Poori oil: వేడి నూనెలో ఆ పదార్థాలు వేస్తే పూరీలు, పకోడీలు నూనె పీల్చవా?
Poori oil: పూరీలు, పకోడీలు నూనెలో వేయించే ముందు ఆ నూనెలో చిన్న అల్లం ముక్క వేయాలని కొందరు అంటారు. అలా చేయడం వల్ల పూరీలు నూనె పీల్చవని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అసలు ఇందులో నిజమెంత?
నూనెలో అల్లం వేస్తే ఏమవుతుంది?
సోషల్ మీడియాలో ఒక కిచెన్ హ్యాక్ బాగా వైరల్ అవుతోంది. పూరీ, పకోడీలు వేయించే ముందు వేడి నూనెలో చిన్న అల్లం ముక్క వేస్తే అవి తక్కువ నూనె పీలుస్తాయని అంటారు. కానీ ఇది నిజంగానే పనిచేసే ట్రిక్? అవునా కాదా అని ఎక్కువ మంది సందేహం ఉంది. నూనె వేడెక్కాక అందులో కొద్దిగా అల్లం, వెల్లుల్లి లేదా కరివేపాకు వేయాలి. ఆ తర్వాత అదే నూనెలో పూరీ, పకోడీలు వేయించాలి. ఇలా చేస్తే స్నాక్స్ తక్కువ నూనె పీల్చుకుంటాయని, జిడ్డుగా ఉండవని చెబుతున్నారు. వేడి నూనె నుంచి వచ్చే వాసన, పొగను కూడా అల్లం తగ్గిస్తుందని కొందరు అంటున్నారు.
అల్లం వేస్తే ఏమవుతుంది?
వేడి నూనెలో అల్లం ముక్క లేదా అల్లం తురిమి వేసినప్పుడు అందులోని సహజ నూనెలు (ఎసెన్షియల్ ఆయిల్స్) వంట నూనెలో కలిసిపోయి మంచి సువాసన ఇస్తాయి. ఆ తర్వాత అదే నూనెలో పకోడీ లేదా పూరీ వేయించినప్పుడు, ఆ సువాసన వాటికి కూడా పడుతుంది. కాబట్టి అల్లం వేయడం వల్ల స్నాక్స్‌కు కాస్త భిన్నమైన రుచి, వాసన వచ్చే అవకాశం ఉంది. కానీ ఆరోగ్యకరమనే చెప్పాలి.
అయితే అల్లం వేస్తే పూరీలు, పకోడీలు తక్కువ పీల్చుకుంటాయా అంటే… కొన్ని విషయాలు పరిగణనలోకిన తీసుకోవాలి. నూనె ఉష్ణోగ్రత, పిండి కన్సిస్టెన్సీ వంటివి కూడా ఆధారపడతాయి. నూనెలో అల్లం ముక్క వేయడం వల్ల నూనె పీల్చడం తగ్గుతుందని చెప్పడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. నూనె సరైన వేడిలో ఉంటే స్నాక్స్ సాధారణంగానే తక్కువ నూనె పీల్చుకుంటాయి. నూనె వేడి తగ్గితే మాత్రం ఆహారం ఎక్కువ నూనె పీల్చుకుంటుంది.
వేసేటప్పుడు జాగ్రత్త
అల్లంలో నీటి శాతం అధికంగా ఉంటుంది. కాబట్టి దాన్ని బాగా వేడిగా ఉన్న నూనెలో వేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పైకి చిమ్మే ప్రమాదం ఉంది. అలాగే బాగా వేడిగా ఉన్న నూనెలో కరివేపాకులు, వెల్లుల్లి వేసినా కూడా పైగి ఎగజిమ్మవచ్చు. అందుకే నూనె వేడిగా ఉన్నప్పుడు ఇవి వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నూనె నుంచి పొగ లేదా మాడిన వాసన రాకుండా చూసుకోవడానికి సరైన ఉష్ణోగ్రతను మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం.

