MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Water Tank Cleaning: వాటర్ ట్యాంక్‌లో దిగకుండానే నిమిషాల్లో సింపుల్ టిప్స్ తో క్లీన్ చేసేయండి

Water Tank Cleaning: వాటర్ ట్యాంక్‌లో దిగకుండానే నిమిషాల్లో సింపుల్ టిప్స్ తో క్లీన్ చేసేయండి

Water Tank Cleaning: వాటర్ ట్యాంక్ ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. కానీ దాన్ని శుభ్రం చేయడం అంత సులువు కాదు. ట్యాంక్‌లోకి దిగకుండానే దాన్ని నిమిషాల్లోనే క్లీన్ చేయడం ఎలాగో ఇక్కడ  మేము సింపుల్ టిప్స్ ఇచ్చాము.

2 Min read
Author : Haritha Chappa
Published : Jul 20 2026, 05:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
వాటర్ ట్యాంక్ క్లీనింగ్ ఎలా?
Image Credit : AI

వాటర్ ట్యాంక్ క్లీనింగ్ ఎలా?

ప్రతి ఇంటిపైన ఒక వాటర్ ట్యాంక్‌ ఉంటుంది. దీన్ని ప్రతి రెండు నుంచి మూడు నెలలకు ఒకసారి శుభ్రం చేయాల్సిన అవసరం ఉంది.  కానీ ఆ పని చేయడానికి చాలా సమయం పడుతుందని ఎంతో మంది భయపడుతూ ఉంటారు. ట్యాంక్‌లోకి దిగి క్లీన్ చేయాలంటే ఎంతో మందికి భయం. జారిపడే ప్రమాదం అధికంగా ఉంటుంది.  మురికి వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి మార్కెట్లో దొరికే కొన్ని వస్తువులతో వాటర్ ట్యాంక్ సులువుగా క్లీన్ చేయవచ్చు. 

ఆన్ లైన్ స్టోర్లలో  ‘వాటర్ ట్యాంక్ క్లీనర్ విత్ టెలిస్కోపిక్ అల్యూమినియం పోల్ & హోస్’, ‘సబ్‌మెర్సిబుల్ వాటర్ పంప్’ వంటివి దొరుకుతాయి. వీటి సహాయంతో మీరు ట్యాంక్‌లోకి దిగకుండానే  శుభ్రం చేయవచ్చు. నిలిచిపోయిన నీటిని బయటకు పంపొచ్చు. ఈ పరికరాలు ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, చిన్న దుకాణాలపై ఉన్న వాటర్ ట్యాంకులు క్లీన్ చేయడానికి ఉపయోగపడతాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
టెలిస్కోపిక్ వాటర్ ట్యాంక్ క్లీనర్‌
Image Credit : AI

టెలిస్కోపిక్ వాటర్ ట్యాంక్ క్లీనర్‌

ఇది టెలిస్కోపిక్ వాటర్ ట్యాంక్ క్లీనర్‌. దీనితో సులువుగా వాటర్ ట్యాంక్ క్లీన్ చేయవచ్చు. దీనిలో పొడవును మార్చుకోగల (Adjustable) అల్యూమినియం రాడ్, ఒక హోస్ పైప్ ఉంటాయి. దీని సహాయంతో ట్యాంక్ మూలలన్నింటినీ సులభంగా చేరుకోవచ్చు. బ్రష్, నీటి పీడనం ద్వారా గోడలకు పట్టిన నాచు, మట్టి, ఇతర మురికిని శుభ్రం చేయవచ్చు. దీని కోసం మీరు ట్యాంక్‌లోకి దిగాల్సిన అవసరమే లేదు. పైనుంచే దీన్ని ఆపరేట్ చేయవచ్చు.

సబ్‌మెర్సిబుల్ వాటర్ పంప్ (Submersible Water Pump)

ట్యాంకు క్లీన్ చేసేందుకు ఇది మరొక పరికరం.  ట్యాంక్‌ను శుభ్రం చేసేటప్పుడు ముందుగా మురికి నీటిని బయటకు పంపాలి. దీనికి సబ్‌మెర్సిబుల్ వాటర్ పంప్ బాగా ఉపయోగపడుతుంది. ఈ పంప్, ట్యాంక్‌లో నిలిచిపోయిన నీటిని వేగంగా బయటకు తోడేస్తుంది.  చిన్న, పెద్ద ట్యాంకులు రెండింటికీ దీన్ని ఉపయోగించవచ్చు.

33
ఈ జాగ్రత్తలు తీసుకోండి
Image Credit : Getty

ఈ జాగ్రత్తలు తీసుకోండి

వాటర్ ట్యాంక్ క్లీనర్:  ఈ పరికరాన్ని కొనేటప్పుడు దాని రాడ్ పొడవు, హోస్ పైప్ నాణ్యత, బ్రష్ గట్టిదనాన్ని తప్పకుండా చెక్ చేయాలి.

సబ్‌మెర్సిబుల్ పంప్: దీన్ని కొనేటప్పుడు దాని సామర్థ్యం, నీటిని బయటకు పంపే వేగం, విద్యుత్ వినియోగాన్ని గమనించాలి.

భద్రతా సూచనలు: సబ్‌మెర్సిబుల్ పంప్ కరెంట్‌తో పనిచేస్తుంది కాబట్టి, నీటిలో వాడేటప్పుడు ఎలక్ట్రిక్ లీకేజీ లేకుండా చూసుకోవాలి. మంచి నాణ్యమైన బ్రాండెడ్ వైర్లు, సేఫ్టీ స్విచ్‌లు వాడటం చాలా మంచిది.

ట్యాంక్ శుభ్రం చేశాక, క్లీనర్ బ్రష్, పంప్‌ను మంచి నీటితో కడిగి, ఆరబెట్టి భద్రపరచాలి. ఇది పరికరాల జీవితకాలాన్ని పెంచుతుంది. మార్కెట్‌లో ఇవి రకరకాల ధరల్లో అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్ లేదా స్టోర్లలో కొనే ముందు, ఉత్పత్తికి ఉన్న వారంటీ, కస్టమర్ రివ్యూలను పోల్చి చూసి కొనడం మంచిది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇదెక్కడి వింత ఆచారం! పెళ్లి తర్వాత వధూవరులు టాయిలెట్‌కు వెళ్లకూడదా!!
Recommended image2
Cloves: దిండు కింద లవంగాలు పెట్టుకొని పడుకుంటే ఏమౌతుంది?
Recommended image3
Apple: కట్ చేసిన యాపిల్ రంగు మారకుండా ఉండాలంటే ఈ చిన్న పని చేస్తే చాలు!
Related Stories
Recommended image1
Washing Clothes: వారంలో ఈ ఒక్కరోజు మాత్రం దుస్తులు ఉతకకూడదు.. డబ్బు లాస్ అవుతారు
Recommended image2
Maredumilli: లోయలు, జలపాతాలతో నిండిన మారేడుమిల్లి.. ఆ హిల్ స్టేషన్‌కు ఎలా వెళ్లాలో తెలుసుకోండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved