MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Watermelon Idli: పిల్లలు ఇడ్లీ తినడం లేదా? అయితే ఇలా చేసి పెట్టండి..ప్లేట్ ఖాళీ చేసేస్తారు

Watermelon Idli: పిల్లలు ఇడ్లీ తినడం లేదా? అయితే ఇలా చేసి పెట్టండి..ప్లేట్ ఖాళీ చేసేస్తారు

Watermelon Idli : పిల్లలు ఇడ్లీ తినడానికి మారాం చేస్తున్నారా? అయితే ఓసారి ఇలా ట్రై చేయండి. చూడగానే వావ్ అంటూ లాగించేస్తారు. ఇప్పటివరకూ బీట్ రూట్, క్యారెట్, పాలకూరతో చేసుంటారు. ఒకసారి ఈ కలర్ ఫుల్ ఇడ్లీ పెడితే...హ్యాపీగా తినేస్తారు. రెసిపీ చూద్దాం.

2 Min read
Author : Nandini Arava
Published : Oct 09 2026, 10:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
వాటర్‌మెలన్ ఇడ్లీ
Image Credit : Gemini Ai

వాటర్‌మెలన్ ఇడ్లీ

సాధారణంగా పిల్లలు ఇడ్లీ అంటే చాలు ఆమడ దూరం పరిగెడతారు. తినడానికి మారాం చేస్తారు. తినిపించినా ముఖం తిప్పేస్తారు. పూరీ, దోశెలు, గారెలైతే హ్యాపీగా తినేస్తారు. కానీ ఇడ్లీనే ఆరోగ్యం. చెప్పినా వినరు. అయితే ఓసారి ఇలా ట్రై చేయండి. చూడగానే వావ్ అంటూ లాగించేస్తారు. ఇప్పటివరకూ బీట్ రూట్, క్యారెట్, పాలకూరతో చేసుంటారు. ఒకసారి ఈ కలర్ ఫుల్ ఇడ్లీ పెడితే...హ్యాపీగా తినేస్తారు.

రోజూ ఒకేలాంటి ఇడ్లీలు పెట్టి మీకు కూడా బోర్ కొడుతుంది కూడాను. అయితే ఇంట్లో ఉండే సాధారణ ఇడ్లీ పిండితోనే ఎరుపు, తెలుపు, ఆకుపచ్చ రంగుల్లో అదిరిపోయే వాటర్‌మెలన్ ఇడ్లీని ట్రై చేయండి. చూడటానికి కలర్ ఫుల్ గా ఉండే ఈ ఇడ్లీలో నల్ల నువ్వులను గింజల్లా చల్లితే అచ్చం పుచ్చకాయ ముక్కలాగే కనిపిస్తుంది. ముఖ్యంగా పిల్లల లంచ్ బాక్స్‌కి ఇది బెస్ట్ ఐడియా.

వాటర్‌మెలన్ ఇడ్లీ అంటే పుచ్చకాయ ఆకారంలో చేసే ఒక వెరైటీ ఇడ్లీ. ఆకుపచ్చ రంగు కోసం పాలకూర పేస్ట్, ఎరుపు కోసం బీట్‌రూట్ పేస్ట్ వాడతాం. మధ్యలో తెల్లటి ఇడ్లీ పిండిని వేసి, ఎర్రటి భాగంలో నల్ల నువ్వులు చల్లితే పుచ్చకాయ గింజల్లా భలే అందంగా ఉంటాయి.

ఇది పిల్లలను ఇట్టే ఆకర్షిస్తుంది. రెగ్యులర్ ఇడ్లీని కాస్త వెరైటీగా వడ్డించడానికి బాగా ఉపయోగపడుతుంది.

కావాల్సిన పదార్థాలు

ఇడ్లీ పిండి - తగినంత

బీట్‌రూట్ పేస్ట్ లేదా రసం - తగినంత

పాలకూర పేస్ట్ - తగినంత

నల్ల నువ్వులు - తగినంత

నూనె లేదా నెయ్యి - ఇడ్లీ ప్లేట్‌కు రాయడానికి

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
వాటర్‌మెలన్ ఇడ్లీ తయారీ విధానం - స్టెప్ 1
Image Credit : Gemini Ai

వాటర్‌మెలన్ ఇడ్లీ తయారీ విధానం - స్టెప్ 1

ఇడ్లీ పిండిని విడదీయండి

ముందుగా మీకు కావాల్సినంత ఇడ్లీ పిండిని తీసుకుని, దాన్ని మూడు వేర్వేరు గిన్నెల్లో సమానంగా పంచుకోండి.

మొదటి గిన్నెలోని ఇడ్లీ పిండిలో కొద్దిగా పాలకూర పేస్ట్ వేసి బాగా కలపండి. పిండి పల్చబడకుండా చూసుకుంటూ తగినంత పేస్ట్ మాత్రమే కలపాలి. పుచ్చకాయ బయటి ఆకుపచ్చని చర్మాన్ని తయారు చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.

రెండో గిన్నెలోని ఇడ్లీ పిండిలో బీట్‌రూట్ పేస్ట్ లేదా బీట్‌రూట్ రసం వేసి కలపండి. మంచి ఎరుపు లేదా గులాబీ రంగు వచ్చే వరకు కలుపుకోవచ్చు.

మూడో గిన్నెలోని ఇడ్లీ పిండిలో ఎలాంటి రంగు కలపకుండా అలాగే ఉంచండి. ఆకుపచ్చ, ఎరుపు రంగుల మధ్య ఉండే తెల్లటి భాగాన్ని ఇది కవర్ చేస్తుంది.

36
ఇడ్లీ ప్లేట్‌లో ఎలా వేయాలి?
Image Credit : Gemini Ai

ఇడ్లీ ప్లేట్‌లో ఎలా వేయాలి?

ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ గుంటల్లో కొద్దిగా నూనె లేదా నెయ్యి రాయండి. ముందుగా ఇడ్లీ ప్లేట్ గుంట అంచుల్లో ఆకుపచ్చ రంగు పిండిని గుండ్రంగా పోయాలి.

46
నల్ల నువ్వులు చల్లండి
Image Credit : Gemini Ai

నల్ల నువ్వులు చల్లండి

ఆకుపచ్చ పిండి మధ్యలో కొద్దిగా తెలుపు రంగు పిండిని పోయాలి. ఆ తెలుపు రంగు మధ్యలో ఎరుపు రంగు బీట్‌రూట్ పిండిని పోసి నింపాలి. ఇలా చేయడం వల్ల చూడగానే పుచ్చకాయ ముక్కలా కనిపిస్తుంది. ఎరుపు రంగు పిండి పైన అక్కడక్కడా కొద్దిగా నల్ల నువ్వులు చల్లండి. ఇడ్లీ ఉడికిన తర్వాత ఇవి పుచ్చకాయలోని నల్లటి గింజల్లా భలే అందంగా కనిపిస్తాయి.

56
ఆవిరి మీద ఉడికించే విధానం
Image Credit : Gemini Ai

ఆవిరి మీద ఉడికించే విధానం

ఇడ్లీ పాత్రలో తగినంత నీళ్లు పోసి మరిగించండి. ఆ తర్వాత సిద్ధం చేసుకున్న ఇడ్లీ ప్లేట్లను లోపల పెట్టి మూతపెట్టండి. మంటను మీడియంలో ఉంచి సుమారు 10-12 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించండి. ఇడ్లీలు ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి, కాసేపు చల్లారనివ్వండి. ఆ తర్వాత గరిటె లేదా ఇడ్లీ స్పూన్ సాయంతో మెల్లగా వాటిని బయటకు తీయండి.

66
వాటర్‌మెలన్ ఇడ్లీ రెడీ
Image Credit : Gemini Ai

వాటర్‌మెలన్ ఇడ్లీ రెడీ

పుచ్చకాయ ఆకారం స్పష్టంగా కనిపించేలా ఇడ్లీని సగానికి లేదా చిన్న ముక్కలుగా కట్ చేసి లంచ్ బాక్స్‌లో పెట్టొచ్చు. దీనికి కాంబినేషన్‌గా కొబ్బరి చట్నీ, టమాటా చట్నీ లేదా పిల్లలు ఇష్టపడే సాంబార్‌ను కూడా ఇవ్వొచ్చు. చూడటానికి అందంగా, తినడానికి రుచిగా ఉండే ఈ ఇడ్లీ.. పిల్లల లంచ్ బాక్స్‌ను ఖాళీ చేసేలా చేస్తుంది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి
ఆహారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Indian Railway: చెత్త అమ్మి ఆరు నెలల్లో రూ.323 కోట్లు సంపాదించిన ఇండియన్ రైల్వే..!
Recommended image2
Kova Sweet: పాలు కాచే పనిలేకుండా మిల్క్ పౌడర్‌తో ఈజీగా కోవాలు చేసేయండిలా
Recommended image3
Diamond Ring: అమ్మాయిల మనసు దోచే లైట్ వెయిట్ డైమండ్ రింగ్స్
Related Stories
Recommended image1
Mushroom Capital: మన దేశంలో 'మష్రూమ్ సిటీ ఆఫ్ ఇండియా'గా ఏ నగరాన్ని పిలుస్తారో తెలుసా?
Recommended image2
Moringa soup: మహిళలు ప్రతి రోజూ ఈ సూప్ కప్పు తాగితే చాలు...వెయ్యి ఏనుగుల బలం వస్తుంది.
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved