MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Ragi Sangati: రాగి సంగటి రుచిగా, మెత్తగా రావాలంటే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే చాలు!

Ragi Sangati: రాగి సంగటి రుచిగా, మెత్తగా రావాలంటే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే చాలు!

Ragi Sangati: వేడి వేడి రాగి సంగటిలో నాటుకోడి పులుసు కలుపుకొని తింటే ఆ రుచే వేరు. అయితే ఇంట్లో సంగటి తయారుచేసేటప్పుడు కొన్నిసార్లు గట్టిగా మారడం, పిండి ఉండలు కట్టడం వంటివి మనం చూస్తుంటాం. మరి సంగటి మెత్తగా, రుచిగా రావాలంటే ఏం చేయాలో ఇక్కడ చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : Oct 28 2026, 01:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
రాగి సంగటి మెత్తగా రావడం కోసం చిట్కాలు
Image Credit : Gemini Ai

రాగి సంగటి మెత్తగా రావడం కోసం చిట్కాలు

రాగి సంగటిని చాలామంది ఇష్టంగా తింటారు. ఇది రుచిగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో రాగి సంగటిని నాటుకోడి పులుసు, మటన్ కూర, పప్పు లేదా సాంబార్‌తో కలిపి తినడానికి చాలామంది ఇష్టపడతారు. అయితే ఇంట్లో రాగి సంగటి తయారుచేసేటప్పుడు కొందరికి మెత్తగా రాకపోవడం, ఉండలు కట్టడం, మరీ గట్టిగా మారడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. అయితే కొన్ని సింపుల్ చిట్కాలు పాటిస్తే రాగి సంగటిని మెత్తగా, రుచిగా తయారుచేసుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
రాగి పిండి ఎంపిక
Image Credit : Getty

రాగి పిండి ఎంపిక

రాగి సంగటి రుచిగా, మెత్తగా రావాలంటే ముందుగా నాణ్యమైన రాగి పిండిని ఎంచుకోవాలి. తాజా రాగి పిండితో సంగటి తయారుచేయడం చాలా ఈజీ. అయితే పిండిలో తేమ ఉండకూడదు. ఎక్కువకాలం నిల్వ ఉంచిన పిండిని వాడకపోవడం మంచిది. వీలైతే రాగులను శుభ్రం చేసి మర పట్టించి పిండి తయారుచేసుకోవడం ఉత్తమం.

36
నీటి కొలత
Image Credit : Getty

నీటి కొలత

రాగి సంగటి తయారీలో నీటి కొలత చాలా ముఖ్యం. నీళ్లు తక్కువగా పోస్తే సంగటి గట్టిగా మారుతుంది. అదే నీళ్లు మరీ ఎక్కువైతే సంగటి లూజుగా తయారయ్యే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఒక కప్పు రాగి పిండికి సుమారు 3-4 కప్పుల నీటిని ఉపయోగించవచ్చు. అయితే పిండి రకం, దాని మెత్తదనం బట్టి నీటి కొలత కొద్దిగా మారవచ్చు. అలాగే సంగటి మెత్తగా రావాలంటే పిండిని ఒకేసారి ఎక్కువగా పోయకుండా క్రమంగా కలపడం ముఖ్యం.

46
ఉండలు రాకుండా..
Image Credit : Gemini Ai

ఉండలు రాకుండా..

సంగటిలో ఉండలు రాకుండా ఉండాలంటే నీటిని మరిగించే ముందు లేదా నీరు వేడెక్కుతున్నప్పుడు కొద్దిగా రాగి పిండిని తీసుకుని చల్లటి నీటిలో ఉండలు లేకుండా కలిపి పలుచటి మిశ్రమంలా తయారుచేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని వేడి నీటిలో పోసి బాగా కలపాలి. లేకపోతే నీరు మరిగిన తర్వాత కొద్ది కొద్దిగా రాగి పిండిని కలపొచ్చు. ఇలా చేయడం వల్ల పిండి ఉండలుగా మారకుండా ఉంటుంది.

56
నీళ్లు బాగా మరిగిన తర్వాతే..
Image Credit : Getty

నీళ్లు బాగా మరిగిన తర్వాతే..

రాగి సంగటి తయారుచేసేటప్పుడు నీళ్లు బాగా మరిగే వరకు వెయిట్ చేయాలి. నీరు మరిగిన తర్వాత మంటను తగ్గించి రాగి పిండిని కొద్ది కొద్దిగా వేయాలి. పిండి వేసినప్పటి నుంచి అది చిక్కబడే వరకు చెక్క గరిటెతో బాగా కలుపుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల పిండి నీటితో సమానంగా కలిసి సంగటి మెత్తగా తయారవుతుంది. సంగటి ఉడికిన వెంటనే దించేయకుండా, మూత పెట్టి 2-5 నిమిషాలు ఉంచితే టేస్ట్ ఇంకా బాగుంటుంది.

66
వేడివేడిగా తింటే..
Image Credit : Gemini Ai

వేడివేడిగా తింటే..

రాగి సంగటి తయారైన వెంటనే వేడివేడిగా వడ్డిస్తే దాని మెత్తదనం, రుచి బాగుంటాయి. దీన్ని పప్పు, సాంబార్, నాటుకోడి పులుసు లేదా మీకు నచ్చిన కూరతో కలిపి తినవచ్చు. అలాగే సంగటిని తయారుచేసిన తర్వాత ఎక్కువసేపు మూత తెరిచి ఉంచితే చల్లబడి గట్టిపడుతుంది. కాబట్టి మూత పెట్టి ఉంచడం మంచిది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆహారం
చిట్కాలు మరియు ఉపాయాలు
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 
3rd TEST • SA vs AUS
Live
SASA
329
AUSAUS
(17.0 ov)58/0
Day 2 - Session 1
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Recommended Stories
Recommended image1
Mangalsutra: చీరల మీదకు మీ అందాన్ని పెంచే లాంగ్ మంగళసూత్రాలు..చూసేయండి
Recommended image2
Teeth Pain Remedies: పంటి నొప్పిని తగ్గించే బెస్ట్ చిట్కాలు ఇవిగో!
Recommended image3
Garlic: వెల్లుల్లి తొక్క తీయడం కష్టంగా ఉందా? 20 సెకన్లలో తొక్క తీసే టెక్నిక్ ఇది..!
Related Stories
Recommended image1
Leftover Chapati: మిగిలిపోయిన చపాతీలతో అదిరిపోయే రెసిపీలు.. ట్రై చేయండి!
Recommended image2
Morning Bath Vs Night Bath: చర్మం బాగుండాలంటే స్నానం ఉదయం చేయాలా? రాత్రి చేయాలా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved