాలి? రోజూ షాంపూను పెట్టొచ్చా? లేదా? అనే విషయాలను ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీ జుట్టు ఆకృతి, రకం, జిడ్డుగా ఉందా వంటి విషయాలను బట్టే ఎన్ని రోజులకోసారి షాంపూ పెట్టాలో డిసైడ్ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
జుట్టును ఎందుకు కడగాలి?
బాడీ వాష్ కు , షెయిర్ వాష్ చాలా తేడా ఉంటుంది. మనం సాధారణంగా శరీరాన్ని క్లీన్ చేయడానికి ఉపయోగించే సబ్బును జుట్టును క్లీన్ చేయడానికి ఉపయోగించరు. ఎందుకంటే ఇది జుట్టును దెబ్బతీస్తుంది. అందుకే జుట్టుకు మాత్రమే ఉపయోగించే షాంపూలను ఉపయోగించాలి. తేలికపాటి షాంపూ వాతావరణ కాలుష్యం, దమ్ము, ధూళి, చెమట, చెడు వాసనను పోగొట్టడానికి సహాయపడుతుంది. దీంతో మీ జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
షాంపూలు మన జుట్టును క్లీన్ చేయడమే కాకుండా అదనపు నూనెను తొలగించడానికి కూడా సహాయపడతాయి. చాలా షాంపూల్లో సర్ఫాక్టాంట్లు, సల్ఫేట్లు వంటి రసాయనాలు, సమ్మేళనాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి.ఇది నెత్తి, జుట్టు నుంచి నూనెను తొలగించడానికి నురుగు వచ్చేలా చేస్తుంది. దీంతో జుట్టు శుభ్రంగా అవుతుంది. షైనీగా మెరుస్తుంది. చాలా రోజులు షాంపూను వాడకుండా ఉంటే నెత్తిమీద నూనె పేరుకుపోతుంది. దీంతో నెత్తి, వెంట్రుకలు మురికిగా, జిడ్డుగా కనిపిస్తాయి.
నిపుణుల ప్రకారం.. జుట్టు గ్రంథులు సెబమ్ అనే సహజ నూనెను ఉత్పత్తి చేస్తాయి. ఇది మన నెత్తిని తేమగా చేస్తుంది. అలాగే వెంట్రుకలు మెరిసేలా చేస్తుంది. జుట్టును తరచుగా కడగడం వల్ల ఈ రక్షిత పొర తొలగిపోతుంది. దీంతో జుట్టు పొడిబారుతుంది. వెంట్రుకలు తొగిపోతాయి. అలాగే చెమట, పర్యావరణ కాలుష్య కారకాలు, స్టైలింగ్ ఉత్పత్తులు వంటి కారకాలు కూడా నెత్తిమీద మురికి పేరుకుపోయేలా చేస్తాయి.
Hair wash
హెయిర్ వాష్ ఎప్పుడు, ఎలా చేయాలి?
ఎక్కువ నూనె ఉత్పత్తి
జిడ్డుగల జుట్టు లేదా చురుకైన జీవనశైలి ఉన్నవారికి రెగ్యులర్ గా జుట్టును క్లీన్ చేయడం వల్ల తాజాగా అనిపిస్తుంది. సెబమ్ ఎక్కువగా ఉత్పత్తి అయితేనే జుట్టు మురికిగా అనిపిస్తుంది. ఇది జుట్టును జిగటగా చేస్తుంది. మీ జుట్టులో సెబమ్ ఎంత రిలీజ్ విడుదనేది మీ వయస్సు, జెనెటిక్స్, లింగం, పర్యావరణంపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పిల్లలు, పెద్దల్లో 20, 30 ఏండ్ల వారిలా ఎక్కువ సెబమ్ ఉత్పత్తి కాదు. అయితే ఎప్పుడైనా మీ జుట్టు జిడ్డుగా మారే అవకాశం ఉంది. కానీ వయస్సుతో పాటుగా మీ నెత్తి క్రమంగా పొడిగా మారుతుంది.
Hair wash
జుట్టు రకాలు
కర్లీ, మందపాటి జుట్టు రకం కంటే నిటారుగా, సన్నని జుట్టును తరచుగా వాష్ చేయాలి. సెబమ్ పల్చని జుట్టులో సులభంగా కనిపిస్తుంది. ఇలాంటి జుట్టు తొందరగా జిడ్డుగా మారుతుంది. మందపాటి లేదా కర్లీ హెయిర్ డ్రైగా ఉంటుంది. ఎందుకంటే జుట్టుకు నూనె సులభంగా అంటదు. కర్లీ జుట్టును చక్కగా ఉంచడానికి సెబమ్ ఉపయోగపడుతుంది. ఎందుకంటే కర్లీ జుట్టు మృదువుగా ఉండటానికి, జుట్టు రాలడాన్ని నివారించడానికి ఎక్కువ తేమ అవసరమవుతుంది.
జీవనశైలి
మన జీవనశైలి కూడా మన జుట్టును ఎన్ని రోజులకోసారి కడగాలో డిసైడ్ చేస్తుంది. చురుకైన జీవనశైలిని, శారీరక కార్యకలాపాల్లో పాల్గొన్నా లేదా క్రమం తప్పకుండా చెమట పట్టిన వారు.. తరచుగా స్నానం చేయాలి. ఎందుకంటే వీటివల్ల నెత్తిమీద చెమట ఎక్కువగా పడుతుంది. అలాగే దుర్వాసన కూడా వస్తుంది. ఇవి పోవాలంటే వీరు తరచుగా తలస్నానం చేయాలి.