కలబందను ఇలా పెడితే.. జుట్టు రాలే అవకాశమే ఉండదు
కలబందలో ప్రోటీయోలైటిక్ ఎంజైమ్లు ఉంటాయి. ఇవి జుట్టు పెరిగేందుకు సహాయపడతాయి. కలబంద జెల్ లో విటమిన్ బి 12, ఫోలిక్ యాసిడ్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గించడానికి సహాయపడతాయి.
కలబందలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. ఈ జెల్ ఎన్నో చర్మ సమస్యలను కూడా తగ్గిస్తుంది. అందుకే దీన్ని నేచురల్ బ్యూటీ ప్రొడక్ట్ అంటారు. కలబంద చర్మ సంరక్షణకే కాదు, జుట్టు సంరక్షణకు కూడా అద్భుతమైన ఔషధం. కలబంద జెల్ ను మీ జుట్టు కుదుళ్లకు అప్లై చేయడం వల్ల మీ జుట్టు బలోపేతం అవుతుంది. అలాగే చుండ్రు కూడా పూర్తిగా పోతుంది. నెత్తిమీద చుండ్రు ఉంటే జుట్టు విపరీతంగా రాలుతుంది. అలాగే జుట్టు పెరుగుదల కూడా ఆగుతుంది.
![article_image2](https://static-ai.asianetnews.com/images/01f7x92bgs045ps8m780h70036/aloe-vara-jpg_300x171xt.jpg)
Aloe Vera
కలబంద జెల్ ను నెత్తికి అప్లై చేయడం వల్ల దురద, జుట్టు పగుళ్లు తగ్గుతాయి. కలబంద నెత్తిమీద, జుట్టుపై రక్షిత పొరను ఏర్పరచడానికి కూడా సహాయపడుతుంది. కాలుష్య కారకాలు, దుమ్ము, ఇతర పర్యావరణ కారకాల వంటి బాహ్య కారకాల నుంచి కూడా జుట్టును రక్షిస్తుంది.
కలబందలో ఉండే తేమ జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి, జుట్టుకు అవసరమైన పోషకాలను అందించడానికి సహాయపడుతుంది. కలబందలో ప్రోటీయోలైటిక్ ఎంజైమ్లు ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలను పెంచుతాయి. కలబంద జెల్ లో విటమిన్ బి 12, ఫోలిక్ యాసిడ్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గించడానికి సహాయపడతాయి.
జుట్టు రాలడాన్ని తగ్గించడానికి కలబందను ఎలా ఉపయోగించాలి?
కలబంద జెల్, ఉల్లిపాయ రసం
ముందుగా ఒక టీస్పూన్ అలోవెరా జెల్ ను తీసుకుని అందులో రెండు టీస్పూన్ల ఉల్లిపాయ రసాన్ని కలపండి. ఆ తర్వాత దీన్ని జుట్టుకు అప్లై చేయండి. దీన్ని వారానికి రెండు లేదా మూడు సార్లు అప్లై చేయొచ్చు. జుట్టు రాలడాన్ని తగ్గించడానికి, జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి ఈ ప్యాక్ ప్రయోజనకరంగా ఉంటుంది.
aloe vera
కలబంద జెల్, కొబ్బరి నూనె
కొబ్బరి నూనె జుట్టును ప్రకాశవంతం చేయడానికి, మృదువుగా చేయడానికి సహాయపడుతుంది. ఇందుకోసం రెండు టీస్పూన్ల కలబంద జెల్ లో ఒక టీస్పూన్ కొబ్బరి నూనె మిక్స్ చేసి జుట్టు చివర్ల వరకు మసాజ్ చేయాలి. ఈ ప్యాక్ మీ జుట్టును షైనీగా చేస్తుంది. అలాగే మృదువుగా ఉంచుతుంది. ఇది మీ జుట్టు పెరగడానికి కూడా సహాయపడుతుంది.