MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Moringa soup: మహిళలు ప్రతి రోజూ ఈ సూప్ కప్పు తాగితే చాలు...వెయ్యి ఏనుగుల బలం వస్తుంది.

Moringa soup: మహిళలు ప్రతి రోజూ ఈ సూప్ కప్పు తాగితే చాలు...వెయ్యి ఏనుగుల బలం వస్తుంది.

Moringa soup: మహిళల్లో ఎక్కువగా కనిపించే సమస్య అనీమియా..అంటే రక్తహీనత. శరీరంలో ఐరన్ తగ్గినప్పుడు అలసట, నీరసం, చర్మం పాలిపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాంటి వాళ్లకు బెస్ట్ రెమిడీ...ఈ సూప్. ప్రతి రోజూ కప్పు తాగితే చాలు వెయ్యి ఏనుగుల బలం వస్తుంది.

2 Min read
Author : Nandini Arava
Published : Oct 08 2026, 01:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ప్రతి రోజూ కప్పు తాగితే చాలు వెయ్యి ఏనుగుల బలం
Image Credit : gemini ai

ప్రతి రోజూ కప్పు తాగితే చాలు వెయ్యి ఏనుగుల బలం

మహిళలకు చాలా శక్తి కావాలి. ఎందుకంటే ఇంటి పనులు, ఉద్యోగంతో రోజంతా బిజీగా ఉంటారు. అందులోనూ నెల నెల వచ్చే పీరియడ్స్. దీనివల్ల చాలా రక్తం పోతుంది. పనుల హడావిడిలో ఉండి టైంకు తినకపోవడం, అందులోనూ హెల్తీ ఫుడ్ తీసుకోకపోవడం...వారికి ఎన్నో సమస్యల్ని తెచ్చి పెడుతుంది. ఒక్కోసారి రక్తహీనతకు గురవుతుంటారు. ఎంత డాక్టర్ సలహా తీసుకుని మందులు వాడుతున్నా సరే...లోలోపల క్యూర్ అవ్వాలంటే సరైన డైట్ పాటించాల్సిందే. మెడిసిన్ తో పాటు ఇది కూడా ఉండాలి. మహిళల్లో ఎక్కువగా కనిపించే ఆరోగ్య సమస్యల్లో ఎనిమియా ఒకటి. శరీరంలో ఐరన్ స్థాయిలు తగ్గినప్పుడు అలసట, నీరసం, బలహీనత, చర్మం పాలిపోయినట్లు కనిపించడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. అయితే చాలామంది వీటిని సాధారణ అలసటగా భావించి పెద్దగా పట్టించుకోరు. ఇలాంటి సమయంలో ఐరన్‌ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం కూడా ముఖ్యమే.

అనీమియాతో చాలాకాలంగా ఇబ్బంది పడుతున్నవారికి బాగా ఉపయోగపడేది మునగకాయ, పప్పులతో తయారు చేసే ఈ సూప్. మన ఇళ్లలో అందుబాటులో ఉండే పదార్థాలతోనే దీన్ని సులభంగా తయారు చేసుకోవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
సూప్ తయారీ విధానం
Image Credit : gemini ai

సూప్ తయారీ విధానం

ఈ సూప్ తయారు చేయడానికి ముందుగా మునగకాయ ముక్కలను శుభ్రంగా కడిగి తీసుకోవాలి. వీటితో పాటు మసూర్ దాల్, ఉల్లిపాయ, అల్లం, టమాటాలను నీటిలో వేసి మెత్తగా ఉడికించాలి. అన్నీ బాగా ఉడికిన తర్వాత మెత్తగా బ్లెండ్ చేసి సూప్‌లా చేసుకోవచ్చు. బ్లెండ్ చేయకుండా కొద్దిగా మాష్ చేసుకుని కూడా తీసుకోవచ్చు.

రుచికి తగ్గట్టుగా పసుపు, జీలకర్ర లేదా నల్ల మిరియాల పొడి వేసుకోవచ్చు. సూప్ మరీ చిక్కగా ఉంటే కొద్దిగా నీటిని కలుపుకోవచ్చు. ఈ సూప్‌ను రోజుకు సుమారు అర కప్పు తీసుకుంటే చాలు. మూడు నెలల పాటు దీనిని తీసుకున్న తర్వాత మార్పు కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

34
మహిళల్లో అనీమియా ఎందుకు వస్తుంది?
Image Credit : Getty

మహిళల్లో అనీమియా ఎందుకు వస్తుంది?

మహిళల్లో అనీమియా రావడానికి అనేక కారణాలు ఉంటాయి. అధికంగా నెలసరి కావడం, గర్భధారణ సమయంలో శరీరానికి ఐరన్ అవసరం పెరగడం, ఆహారంలో తగినంత ఐరన్ లేకపోవడం, శరీరం ఐరన్‌ను సరిగ్గా తీసుకోకపోవడం వంటి కారణాలు ఉండవచ్చు.

అనీమియా లక్షణాలు చాలా సందర్భాల్లో అంత స్పష్టంగా కనిపించకపోవచ్చు. రోజువారీ పనులు చేసేటప్పుడు త్వరగా అలసిపోవడం, ఎప్పుడూ నీరసంగా అనిపించడం, బలహీనత, పాలిపోయినట్లు కనిపించడం వంటి లక్షణాలను చాలామంది సాధారణ సమస్యలుగానే భావిస్తారు. దీంతో శరీరంలో ఐరన్‌ లోపం ఉన్న విషయం ఆలస్యంగా గుర్తించే అవకాశం ఉంటుంది. అందుకే మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలి. ఆహారంలో ఐరన్‌ ఉండే పదార్థాలను చేర్చుకోవడంతో పాటు శరీరానికి అవసరమైన ఇతర పోషకాలు కూడా అందేలా చూసుకోవాలి.

44
ఇది చికిత్స మాత్రం కాదు
Image Credit : Getty

ఇది చికిత్స మాత్రం కాదు

మునగకాయ, మసూర్ పప్పు వంటి పదార్థాలతో తయారు చేసే ఈ సూప్ ఐరన్‌ అధికంగా ఉండే ఆహారంలో భాగంగా ఉపయోగపడొచ్చు. అయితే ఇది అనీమియాకు ఇది చికిత్స మాత్రం కాదు. రక్తహీనత ఉన్నట్లు వైద్యులు నిర్ధారిస్తే వారి సూచన మేరకు చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం. అలాగే ఐరన్‌ టాబ్లెట్లు లేదా ఇతర మందులు సూచించినట్లయితే వాటిని ఆపేసి కేవలం ఈ సూప్‌పైనే ఆధారపడకూడదు.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి
మహిళలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Cooking Tips: ఇదొక్కటి రెండు చుక్కలు వేస్తే.. బెండకాయ జిగురు లేకుండా మంచిగా ఫ్రై అవుతుంది..!
Recommended image2
Chanakya Niti: చాణక్యుడి ప్రకారం కుటుంబంలో ఎవరి మాట వినాలి? ఎవరి మాట పట్టించుకోవద్దు?
Recommended image3
DMart : శని, ఆదివారాలు కాదు, ఈ 2 రోజులు డీమార్ట్ లో షాపింగ్ చేశారో.. 15-20% ఖర్చు సేవ్
Related Stories
Recommended image1
Parenting: మీ పిల్లలకు ఈ అలవాటు ఉందా?
Recommended image2
Mushroom Capital: మన దేశంలో 'మష్రూమ్ సిటీ ఆఫ్ ఇండియా'గా ఏ నగరాన్ని పిలుస్తారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved