MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Achaar Capital: మన దేశపు పచ్చళ్ల రాజధాని ఏదో తెలుసా? విదేశాల్లోనూ ఈ పచ్చళ్లదే హవా

Achaar Capital: మన దేశపు పచ్చళ్ల రాజధాని ఏదో తెలుసా? విదేశాల్లోనూ ఈ పచ్చళ్లదే హవా

Achaar Capital: మన దేశంలో స్పెషల్ గా పచ్చళ్లకు ఒక రాజధాని ఉందని తెలుసా? దేశం మొత్తం పచ్చళ్లు దొరుకుతున్నా ఒకే ఒక్క ప్లేస్ ని మాత్రమే పచ్చళ్లకు రాజధానిగా ఎందుకు మార్చారు? ఇక్కడి పచ్చళ్లకు ఉన్న స్పెషాలిటీ ఏంటో తెలుసా?

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 28 2026, 03:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఇక్కడి పచ్చళ్లు ఎందుకంత ఫేమస్..?
Image Credit : chat gpt

ఇక్కడి పచ్చళ్లు ఎందుకంత ఫేమస్..?

ప్రతిరోజూ ఎన్నో రకాల వంటలు డైనింగ్ టేబుల్ పై ఉన్నా కూడా...ఒక్క ముద్ద అయినా పచ్చడితో తినకపోతే చాలా మందికి నిద్రపట్టదు. భోజనం చేశామన్న ఫీలింగ్ కూడా ఉండదు. మామిడికాయ, నిమ్మకాయ, పచ్చిమిర్చీ, అల్లం, వెల్లుల్లి ఇలా చాలా రకాల పచ్చళ్లు ఉన్నాయి. మన దేశంలో ఊరగాయలు చేయడం కేవలం ఒక వంట కాదు, అదొక సంప్రదాయ కళ. ప్రతీ ప్రాంతానికి, ప్రతి ఇంటికి పచ్చడి తయారీలో ఒక ప్రత్యేకమైన మసాలా సీక్రెట్ ఉంటుంది. ఇన్ని ఉన్నా కూడా... మన దేశంలో స్పెషల్ గా పచ్చళ్లకి ప్రత్యేకంగా ఒక రాజధాని ఉంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
పచ్చళ్ల రాజధాని ఏది?
Image Credit : geminiai

పచ్చళ్ల రాజధాని ఏది?

పానిపట్ ని పచ్చళ్ల రాజధానిగా పిలుస్తారు. చరిత్రలో పానిపట్ అనగానే మనకు పానిపట్ యుద్ధం గుర్తుకు వస్తుంది. అంతేకాదు.. ఈ ప్రదేశం చేనేత రంగానికి కూడా చాలా ఫేమస్. ఇక్కడ పచ్చళ్ల వ్యాపారం ఒక చిన్న కుటీర పరిశ్రమగా ప్రారంభమై, నేడు దేశ విదేశాలకు ఎగుమతి అయ్యే భారీ పరిశ్రమగా రూపాంతరం చెందింది. ఈ నగరంలో పదుల సంఖ్యలో పచ్చళ్ల తయారీ ఫాక్టరీలు, వందలాది ఫేమస్ పచ్చళ్ల దుకాణాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మామిడి, నిమ్మ, క్యారెట్, పచ్చిమిర్చి, మిక్స్డ్ పచ్చళ్లకు దేశ వ్యాప్తంగా కాకుండా విదేశాల్లోనూ విపరీతమైన డిమాండ్ ఉంది.

33
పచరంగ పచ్చడి...
Image Credit : Gemini

పచరంగ పచ్చడి...

పానిపట్ పచ్చళ్ల పరిశ్రమ గురించి మాట్లాడుకుంటే ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన పేరు పచరంగ పచ్చడి. ఈ సంస్థ ప్రయాణం 1943లో కేవలం 3 రకాల ప్రత్యేక పచ్చడి వంటకాలతో ప్రారంభమైంది. దశాబ్దాల కాలంలో ఇది ఒక స్థానిక బ్రాండ్ నుంచి భారతదేశమంతటా తెలిసిన భారీ నెట్‌వర్క్‌గా ఎదిగింది. నేడు పచరంగ పచ్చళ్లు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 25కి పైగా దేశాలకు ఎగుమతి అవుతున్నాయి.

ఇక్కడ పచ్చడిని ఎలా తయారు చేస్తారంటే...

పానిపట్‌లో చేసే సాంప్రదాయ పచ్చడి రుచికి వారి తయారీ విధానమే ప్రధాన కారణం. తాజా కూరగాయలు లేదా పండ్లను ముక్కలుగా కోసి, ఉప్పు తగిలించి ఎండలో ఆరబెడతారు. ఆవాలు, సోంపు, మెంతులు, కారం, నూనెలను సరైన నిష్పత్తిలో కలిపి ఆ ముక్కలకు పట్టిస్తారు. ఈ మిశ్రమాన్ని కొన్ని రోజుల పాటు లేదా వారాల పాటు ప్రత్యేక పాత్రల్లో ఊరబెడతారు. ఆ సమయంలో మసాలాల రుచి ముక్కలకు పట్టి ఆ ఘాటైన, పుల్లటి కమ్మని రుచి వస్తుంది. పచ్చళ్లు అంటే ఇష్టం ఉన్నవారు జీవితంలో ఒక్కసారైనా ఇక్కడ పచ్చళ్ల రుచి ఆస్వాదించాల్సిందే.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 
3rd TEST • SA vs AUS
Live
SASA
329
AUSAUS
(26.3 ov)86/2
Day 2 - Session 1
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Recommended Stories
Recommended image1
Mangalsutra: చీరల మీదకు మీ అందాన్ని పెంచే లాంగ్ మంగళసూత్రాలు..చూసేయండి
Recommended image2
Teeth Pain Remedies: పంటి నొప్పిని తగ్గించే బెస్ట్ చిట్కాలు ఇవిగో!
Recommended image3
Ragi Sangati: రాగి సంగటి రుచిగా, మెత్తగా రావాలంటే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే చాలు!
Related Stories
Recommended image1
Makhana Capital: మన దేశంలో మఖానా రాజధాని ఏది? ప్రపంచం మొత్తానికి ఇక్కడి నుంచే సరఫరా..!
Recommended image2
Jaggery Capital: మన దేశపు బెల్లం రాజధాని ఏదో తెలుసా? ప్రపంచంలోనే అతిపెద్ద బెల్లం మార్కెట్ ఇది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved