నాన్ స్టిక్ పాత్రలు వాడాలా వద్దా..? నిపుణుల సమాధానం ఇదే..!
స్టీలు, అల్లూమినియం వచ్చాయి.. కానీ వాటిల్లో వంట చేస్తే ఎక్కువగా మాడిపోతాయని.. అందరి చూపు నాన్ స్టిక్ మీద పడింది. ఒక దశాబ్దకాలంగా.. నాన్ స్టిక్ వాడకం బాగా పెరిగిపోయింది.
మారుతున్న కాలాన్ని పట్టి.. మనం తినే ఆహారమే కాదు.. వంటకు వాడే పాత్రల వరకు అన్నీ మారిపోతున్నాయి. మన తాత, ముత్తాత ల కాలంలో అందరూ వంట చేయడానికి మట్టిపాత్రలే వాడేవారు. కానీ.. తర్వాతర్వాత వంట చేసే పాత్రల్లో మార్పులు వచ్చాయి. తర్వాత స్టీలు, అల్లూమినియం వచ్చాయి.. కానీ వాటిల్లో వంట చేస్తే ఎక్కువగా మాడిపోతాయని.. అందరి చూపు నాన్ స్టిక్ మీద పడింది. ఒక దశాబ్దకాలంగా.. నాన్ స్టిక్ వాడకం బాగా పెరిగిపోయింది.
non stick pans
అయితే.. ఈ మధ్యే కాస్త.. నాన్ స్టిక్ ప్యాన్స్ ని అందరూ వెనక్కి పెడుతున్నారు. ఎందుకంటే.. ఇవి ఆరోగ్యానికి మంచిది కాదు అనే విషయం జనాలకు అర్థమౌతోంది. నిజంగానే.. నాన్ స్టిక్ ప్యాన్స్ వాడటం మంచిది కదా..? ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అంటే ICMR ఇటీవల ఆహార మార్గదర్శకాలను జారీ చేసింది. దాని ప్రకారం మనం నాన్ స్టిక్ వాడటం మంచిదో కాదో తెలుసుకుందాం...
ICMR మార్గదర్శకాల ప్రకారం, నాన్-స్టిక్ పాత్రలలో వంట చేయడం ఖచ్చితంగా సులభంగా , సౌకర్యవంతంగా ఉంటుంది. కానీ, ఆరోగ్య పరంగా ఇది మంచిది కాదు. నాన్-స్టిక్ కోటింగ్‌ల తయారీలో ఉపయోగించే రసాయనాలు అధిక ఉష్ణోగ్రతల వద్ద వేడి చేసినప్పుడు విషపూరిత పొగలను విడుదల చేస్తాయి.
అందువల్ల, వాటిని నివారించడం మంచిది. దీని వల్ల థైరాయిడ్, శ్వాసకోశ సమస్యలు, క్యాన్సర్ కూడా రావచ్చు. నాన్ స్టిక్ పాన్ లో వండేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ మంట లేకుండా చూసుకోవాలి.
అసలు వంట చేయడానికి మట్టి పాత్రలు అత్యంత సురక్షితమైనవని ICMR తెలిపింది. ఆహారాన్ని వండడం, తినడం, మట్టి పాత్రల్లో నిల్వ ఉంచడం ఈ మూడూ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇవి ఆహారంలో పోషకాహారాన్ని పెంచడంతో పాటు ఆహారంలో రుచిని కూడా పెంచుతాయి. వాటి తర్వాత.. స్టీల్ పాత్రలను ఎంచుకోవచ్చు.