MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Kova Sweet: పాలు కాచే పనిలేకుండా మిల్క్ పౌడర్‌తో ఈజీగా కోవాలు చేసేయండిలా

Kova Sweet: పాలు కాచే పనిలేకుండా మిల్క్ పౌడర్‌తో ఈజీగా కోవాలు చేసేయండిలా

Kova Sweet: కోవా వండాలంటే గంటల తరబడి పాలు కాయాలి. అంత ఓపిక అందరికీ ఉండదు. కాబట్టి మిల్క్ పౌడర్, పాలు, చక్కెర, నెయ్యితో అప్పటికప్పుడు.. ఇంట్లోనే చాలా సులువుగా కోవాలు చేయడం ఎలాగో తెలుసుకోండి.

1 Min read
Author : Haritha Chappa
Published : Oct 08 2026, 06:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
మిల్క్ పౌడర్ తో కోవా రెసిపీ
Image Credit : Asianet News

మిల్క్ పౌడర్ తో కోవా రెసిపీ

కోవా పేరు చెబితేనే ఎంతో మందికి నోరూరిపోతుంది. అయితే దీన్ని తయారుచేయాలంటే పాలను గంటల తరబడి కాచి చేయాలి. కానీ సింపుల్ అప్పటికప్పుడు కూడా కోవా తయారుచేయవచ్చు. మిల్క్ పౌడర్ వాడి దీన్ని సులువుగా చేసేయచ్చు. దీని తయారీకి మిల్క్ పౌడర్, పాలు, చక్కెర, నెయ్యి లాంటి బేసిక్ ఐటమ్స్ ఉంటే చాలు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఇలా రెసిపీ చేయండి
Image Credit : Asianet News

ఇలా రెసిపీ చేయండి

ఈ రెసిపీలో మిల్క్ పౌడర్ చాలా ముఖ్యమైనది. పాలను గంటల తరబడి కాచే బదులు, మిల్క్ పౌడర్ వాడితే పేడాకు కావాల్సిన చిక్కదనం వెంటనే వస్తుంది. ఇది మిశ్రమాన్ని సాఫ్ట్‌గా ఉంచుతుంది. చక్కెర తీపిని ఇస్తే, కొద్దిగా నెయ్యి మంచి టేస్ట్‌తో పాటు మృదుత్వాన్ని ఇస్తుంది. మిల్క్ పౌడర్ పొడిగా ఉంటుంది కాబట్టి, పాలను ఒకేసారి పోయకుండా కొద్దికొద్దిగా పోస్తూ కలుపుకోవడం చాలా ముఖ్యం. అప్పుడే మిశ్రమం కరెక్ట్ పదునులో వస్తుంది.

ముందుగా ఒక గిన్నెలో మిల్క్ పౌడర్ తీసుకోండి. అందులో తగినన్ని పాలు, చక్కెర వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా నెయ్యి వేసి, పొయ్యి మీద తక్కువ మంటపై కంటిన్యూగా తిప్పుతూ ఉడికించాలి.

మొదట్లో మిశ్రమం పల్చగా ఉంటుంది. ఉడికేకొద్దీ చిక్కబడుతుంది. గిన్నె అంచులకు అంటుకోకుండా, ముద్దలా దగ్గరపడే టైమ్ చాలా ముఖ్యం. ఆ వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి.

మరీ గట్టిపడేదాకా ఉంచకూడదు. చల్లారాక మిశ్రమం మరింత గట్టిపడుతుంది కాబట్టి, కొంచెం సాఫ్ట్‌గా ఉన్నప్పుడే దించేయడం మంచిది.

33
చేతులకు నెయ్యి రాసుకుని
Image Credit : Asianet News

చేతులకు నెయ్యి రాసుకుని

మిశ్రమం చేత్తో పట్టుకునేంత వేడికి రాగానే, చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకోండి. ఆ తర్వాత కావాల్సినంత మిశ్రమాన్ని తీసుకుని ఉండలా చుట్టి, తేలికగా నొక్కి పేడా షేప్‌లోకి మార్చుకోవాలి.

మీకు నచ్చితే మధ్యలో చిన్న గుంటలా చేసి, అందులో పిస్తా, బాదం లేదా జీడిపప్పు పెట్టి డెకరేట్ చేసుకోవచ్చు. పేడాను మరీ పల్చగా నొక్కకండి. కొంచెం మందంగా ఉంటేనే సాఫ్ట్‌గా, తినడానికి బాగుంటుంది.

ముఖ్యంగా, మిశ్రమం పూర్తిగా చల్లారకముందే షేప్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారితే గట్టిపడిపోయి షేప్ చేయడం కష్టమవుతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Diamond Ring: అమ్మాయిల మనసు దోచే లైట్ వెయిట్ డైమండ్ రింగ్స్
Recommended image2
ఈ పండు గుజ్జుతో ఫేస్ ప్యాక్ రోజూ వేశారంటే వారంలో ముఖానికి మెరుపు ఖాయం
Recommended image3
Sesame Seeds: ప్రతిరోజూ గుప్పెడు నువ్వులు ఎందుకు తినాలి?
Related Stories
Recommended image1
Free Train: మనదేశంలో ఎవరైనా ఉచితంగా ప్రయాణించగల రైలు ఇదొక్కటే.. ఈ ట్రైన్ ఎక్కడుందో తెలుసా?
Recommended image2
Godavari: గోదావరి నది సముద్రంలో కలిసే చోట కనిపించే అద్భుతం.. ‘అన్నా చెల్లెళ్ల గట్టు’
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved