MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Sweet Corn: ఇంట్లోనే కుండీలో స్వీట్ కార్న్ మొక్కలు ఇలా పెంచేయండి.. మొక్కజొన్న కండెలు పండుతాయి

Sweet Corn: ఇంట్లోనే కుండీలో స్వీట్ కార్న్ మొక్కలు ఇలా పెంచేయండి.. మొక్కజొన్న కండెలు పండుతాయి

Sweet Corn: స్వీట్ కార్న్ అంటే ఎవరికి మాత్రం ఇష్టముండదు. వర్షాకాలంలో వేడివేడి మొక్కజొన్న కండెలు తింటే ఆ రుచే వేరు. మొక్కజొన్నలను మీ ఇంటి బాల్కనీ లేదా టెర్రస్‌పై కుండీల్లోనే ఈజీగా పెంచేయచ్చు.

1 Min read
Author : Haritha Chappa
Published : Jul 21 2026, 11:07 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఇంట్లోనే మొక్కజొన్న పంట
Image Credit : Facebook/Reddit/Instagram

ఇంట్లోనే మొక్కజొన్న పంట

స్వీట్ కార్న్ ఉడకబెట్టుకుని తిన్నా, కాల్చుకుని తిన్నా రుచిగానే ఉంటుంది. మొక్కజొన్న పండించడానికి పెద్ద పొలం అవసరం లేదు. మీ బాల్కనీ లేదా టెర్రస్‌పై కుండీల్లోనే వీటిని పండించవచ్చు. మొక్కజొన్న పెంచడానికి ముందుగా సరైన కుండీ ఎంపిక చేసుకోవాలి. మొక్కజొన్న మొక్క వేర్లు లోతుగా వెళ్తాయి. కాబట్టి, కనీసం 16 నుంచి 18 అంగుళాల లోతు, అంతే వెడల్పు ఉన్న కుండీ తీసుకోవాలి లేదా పెద్ద సైజు 'గ్రో బ్యాగ్' ఎంచుకున్నా మంచిదే. మొక్కజొన్నలో ఫలదీకరణ బాగా జరగాలంటే, కనీసం 4 నుంచి 6 మొక్కలను ఒకేచోట పెంచడం మంచిది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఇలా మట్టి కలపండి
Image Credit : Facebook/Reddit/Instagram

ఇలా మట్టి కలపండి

మొక్కజొన్న పెరగాలంటే మంచి మట్టి అవసరం.  పోషకాలు నిండిన మట్టిని ముందుగానే తయారుచేసుకోవాలి. మట్టిలో సమాన భాగాలుగా పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్ట్ (వానపాముల ఎరువు) కలపాలి.  కుండీలో నీరు నిలిచిపోకుండా అడుగున రంధ్రం ఉండేలా చూసుకోండి. మొక్కజొన్న విత్తనాలను మట్టిలో 1 నుంచి 2 అంగుళాల లోతులో నాటాలి. రెండు విత్తనాల మధ్య కనీసం 6 అంగుళాల దూరం ఉండేలా చూసుకోవాలి. విత్తనాలు నాటిన వెంటనే తేలికగా నీళ్లు చల్లాలి.

Related Articles

Related image1
Water Tank Cleaning: వాటర్ ట్యాంక్‌లో దిగకుండానే నిమిషాల్లో సింపుల్ టిప్స్ తో క్లీన్ చేసేయండి
Related image2
Mobile Tower: సెల్ టవర్‌కు దగ్గరలో నివసిస్తే ప్రమాదమా? ఎలాంటి నష్టాలు కలుగుతాయి?
33
ఎండ ముఖ్యం
Image Credit : Facebook/Reddit/Instagram

ఎండ ముఖ్యం

మొక్కజొన్న మొక్కకు రోజులో కనీసం 6 నుంచి 8 గంటల పాటు నేరుగా ఎండతగలాలి. కాబట్ట ఎండ తగిలే చోట కుండీని పెట్టాలి. మట్టిలో తేమ ఉండేలా చూసుకోవాలి. కానీ నీరు నిలవకూడదు. నీరు ఎక్కువైతే వేర్లు కుళ్లిపోవచ్చు. మొక్క కాస్త పెరిగాక ప్రతి 20 నుంచి 30 రోజులకు ఒకసారి సేంద్రియ ఎరువు వేయాలి. మొక్క చుట్టూ పెరిగే కలుపు మొక్కలను తీసేయాలి. మొక్కజొన్నకు నత్రజని (Nitrogen) అవసరం ఎక్కువ కాబట్టి, ద్రవరూప ఎరువులు వాడితే మొక్క బలంగా పెరుగుతుంది. విత్తనాలు నాటిన 2 నుంచి 3 నెలల్లో మొక్కజొన్న కండెలు తయారవుతాయి. కండె పైభాగంలో ఉండే పట్టులాంటి పీచు గోధుమ రంగులోకి మారినప్పుడు దాని కోసుకోవచ్చు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
తోటపని
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Saree Designs: పండగలకు పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యే చీరల డిజైన్లు
Recommended image2
Asafoetida: రోజూ చిటికెడు ఇంగువ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?
Recommended image3
Birds: ఈ గ్రామంలో పక్షులన్నీ ఒకేసారి ఆత్మహత్య చేసుకుంటాయి.. అది కూడా సెప్టెంబర్ నెలలోనే.. ఎందుకో తెలుసా?
Related Stories
Recommended image1
Water Tank Cleaning: వాటర్ ట్యాంక్‌లో దిగకుండానే నిమిషాల్లో సింపుల్ టిప్స్ తో క్లీన్ చేసేయండి
Recommended image2
Mobile Tower: సెల్ టవర్‌కు దగ్గరలో నివసిస్తే ప్రమాదమా? ఎలాంటి నష్టాలు కలుగుతాయి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved