MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Feature
  • LPG Gas Cylinder : గ్యాస్ కనెక్షన్ లేకున్నా సరే.. ఇంట్లో కూర్చునే నిమిషాల్లో సిలిండర్ తెప్పించుకునే సూపర్ ట్రిక్

LPG Gas Cylinder : గ్యాస్ కనెక్షన్ లేకున్నా సరే.. ఇంట్లో కూర్చునే నిమిషాల్లో సిలిండర్ తెప్పించుకునే సూపర్ ట్రిక్

కిరాణా సరుకులు, పండ్లు, కూరగాయలే కాదు ఇకపై ఎల్పీజీ సిలిండర్ ను కూడా క్విక్ కామర్స్ ప్లాట్ ఫామ్ ద్వారా పొందవచ్చు. ఇన్‌స్టామార్ట్, హెచ్‌పీసీఎల్ కలిసి ఈ సరికొత్త సర్వీసును ప్రారంభించాయి.

2 Min read
Author : Arun Kumar P
Published : Jul 16 2026, 12:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఇకపై ఇన్‌స్టామార్ట్ లో గ్యాస్ సిలిండర్
Image Credit : Gemini AI

ఇకపై ఇన్‌స్టామార్ట్ లో గ్యాస్ సిలిండర్

ఆన్‌లైన్‌లో ఫుడ్, సరుకులు ఆర్డర్ చేయడం ఇప్పుడు కామన్ అయిపోయింది. కానీ వంట గ్యాస్ సిలిండర్‌ను కూడా నిమిషాల్లో ఇంటికి తెప్పించుకోవచ్చు అంటే నమ్మగలరా? క్విక్-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టామార్ట్ (Instamart), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL)తో కలిసి ఈ కొత్త సేవను అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఇండియాలో ఆన్-డిమాండ్ ఎల్పీజీ సిలిండర్లను డెలివరీ చేస్తున్న తొలి క్విక్-కామర్స్ సంస్థగా ఇన్‌స్టామార్ట్ నిలిచింది. ప్రస్తుతం ఈ సేవలు కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రారంభమయ్యాయి. ఈ ప్రయోగం సక్సెస్ అయితే త్వరలోనే హైదరాబాద్, చెన్నై, ముంబై, ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లోనూ ఈ సేవలను విస్తరించే అవకాశం ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఏయే సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి?
Image Credit : Getty

ఏయే సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి?

హెచ్‌పీసీఎల్ ఇటీవల లాంచ్ చేసిన 'హెచ్‌పీ నవ్య' (HP Navya) 10 కేజీల కాంపోజిట్ ఎల్పీజీ సిలిండర్‌ను ఇన్‌స్టామార్ట్ ద్వారా పొందవచ్చు. ఈ సిలిండర్ పాత ఇనుప సిలిండర్ల కన్నా బరువు తక్కువగా ఉంటుంది. అంతేకాదు దీనికి ఉన్న పారదర్శక డిజైన్ వల్ల లోపల గ్యాస్ ఎంత మిగిలి ఉందో సులభంగా చూసుకోవచ్చు. అంటే గ్యాస్ అయిపోతుంది అనగా మరో గ్యాస్ బుక్ చేసుకోవచ్చు. 

ఇక హెచ్‌పీసీఎల్ అందిస్తున్న 5 కేజీల మెటల్ సిలిండర్లు కూడా ఇన్‌స్టామార్ట్ అందుబాటులో ఉంటుంది. దీన్ని కూడా ఆర్డర్ చేసి కేవలం నిమిషాల్లోని ఇంటికి తెప్పించుకోవచ్చు. ఈ కొత్త సర్వీస్ ముఖ్యంగా విద్యార్థులు, ఒంటరిగా నివసించే యువత, ఐటీ ఉద్యోగులు, చిన్న కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు.

Related Articles

Related image1
Free LPG Gas : ఉచిత గ్యాస్ కనెక్షన్ ఎవరికి ఇస్తారు? ఎలా అప్లై చేసుకోవాలి?
Related image2
Now Playing
జూన్ 30 తర్వాత సబ్సిడీ రాదు.. కేంద్రం కీలక నిర్ణయం! | LPG Gas EKYC telugu | Asianet News Telugu
34
ఆన్లైన్ డెలివరీకి గ్యాస్ కనెక్షన్ అవసరమా?
Image Credit : istock

ఆన్లైన్ డెలివరీకి గ్యాస్ కనెక్షన్ అవసరమా?

ఈ సేవలో ఉన్న అతిపెద్ద సౌలభ్యం ఏంటంటే కస్టమర్లకు ముందే గ్యాస్ కనెక్షన్ ఉండాల్సిన అవసరం లేదు. మొదటిసారి సిలిండర్ కొనేవారిని కొత్త కస్టమర్లగా నమోదు చేసుకుంటారు. ఆ తర్వాత సిలిండర్ ఖాళీ అయ్యాక పాతదాన్ని ఇచ్చి కొత్త సిలిండర్ తీసుకోవచ్చు. 

ఎల్పీజీ వంటి ఇంధనాన్ని డెలివరీ చేయడంలో భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అన్ని ఆర్డర్లను హెచ్‌పీసీఎల్ అధీకృత డిస్ట్రిబ్యూటర్ల ద్వారానే డెలివరీ చేస్తారు. శిక్షణ పొందిన సిబ్బంది మాత్రమే సిలిండర్లను అందిస్తారు. మొదటిసారి కొనే కస్టమర్లు తప్పనిసరిగా గుర్తింపు ధ్రువీకరణ (ID verification) పూర్తి చేయాలి.

44
వేగంగా పెరుగుతున్న క్విక్ కామర్స్ మార్కెట్
Image Credit : X

వేగంగా పెరుగుతున్న క్విక్ కామర్స్ మార్కెట్

గత కొన్నేళ్లుగా ఇండియాలో క్విక్ కామర్స్ రంగం వేగంగా అభివృద్ధి చెందింది. 10 నుంచి 20 నిమిషాల్లో సరుకులు, మందులు వంటివి ఇంటికి వస్తున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో ఎల్పీజీ సిలిండర్లు కూడా చేరాయి. 

2020లో ప్రారంభమైన ఇన్‌స్టామార్ట్ ప్రస్తుతం 130కి పైగా నగరాల్లో పనిచేస్తోంది. 50,000కు పైగా వస్తువులను డెలివరీ చేస్తున్న ఈ సంస్థ, ఇప్పుడు ఎల్పీజీ డెలివరీ రంగంలోకి కూడా అడుగుపెట్టింది. ఇన్‌స్టామార్ట్, హెచ్‌పీసీఎల్ భాగస్వామ్యం.. ఇండియాలో ఎల్పీజీ కొనుగోలు విధానాన్ని మార్చే కీలక ముందడుగుగా నిపుణులు భావిస్తున్నారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
యుటిలిటీ
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Gas Cylinder Safety : గ్యాస్ సిలిండర్‌పై ఉండే A, B, C, D కోడ్ ఏంటో తెలుసా? దీనిలో ఇంత అర్థం దాగుందా?
Recommended image2
Prime Ministers Favorite Food : నెహ్రూ నుండి మోదీ వరకు.. ఏ ప్రధాని, ఏ ఫుడ్ ఇష్టంగా తినేవారో తెలుసా?
Recommended image3
America: అమెరికాలో ఇండియన్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల జీతాలు ఎంత ఉంటాయి? నెలకు ఎంత మిగులుతుంది?
Related Stories
Recommended image1
Free LPG Gas : ఉచిత గ్యాస్ కనెక్షన్ ఎవరికి ఇస్తారు? ఎలా అప్లై చేసుకోవాలి?
Recommended image2
Now Playing
జూన్ 30 తర్వాత సబ్సిడీ రాదు.. కేంద్రం కీలక నిర్ణయం! | LPG Gas EKYC telugu | Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved