తలనొప్పి భరించలేనంతగా వస్తోందా? అయితే ఈ చిట్కాలు మీకోసమే..!
చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ తలనొప్పితో బాధపడుతున్నారు. దీనివల్ల ఏ పనీ చేయాలనిపించదు. ఏదీ తోచదు. అయితే కొన్ని సింపుల్ టిప్స్ తో తలనొప్పిని చిటికెలో తగ్గించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
నేటి ఒత్తిడితో కూడిన జీవితంలో చాలా మంది తలనొప్పితో బాధపడుతున్నారు. తలనొప్పి సర్వ సాధారణ సమస్యగా మారిపోయింది. దీనిని తగ్గించుకోవడానికి చాలా మంది తరచుగా మందులను వాడుతుంటారు. కానీ మందులను ఎక్కువగా వాడటం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. దీనివల్ల రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే మందులను వాడకుండానే తలనొప్పిని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. అయితే కొన్ని సింపుల్ టిప్స్ తో చాలా తొందరగా తలనొప్పి తగ్గుతుంది. అవేంటంటే?
1. మీకు కూడా తరచుగా తలనొప్పి వస్తే.. నుదుటిన చల్లని బ్యాండేజీని పెట్టండి. ఇది కాకుండా కాటన్ క్లాత్ లేదా టవల్ లో ఐస్ క్యూబ్స్ ను పెట్టి కూడా మీరు నుదిటిన పెట్టుకోవచ్చు. లేదా చల్లని నీటితో కూడా తలను కడుక్కోవచ్చు. దీనివల్ల తలనొప్పి నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుంది.
2. తలనొప్పి ఎన్నో కారణాల వల్ల వస్తుంది. అందుకే దీన్ని మీరు గుర్తించాలి. కొన్నికొన్ని సార్లు టోపీలు, స్విమ్మింగ్ గాగుల్స్ లేదా టైట్ రబ్బర్ బ్యాండ్లు ధరించడం కూడా తలనొప్పి వస్తుంది. అందుకే తలనొప్పి వచ్చినప్పుడు మీ జుట్టును లీవ్ చేయండి. పోనీటెయిల్ వేసిన ప్రాంతాన్ని వేళ్లతో మసాజ్ చేయండి.
3. తలనొప్పి నుంచి బయటపడటానికి ఆక్యుప్రెషర్ కూడా చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. మీరు ఈ ప్రక్రియను రెండు చేతులకు 5 నిమిషాలు రిపీట్ చేయాలి. ఇది కూడా తలనొప్పి నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.
headache
4. ఎక్కువ సేపు చూయింగ్ గమ్ నమలడం వల్ల కూడా తలనొప్పి వస్తుంది. అందుకే చూయింగ్ గమ్ ను నమలకూడదు. ఇలా చేయడం వల్ల దవడలలో నొప్పి మొదలయ్యి ఈ నొప్పి తలకు చేరుకుంటుంది. దీన్ని తట్టుకోవడం చాలా కష్టంగా మారుతుంది. ఇలాంటి సమయంలో మీరు అల్లంను నీటిలో మరిగించి వడకట్టి ఆ నీటిని తాగొచ్చు. దీన్ని టీ లేదా కషాయంలో కలుపుకుని తాగితే తలనొప్పి సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
5. తలనొప్పితో బాధపడుతున్నప్పుడు పుదీనా ఆకులను గ్రైండర్ లో గ్రైండ్ చేసి దాని రసాన్ని నుదుటిపై అప్లై చేయడం వల్ల కూడా ఉపశమనం కలుగుతుంది. పుదీనాలో తలనొప్పి నుంచి ఉపశమనం కలిగించే ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఇది భరించలేని తలనొప్పిని కూడా ఇట్టే తగ్గిస్తుంది.