MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Free Train: మనదేశంలో ఎవరైనా ఉచితంగా ప్రయాణించగల రైలు ఇదొక్కటే.. ఈ ట్రైన్ ఎక్కడుందో తెలుసా?

Free Train: మనదేశంలో ఎవరైనా ఉచితంగా ప్రయాణించగల రైలు ఇదొక్కటే.. ఈ ట్రైన్ ఎక్కడుందో తెలుసా?

Free Train: మనదేశంలో టిక్కెట్ లేకుండా ఉచితంగా ప్రయాణం చేసే రైలు ఒకే ఒక్కటి ఉంది. అందులో ఎవరైనా ఎన్నిసార్లయినా ప్రయాణం చేయవచ్చు. ఈ ట్రైన్ ఎక్కడుంది? ఈ రైలు ప్రయాణం ఎందుకు ఉచితం వంటి వివరాలు తెలుసుకోండి.

2 Min read
Author : Haritha Chappa
Published : Oct 08 2026, 11:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఈ రైలు ప్రయాణం పూర్తిగా ఉచితం
Image Credit : Gemini AI

ఈ రైలు ప్రయాణం పూర్తిగా ఉచితం

ఎక్కడైనా సరే రైలులో ప్రయాణించాలంటే టికెట్ తప్పనిసరిగా కొనాల్సిందే. టికెట్ లేకుండా రైలు ఎక్కితే జరిమానా కట్టాల్సి వస్తుంది. కానీ మన దేశంలో ఓ రైలు మాత్రం చాలా ప్రత్యేకం. ఈ రైలులో ప్రయాణించేందుకు టికెట్ కొనాల్సిన అవసరం లేదు. అదే భాక్రా-నంగల్ రైలు. పంజాబ్‌లోని నంగల్ నుంచి హిమాచల్ ప్రదేశ్‌లోని భాక్రా వరకు ఈ రైలు నడుస్తుంది. దాదాపు 13 కిలోమీటర్ల దూరాన్ని 40 నిమిషాల్లో పూర్తి చేస్తుంది. కొండలు, పచ్చని చెట్లు, సట్లెజ్ నది అందాల మధ్య సాగే ఈ ప్రయాణం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
అందమైన ప్రయాణం
Image Credit : Pixabay

అందమైన ప్రయాణం

భాక్రా-నంగల్ డ్యామ్ నిర్మాణ సమయంలో ఈ రైలును మొదలుపెట్టారు. 1948లో రైలు సేవలు ప్రారంభమైంది. అప్పట్లో డ్యామ్ నిర్మాణ పనులకు వచ్చే కార్మికులు, అధికారులు ఈ రైలును ఎక్కువగా ఉపయోగించేవారు. నిర్మాణ సామగ్రిని తరలించేందుకు కూడా ఇది ఎంతో ఉపయోగపడింది. తర్వాత స్థానిక ప్రజలు, విద్యార్థులు ఈ రైలులో ప్రయాణించడం మొదలుపెట్టారు. పర్యాటకులకు కూడా ఈ రైలు ఆకర్షణగా మారింది. పాతకాలం నాటి బోగీలు, కొండల మధ్య రైలు ప్రయాణం, దారిలో కనిపించే ప్రకృతి దృశ్యాలు ప్రయాణికులను ఆకట్టుకుంటాయి. మొదట ఈ రైలును ఆవిరి ఇంజిన్‌తో నడిపేవారు. ప్రస్తుతం డీజిల్ ఇంజిన్‌తో నడుస్తోంది.

33
ఇప్పటికీ ఈ రైలు ప్రయాణం ఫ్రీ
Image Credit : Pixabay

ఇప్పటికీ ఈ రైలు ప్రయాణం ఫ్రీ

ఈ రైలు కేవలం ప్రయాణ సాధనం మాత్రమే కాదు.. ఓ చారిత్రక గుర్తుగా కూడా నిలిచింది. నిర్వహణ ఖర్చులు పెరగడంతో 2011లో రైలు సేవలను నిలిపివేయాలనే ఆలోచన వచ్చింది. అయితే స్థానిక ప్రజలకు ఉన్న ఉపయోగం, రైలుకు ఉన్న చారిత్రక ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని సేవలను కొనసాగించారు. ఇప్పటికీ ఈ రైలులో ప్రయాణించేవారి నుంచి టికెట్ వసూలు చేయడం లేదు. దీంతో టికెట్ లేకుండా ప్రయాణించే రైలుగా ఇది ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. డబ్బు ఖర్చు లేకుండా రైలు ప్రయాణం చేయడంతో పాటు, కొండలు, నది మధ్య అద్భుతమైన దృశ్యాలను ఆస్వాదించే అవకాశం కూడా ఇక్కడ దొరుకుతుంది. అందుకే ఈ రైలు గురించి తెలిసినవారు ఒక్కసారైనా ఇందులో ప్రయాణించాలని కోరుకుంటారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
భారత దేశం
ప్రయాణం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mushroom Capital: మన దేశంలో 'మష్రూమ్ సిటీ ఆఫ్ ఇండియా'గా ఏ నగరాన్ని పిలుస్తారో తెలుసా?
Recommended image2
River : కృష్ణా నది 64 కి.మీ దూరముండే అరేబియాలో కాకుండా.. 1400 కి.మీ దూరమున్న బంగాళాఖాతంలో ఎందుకు కలుస్తుంది?
Recommended image3
అత్యంత అందమైన ఊరు.. కానీ ఏడాదిలో 4 నెలలు చిమ్మచీకటే
Related Stories
Recommended image1
Mini Africa: హైదరాబాద్‌లో ‘మినీ ఆఫ్రికా’.. ఆ వీధిలో అడుగుపెడితే అంతా ఆఫ్రికన్లే కనిపిస్తారు
Recommended image2
అత్యంత అందమైన ఊరు.. కానీ ఏడాదిలో 4 నెలలు చిమ్మచీకటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved