MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Business
  • Home Investment : ఫ్యామిలీతో ఉండేందుకు కాదు, పెట్టుబడిగా మాత్రమే ఇల్లు కొంటున్నారా? అయితే మీకు ఈ విషయాలు తెలియాల్సిందే

Home Investment : ఫ్యామిలీతో ఉండేందుకు కాదు, పెట్టుబడిగా మాత్రమే ఇల్లు కొంటున్నారా? అయితే మీకు ఈ విషయాలు తెలియాల్సిందే

ఉండడానికి ఓ ఇళ్ళున్నా పెట్టుబడి కోసం మరో ఇల్లు కొంటున్నారా? అయితే ఆ ఇంటి అద్దె ఆదాయం, కట్టాల్సిన ఈఎంఐ, ఇతర పన్నులు, మెయింటెనెన్స్, లొకేషన్ వంటివాటి గురించి ఆలోచించాలి. ఈ లెక్కలన్నీ అనుకూలంగా ఉంటేనే ఈ పెట్టుబడి వైపు వెళ్లడం మంచిది.

3 Min read
Author : Arun Kumar P
Published : Aug 04 2026, 01:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అద్దెతో మాత్రమే లాభం వస్తుందా?
Image Credit : Gemini AI

అద్దెతో మాత్రమే లాభం వస్తుందా?

Home Investment : మన తర్వాతి తరానికి ఇవ్వగలిగే ఒక సురక్షితమైన ఆస్తిగా ఇంటిని చూస్తాం. అయితే మనం కుటుంబంతో కలిసి ఉండటానికి సొంతంగా ఇల్లు కొనడం వేరు... కేవలం 'పెట్టుబడి' లక్ష్యంతో మరో ఇల్లు కొనడం వేరు. ఈ రెండింటికీ చాలా తేడా ఉంది. ఒకవేళ ఇన్వెస్ట్‌మెంట్ అని రెండో ఇల్లు కొంటుంటే ముందు కొన్ని విషయాలు కచ్చితంగా చూసుకోవాలి.

ఇంటిపై పెట్టే పెట్టుబడితో మంచి రాబడి వస్తుందా? అనేది మొదటి ప్రశ్న. అద్దె రూపంలో వచ్చే ఆదాయమే ఇందులో ప్రధానమైంది. కాబట్టి ఇల్లు కొనడానికి అయిన ఖర్చుకు, వచ్చే అద్దెకు పొంతన ఉందో లేదో చూసుకోవాలి. ఉదాహరణకు కోటి రూపాయలు పెట్టి కొన్న ఇంటికి నెలకు రూ.25,000 అద్దె వస్తుందనుకుందాం. వినడానికి బాగానే ఉన్నా రిపేర్లు, పన్నులు, ఇతర ఖర్చులు పోకముందే లెక్కేస్తే దీనిపై వచ్చే రాబడి కేవలం 3 శాతమే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఈఎంఐ, అద్దె మధ్య తేడా..
Image Credit : Chatgpt

ఈఎంఐ, అద్దె మధ్య తేడా..

హోమ్ లోన్ తీసుకుని ఇల్లు కొంటే కథ ఇంకాస్త క్లిష్టంగా మారుతుంది. చాలా సందర్భాల్లో మీకు వచ్చే అద్దె కన్నా... మీరు బ్యాంకుకు కట్టాల్సిన నెలవారీ EMI చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ గ్యాప్‌ను పూడ్చడానికి ఇంటి యజమాని తన జీతం నుంచో, ఇతర పొదుపుల నుంచో డబ్బు సర్దాల్సి వస్తుంది. ఇది భరించగలిగినా, ఈ పెట్టుబడి దానంతట అదే నిలబడలేదన్నది వాస్తవం.

Related Articles

Related image1
Home Loan : ఇల్లు కొనకుండానే హోమ్ లోన్ తీసుకోవచ్చా..! ఎలాగో తెలుసా?
Related image2
Home Loan : హోమ్ లోన్ కు కూడా ఇన్సూరెన్స్ తీసుకోవచ్చా?
35
ఇల్లు ఉండే చోటు చాలాముఖ్యం..
Image Credit : Gemini AI

ఇల్లు ఉండే చోటు చాలాముఖ్యం..

పెట్టుబడి కోసం ఇల్లు కొనేటప్పుడు బిల్డింగ్ కన్నా అది ఉన్న లొకేషన్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ఉద్యోగావకాశాలు, మంచి రవాణా సౌకర్యం, స్కూళ్లు, కాలేజీలు ఉన్న ప్రాంతాల్లో అద్దెకు ఉండటానికి జనం సులభంగా దొరుకుతారు. కానీ 'రేపు అక్కడ కొత్త రోడ్డు వస్తుంది, మెట్రో వస్తుంది' అనే 'ఆశతో' మాత్రమే ఇల్లు కొనడం రిస్క్. ఆ ప్రాజెక్టులు ఆలస్యమైనా, అసలు రాకపోయినా మీ పెట్టుబడి మొత్తం దెబ్బతింటుంది.

45
అవసరానికి వెంటనే డబ్బుగా మార్చలేం
Image Credit : Pinterest

అవసరానికి వెంటనే డబ్బుగా మార్చలేం

ఆస్తుల్లో పెట్టుబడి పెట్టేవాళ్లు తరచుగా మరిచిపోయే విషయం ఇది. ఏదైనా అత్యవసరంగా డబ్బు అవసరమైతే, ఇతర ఇన్వెస్ట్‌మెంట్లలాగా ఒక్క క్లిక్‌తో ఇంటిని అమ్మి డబ్బుగా మార్చలేం. మార్కెట్ డల్‌గా ఉన్నప్పుడు లేదా మీకు అర్జెంట్‌గా డబ్బు కావాల్సినప్పుడు అమ్మడం చాలా కష్టమవుతుంది. దీనికి తోడు ఆస్తి కొనేటప్పుడు, అమ్మేటప్పుడు అయ్యే ఖర్చులు కూడా ఎక్కువే.

పన్నుల భారాన్ని మర్చిపోవద్దు

పెట్టుబడి లెక్కల్లో పన్నులను కూడా కలపాలి. ప్రస్తుత నిబంధనల ప్రకారం అద్దెకిచ్చిన ఇంటి కోసం తీసుకున్న లోన్ వడ్డీపై పన్ను మినహాయింపు పొందొచ్చు. కానీ అద్దెగా వచ్చే మొత్తాన్ని మీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయానికి కలుపుతారు. మీరు ఏ ట్యాక్స్ విధానాన్ని ఎంచుకున్నారు, మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేదాన్ని బట్టి దీని అసలు ప్రయోజనం ఆధారపడి ఉంటుంది.

55
ఆస్తినంతా ఒకేచోట పెట్టొద్దు
Image Credit : Gemini AI

ఆస్తినంతా ఒకేచోట పెట్టొద్దు

మీ మొత్తం సంపాదనలో ఇప్పటికే పెద్ద మొత్తం రియల్ ఎస్టేట్‌లో ఉంటే, మళ్లీ ఇంకో ఇల్లు కొనడం మీ ఇన్వెస్ట్‌మెంట్ డైవర్సిఫికేషన్‌ను దెబ్బతీస్తుంది. మీ డబ్బంతా ఆస్తుల్లోనే ఇరుక్కుపోతే, ఆకస్మిక అవసరాలకు డబ్బు సర్దుబాటు చేయడం కష్టమవుతుంది.

యజమానిగా ఉండే ప్రాక్టికల్ కష్టాలు

ఇంటిని అద్దెకివ్వడం అనేది అంత సులువు కాదు. మంచి అద్దెదారులను వెతకడం, రిపేర్లు చేయించడం, పేపర్ వర్కులు చూసుకోవడం, ఇల్లు ఖాళీగా ఉన్నప్పుడు వ్యవహారాలు చక్కబెట్టడం... ఇవన్నీ టైమ్ తీసుకునే పనులు. దీనికోసం ప్రొఫెషనల్ ప్రాపర్టీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీలను పెట్టుకోవచ్చు, కానీ దానికి అదనపు ఖర్చవుతుంది.

పెట్టుబడి కోసం ఇల్లు కొనాలా?

మీకు మంచి ఆర్థిక స్థోమత ఉండి, వెంటనే డబ్బుగా మార్చుకోగల ఇతర పెట్టుబడులు ఉంటే రెండో ఇల్లు కొనొచ్చు. స్పష్టమైన లక్ష్యాలు ఉండి, ఖర్చులకు తగ్గట్టుగా అద్దె, ఆస్తి విలువ పెరుగుతుందని నమ్మకం ఉంటేనే ఈ నిర్ణయం తీసుకోండి.

కానీ, 'భూమి ధర ఎప్పుడూ పెరుగుతుంది' అనే ఒక్క నమ్మకంతోనే ఇల్లు కొనడానికి బయలుదేరొద్దు. అది సరైన పెట్టుబడి వ్యూహం కాదు. డాక్యుమెంట్లపై సంతకం చేసే ముందు... రాబోయే అద్దె, లోన్ వడ్డీ, పన్నులు, మెయింటెనెన్స్ ఖర్చులు, అమ్మేటప్పుడు అయ్యే ఖర్చులు... వీటన్నింటినీ కచ్చితంగా లెక్కేసుకోండి. అతిగా ఊహించుకోకుండా వేసిన ఈ లెక్కలు మీకు అనుకూలంగా ఉంటే, రెండో ఇంటి గురించి ఆలోచించొచ్చు. లేదంటే ఆ డబ్బును వేరే చోట పెట్టుబడిగా పెట్టడమే తెలివైన పని.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Hike: పసిడి ప్రియులకు భారీ షార్.. రూ.2లక్షలకు చేరువలో తులం బంగారం
Recommended image2
Worlds Cheapest House: ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఇల్లు.. కేవలం 1 డాలర్‌ మాత్రమే !
Recommended image3
మీ పిల్ల‌లు కూడా గుడ్డులో తెల్ల‌ది తిని, ప‌చ్చ‌ది ప‌డేస్తున్నారా.? ఈ గ్యాడ్జెట్ ఉంటే అలా కుదరదు
Related Stories
Recommended image1
Home Loan : ఇల్లు కొనకుండానే హోమ్ లోన్ తీసుకోవచ్చా..! ఎలాగో తెలుసా?
Recommended image2
Home Loan : హోమ్ లోన్ కు కూడా ఇన్సూరెన్స్ తీసుకోవచ్చా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved