MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Mushroom Capital: మన దేశంలో 'మష్రూమ్ సిటీ ఆఫ్ ఇండియా'గా ఏ నగరాన్ని పిలుస్తారో తెలుసా?

Mushroom Capital: మన దేశంలో 'మష్రూమ్ సిటీ ఆఫ్ ఇండియా'గా ఏ నగరాన్ని పిలుస్తారో తెలుసా?

Mushroom Capital: మష్రూమ్ జనరల్ గా మార్కెట్లో కొనుక్కుంటాం. అది ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియదు. అయితే మన దేశంలోని ఓ నగరం మష్రూమ్ సాగుకు ప్రత్యేక గుర్తింపు పొందింది. ‘మష్రూమ్ సిటీ’గా పేరు పొందిన ఆ సిటీ ఎక్కుడుందో తెలుసా?

2 Min read
Author : Nandini Arava
Published : Oct 08 2026, 10:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మష్రూమ్ సిటీ ఆఫ్ ఇండియా
Image Credit : gemini ai

మష్రూమ్ సిటీ ఆఫ్ ఇండియా

వెజిటేరియన్స్ అయినా, నాన్ వెజ్ టేరియన్స్ అయినా మష్రూమ్స్ ను ఇష్టంగా తింటుంటారు. మష్రూమ్స్ లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. సూప్‌లు, కర్రీలు, స్టిర్‌ఫ్రైస్‌ నుంచి స్నాక్స్‌ వరకు ఎన్నో రకాల వంటకాల్లో వీటిని ఉపయోగిస్తున్నారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో పుట్టగొడుగుల సాగు జరుగుతున్నప్పటికీ.. మష్రూమ్ సాగుతో దశాబ్దాలుగా ప్రత్యేక అనుబంధం ఉన్న ఓ హిల్‌టౌన్ ఉంది. అందుకే దీనిని ‘మష్రూమ్ సిటీ ఆఫ్ ఇండియా’ అని పిలుస్తారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మష్రూమ్ సిటీగా సోలన్..
Image Credit : Asianet News

మష్రూమ్ సిటీగా సోలన్..

హిమాచల్‌ప్రదేశ్‌లోని సోలన్ నగరాన్ని భారత ‘మష్రూమ్ సిటీ’గా పిలుస్తారు. మష్రూమ్ సాగు, పరిశోధనలో ఈ ప్రాంతం అందించిన సేవలను గుర్తిస్తూ 1997 సెప్టెంబర్ 10న ఈ గుర్తింపు లభించింది. అప్పటినుంచి సోలన్ పేరు మష్రూమ్ సాగుతో బలంగా ముడిపడిపోయింది.

అయితే ఈ ప్రాంతానికి మష్రూమ్‌లతో అనుబంధం అంతకంటే ముందే మొదలైంది. 1961లో హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం, ఐసీఏఆర్‌ కలిసి ఈ ప్రాంతంలో మష్రూమ్ సాగును ప్రారంభించాయి. సాగు అవకాశాలను పరిశీలిస్తూ ప్రయోగాలు చేపట్టడంతో క్రమంగా ఇక్కడ మష్రూమ్ సాగు విస్తరించింది.

35
రకరకాల మష్రూమ్‌ల సాగు..
Image Credit : foodsafety.osu.edu

రకరకాల మష్రూమ్‌ల సాగు..

భారత్‌లో ఎక్కువగా వినియోగించే మష్రూమ్‌లలో వైట్ బటన్ మష్రూమ్ ఒకటి. అయితే ప్రస్తుతం సోలన్ ప్రాంతంలో దీనితో పాటు మరికొన్ని రకాల పుట్టగొడుగులను కూడా సాగు చేస్తున్నారు. ఆయిస్టర్ మష్రూమ్, షిటాకే, మిల్కీ మష్రూమ్, ప్యాడీ స్ట్రా మష్రూమ్ వంటి రకాలు కూడా సాగులో ఉన్నాయి. ఒక్కో రకానికి ఒక్కో విధమైన వాతావరణం, ఉష్ణోగ్రత, తేమ, సాగు పద్ధతులు అవసరం.

మష్రూమ్‌లను వివిధ రకాల వంటకాల్లో ఉపయోగించుకోవడంతో పాటు.. వాటిలో ఉండే పోషక విలువల కారణంగా కూడా వీటికి డిమాండ్ పెరుగుతోంది. దీంతో దేశవ్యాప్తంగా మష్రూమ్ సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు.

45
దేశంలో కీలక పరిశోధనా కేంద్రం ఇక్కడే..
Image Credit : chat gpt

దేశంలో కీలక పరిశోధనా కేంద్రం ఇక్కడే..

సోలన్‌కు మష్రూమ్ సిటీ అనే పేరు రావడానికి మరో ప్రధాన కారణం అక్కడ ఉన్న ICAR-Directorate of Mushroom Research (DMR). చంబాఘాట్‌లో ఉన్న ఈ సంస్థను 1983లో నేషనల్ సెంటర్ ఫర్ మష్రూమ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్‌గా ప్రారంభించారు. తర్వాత ఇది డైరెక్టరేట్ ఆఫ్ మష్రూమ్ రీసెర్చ్‌గా అభివృద్ధి చెందింది. తినే, ఔషధ విలువలు ఉన్న మష్రూమ్‌లపై ఈ సంస్థ పరిశోధనలు చేస్తోంది. కొత్త సాగు పద్ధతులను అభివృద్ధి చేయడం, రైతులు-వ్యాపారులకు శిక్షణ ఇవ్వడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న మష్రూమ్ పరిశోధన కార్యక్రమాలను సమన్వయం చేయడంలోనూ ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తోంది.

55
ప్రతి ఏడాది మష్రూమ్ మేళా..
Image Credit : adobe stock

ప్రతి ఏడాది మష్రూమ్ మేళా..

సోలన్‌కు మష్రూమ్‌లతో ఉన్న అనుబంధాన్ని మరో ప్రత్యేక కార్యక్రమం కూడా చాటిచెబుతోంది. ప్రతి ఏడాది సెప్టెంబర్ 10న జాతీయ మష్రూమ్ మేళా నిర్వహిస్తారు. డైరెక్టరేట్ ఆఫ్ మష్రూమ్ రీసెర్చ్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రైతులు, మష్రూమ్ సాగుదారులు, పరిశోధకులు, పరిశ్రమ ప్రతినిధులు హాజరవుతారు.

మేళాలో మష్రూమ్ సాగుకు సంబంధించిన ప్రదర్శనలు, సాగు పద్ధతులపై అవగాహన కార్యక్రమాలు, నిపుణులతో చర్చలు ఉంటాయి. కొత్త సాంకేతికతలు, సాగులో వస్తున్న మార్పుల గురించి రైతులు తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది.

దేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రస్తుతం మష్రూమ్ సాగు జరుగుతున్నప్పటికీ.. భారత్‌లో మష్రూమ్ సాగు అభివృద్ధి ప్రయాణంలో సోలన్‌కు ప్రత్యేక స్థానం ఉంది. 1960లలో ప్రారంభమైన సాగు ప్రయోగాల నుంచి నేటి పరిశోధనలు, రైతులకు శిక్షణ కార్యక్రమాల వరకు.. ఈ హిల్‌టౌన్ భారత మష్రూమ్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి
భారత దేశం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
River : కృష్ణా నది 64 కి.మీ దూరముండే అరేబియాలో కాకుండా.. 1400 కి.మీ దూరమున్న బంగాళాఖాతంలో ఎందుకు కలుస్తుంది?
Recommended image2
అత్యంత అందమైన ఊరు.. కానీ ఏడాదిలో 4 నెలలు చిమ్మచీకటే
Recommended image3
Unique Village : ఇళ్ల పైకప్పులే రోడ్లుగా మారిన వింత గ్రామం... ఎక్కడుందో తెలుసా?
Related Stories
Recommended image1
Amla Capital: ఇండియాలో ఉసిరికాయ రాజధానిగా ఏ జిల్లాను పిలుస్తారో తెలుసా?
Recommended image2
Dosa Capital: మన దేశంలో స్పెషల్ గా దోశకు ఒక రాజధాని కూడా ఉందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved