MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Kitchen Hacks: కూరలో ఉప్పు, కారం ఎక్కువైందా? చిటికెలో సరిచేసే సీక్రెట్ టిప్స్

Kitchen Hacks: కూరలో ఉప్పు, కారం ఎక్కువైందా? చిటికెలో సరిచేసే సీక్రెట్ టిప్స్

Kitchen Hacks: వంట చేస్తున్నప్పుడు పొరపాటున కూరలో ఉప్పు కానీ, కారం కానీ ఎక్కువ వేసేస్తూ ఉంటాం. ఆ పొరపాటుని చాలా మందికి సరి చేయడం రాదు. ఆ కూర తినలేక పారేస్తారు. కానీ, నిమిషాల్లో దానిని సరిచేయచ్చు.

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 29 2026, 10:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Cooking Hacks
Image Credit : gemini ai

Cooking Hacks

ప్రతి ఒక్కరూ వంట రుచిగా చేయాలనే అనుకుంటారు. దాని కోసమే ఎంతో ఓపికగా, ఇష్టంగా గంటల తరబడి వంట గదిలో కష్టపడి వంట చేస్తారు. కానీ, ఒక్కోసారి ఇంటికి అతిథులు వస్తున్నప్పుడో లేక.. మనకు సరిగా టైమ్ లేనప్పుడో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా కంగారులో ఉప్పు కానీ, కారం కానీ ఎక్కువగా వేస్తేస్తూ ఉంటాం. రోజూ చేసే వంట అయినా సరే.. సరిగ్గా ఎవరైనా అతిథులు ఇంటికి వచ్చే సమయంలోనే ఇలాంటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఇక.. ఆ వంట అతిథులకు ఎలా పెట్టాలా అని తిప్పలు పడుతూ ఉంటాం. కానీ, ఎలాంటి కంగారు లేకుండా.. ఆ కూరను పారేయాల్సిన అవసరం లేకుండా.. నిమిషాల్లో ఉప్పు, కారం సరిచేయడమే కాకుండా.. మరింత రుచిగా కూడా మార్చేయచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
1.పాలు, పాల పదార్థాలు..
Image Credit : gemini ai

1.పాలు, పాల పదార్థాలు..

కూరలో కారం బాగా ఎక్కువై, నోరు మండిపోతుంటే.. దానికి చెక్ పెట్టేందుకు పాలు, పెరుగు లేదా ఫ్రెష్ క్రీమ్ బెస్ట్ ఆప్షన్. ఇవి కారాన్ని తగ్గించడమే కాకుండా గ్రేవీకి మంచి రిచెనెస్, మంచి టెక్స్చర్ ను ఇస్తాయి. కూరలో కారం తగ్గడమే కాదు... కూరకు మంచి రుచిని కూడా అందిస్తుంది.

2. తీపి కలపడం...

కూరలో కారం ఎక్కువైనప్పుడు, సరిగ్గా పాలు కూడా అందుబాటులో లేదు అనుకున్నప్పుడు తీపి వాడొచ్చు. కారాన్ని తగ్గించడానికి తీపి పదార్థాలు బాగా పని చేస్తాయి. కూరలో కొద్దిగా పంచదార, తేనె లేదా బాగా చిన్నగా కోసిన ఖర్జూరం ముక్కలు కలిపితే కారం తగ్గుతుంది. మలై కోఫ్తా వంటి దాబా స్టైల్ కూరలకి ఈ చిట్కా అద్భుతంగా సెట్ అవుతుంది.

33
ఉడకపెట్టిన బంగాళదుంపలు..
Image Credit : AI Image

ఉడకపెట్టిన బంగాళదుంపలు..

కూరలో ఉప్పు ఎక్కువైతే సరిచేయడానికి ఉడకబెట్టిన బంగాళాదుంప ముక్కలు లేదా గుజ్జు వేస్తే చాలు. బంగాళాదుంప అదనంగా ఉన్న ఉప్పునంతటినీ పీల్చేస్తుంది. గ్రేవీ కాస్త చిక్కబడితే కొద్దిగా నీళ్లు కలిపి మీకు కావలసిన కన్సిస్టెన్సీకి తెచ్చుకోవచ్చు.

గోధుమపిండి ఉండలు.. 

తరతరాలుగా మన ఇళ్లలో వాడే బెస్ట్ కిచెన్ హ్యాక్ ఇది. కొద్దిగా గోధుమపిండిలో నీళ్లు పోసి, చిన్న చిన్న ఉండలుగా చేసి ఉప్పు ఎక్కువైన కూరలో వేయాలి. ఇవి ఉప్పును పీల్చుకున్నాక, వడ్డించే ముందు ఆ పిండి ఉండలను బయటకు తీసేస్తే సరిపోతుంది.

సలాడ్‌లు, పులావ్ లేదా బిర్యానీ లాంటి వాటిల్లో ఉప్పు, కారాలు ఎక్కువైతే పాలు లేదా బంగాళాదుంప గుజ్జు కలపలేం కదా.. అలాంటప్పుడు సలాడ్‌లో ఉప్పు లేని పాలకూర, లెట్యూస్ ఆకులు లేదా అదనపు కూరగాయ ముక్కలు కలపాలి. పులావ్ అయితే కొద్దిగా ఉప్పు లేని సాదా అన్నాన్ని లేదా ఉడకబెట్టిన కూరగాయలను కలిపి తిప్పితే కారం, ఉప్పు తగ్గుతాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 
3rd TEST • SA vs AUS
Stumps
SASA
329
AUSAUS
(90.0 ov)330/4
Day 2
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Recommended Stories
Recommended image1
Blouse Designs: తక్కువ బడ్జెట్ లో గ్రాండ్ లుక్ తెచ్చే బ్లౌజు డిజైన్లు
Recommended image2
Coolest State: భారతదేశంలో అత్యంత చల్లని రాష్ట్రం ఇదే..ఎటు చూసినా మంచే
Recommended image3
Weight Loss Teas: వెయిట్ లాస్ టీ...ఇది తాగితే చాలు ఒంట్లో కొవ్వు అలా కరిగిపోద్ది
Related Stories
Recommended image1
Makhana Capital: మన దేశంలో మఖానా రాజధాని ఏది? ప్రపంచం మొత్తానికి ఇక్కడి నుంచే సరఫరా..!
Recommended image2
Achaar Capital: మన దేశపు పచ్చళ్ల రాజధాని ఏదో తెలుసా? విదేశాల్లోనూ ఈ పచ్చళ్లదే హవా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved