MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Life
  • Kitchen Hacks: ప్రెషర్ కుక్కర్ విజిల్ సరిగ్గా పనిచేయట్లేదా? పైసా ఖర్చు లేకుండా ఇలా సరిచేయండి

Kitchen Hacks: ప్రెషర్ కుక్కర్ విజిల్ సరిగ్గా పనిచేయట్లేదా? పైసా ఖర్చు లేకుండా ఇలా సరిచేయండి

వంటింట్లో ఎక్కువగా ఉపయోగించే వస్తువుల్లో ప్రెషర్ కుక్కర్ ఒకటి. దీంట్లో వంట తొందరగా అవుతుంది కాబట్టి.. చాలామంది దీన్ని వాడటానికి ఇష్టపడతారు. అయితే కుక్కర్ విజిల్ సరిగ్గా రాకపోతే వంట పాడవుతుంది. ఈ సమస్యకు పైసా ఖర్చు లేకుండా చెక్ ఎలా పెట్టాలో చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : Jan 27 2026, 03:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Kitchen Hacks
Image Credit : Pixabay

Kitchen Hacks

ప్రెషర్ కుక్కర్ లో వంట ఎంత ఫాస్ట్ గా అవుతుందో మనకు తెలుసు. అయితే అది సరిగ్గా పనిచేయకపోతే మాత్రం అంతకంటే ఎక్కువే లేట్ అవుతుంది. పైగా వంట కూడా పాడవుతుంది. ప్రెషర్ కుక్కర్ లో ఎక్కువగా వచ్చే సమస్య ఏంటంటే కుక్కర్ విజిల్ సరిగ్గా పనిచేయకపోవడం. అంటే కొన్నిసార్లు విజిల్ రావడం ఆలస్యం అవుతుంది, ఇంకొన్ని సార్లు అసలే రాదు. నిజానికి ఈ సమస్యకు కారణం చాలా చిన్నది. పైసా ఖర్చు లేకుండా ఈ సమస్యకు ఈజీగా చెక్ పెట్టవచ్చు. ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
విజిల్ లోపలే సమస్య..
Image Credit : Getty

విజిల్ లోపలే సమస్య..

ప్రెషర్ కుక్కర్ విజిల్ పని చేయాలంటే లోపల ప్రెషర్ సరిగ్గా ఏర్పడాలి. ఆ ప్రెషర్ బయటకు నియంత్రితంగా వెళ్లే మార్గమే విజిల్. కాబట్టి విజిల్ పనిచేయకపోతే కుక్కర్ పాడైంది అనుకోవాల్సిన అవసరం లేదు. చాలా సందర్భాల్లో సమస్య విజిల్ లోపలే ఉంటుంది. రోజూ వాడటం వల్ల చిన్న చిన్న ఆహార కణాలు విజిల్ లోపల అంటుకుపోతాయి. దాంతో ఆవిరి బయటకు వెళ్లే మార్గం బ్లాక్ అవుతుంది. దీన్ని సరిచేయడానికి విజిల్‌ను తీసి, వేడి నీటిలో కొద్దిసేపు నానబెట్టి, సూది లేదా టూత్‌పిక్ సహాయంతో లోపలి రంధ్రాన్ని శుభ్రం చేయాలి. చాలామందికి ఈ చిన్న పని చేసిన వెంటనే విజిల్ సరిగ్గా పనిచేస్తుంది.

Related Articles

Related image1
నారింజ తొక్కలు ఎన్ని రకాలుగా ఉపయోగపడతాయో తెలుసా?
Related image2
కంటిచూపు బాగుండాలంటే కచ్చితంగా తినాల్సినవి ఏంటో తెలుసా?
37
ఆవిరి వెళ్లే పైపు క్లీన్ చేయడం
Image Credit : Getty

ఆవిరి వెళ్లే పైపు క్లీన్ చేయడం

మరొక ముఖ్యమైన కారణం.. కుక్కర్ మూతలో ఉన్న ఆవిరి వెళ్లే పైపు బ్లాక్ కావడం. ఇది బయటకు కనిపించదు కాబట్టి చాలామంది గమనించరు. మూత తీసి, ఆ పైపును ఒక చిన్న వైర్ లేదా సేఫ్టీ పిన్‌తో మెల్లగా శుభ్రం చేయాలి. ఇలా చేస్తే లోపల ఉన్న మలినాలు బయటకు వస్తాయి, ప్రెషర్ సరిగ్గా విడుదల అవుతుంది.

47
రబ్బరు రింగ్
Image Credit : Getty

రబ్బరు రింగ్

విజిల్ సమస్యకు మరో ప్రధాన కారణం కుక్కర్ మూత చుట్టూ ఉండే రబ్బరు రింగ్(గాస్కెట్). అది గట్టిగా అయిపోయినా, సరిగ్గా అమరకపోయినా లోపల ప్రెషర్ నిలవదు. అప్పుడు విజిల్ రావడం ఆలస్యం అవుతుంది. లేదా అసలే రాదు. కాబట్టి ఆ గాస్కెట్ ని తీసి గోరువెచ్చని నీటిలో కొద్దిసేపు నానబెట్టాలి. ఆ తర్వాత సరిగ్గా అమర్చితే సరిపోతుంది.

57
సరిపడా నీరు లేకపోయినా..
Image Credit : Pixabay

సరిపడా నీరు లేకపోయినా..

కుక్కర్‌లో నీరు తక్కువగా ఉన్నా ఆవిరి సరిగ్గా ఏర్పడదు. దాంతో విజిల్ పనిచేయదు. అలాగే ఎక్కువగా నింపినా ఇదే సమస్య వస్తుంది. కుక్కర్‌లో ఎప్పుడూ సూచించిన స్థాయి వరకే నీళ్లు, పదార్థాలు వేయాలి. ఇది కేవలం విజిల్ కోసమే కాదు, భద్రత కోసం కూడా చాలా అవసరం.

67
మీడియం ఫ్లేమ్ పై..
Image Credit : Pixabay

మీడియం ఫ్లేమ్ పై..

గ్యాస్ మంట కూడా విజిల్‌పై ప్రభావం చూపుతుంది. లో ఫ్లేమ్ పై కుక్కర్ పెడితే ప్రెషర్ ఏర్పడటానికి ఎక్కువ సమయం పడుతుంది. అలాగే హై ఫ్లేమ్ పై పెడితే లోపల ఆవిరి అనవసరంగా ఎక్కువగా ఏర్పడుతుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్ పై పెట్టాలి. విజిల్ వచ్చిన తర్వాత మంట తగ్గించడం ఉత్తమం.

77
మూత సరిగ్గా లాక్ కాకపోయినా..
Image Credit : stockPhoto

మూత సరిగ్గా లాక్ కాకపోయినా..

కుక్కర్ మూత సరిగ్గా లాక్ కాకపోయినా కూడా విజిల్ పనిచేయదు. మూత పెట్టేటప్పుడు క్లిక్ సౌండ్ వచ్చేలా సరిగ్గా అమర్చామా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. కుక్కర్ ని కాస్త శ్రద్ధగా శుభ్రం చేయడం, సరైన విధంగా వాడటం నేర్చుకుంటే, పైసా ఖర్చు లేకుండా సమస్యను పరిష్కరించవచ్చు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జీవనశైలి
చిట్కాలు మరియు ఉపాయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Jhumka: చీరలు, లెహంగాల మీదకు అదిరిపోయే జుంకా డిజైన్లు
Recommended image2
Black Beads: నల్లపూసలకు మ్యాచింగ్ బ్రేస్లేట్ డిజైన్లు.. చూసేయండి
Recommended image3
Dosa: దోశ పెనానికి అతుక్కుపోతోందా? ఇదొక్కటి చేస్తే.. హోటల్ స్టైల్ దోశ ఇంట్లోనే..!
Related Stories
Recommended image1
నారింజ తొక్కలు ఎన్ని రకాలుగా ఉపయోగపడతాయో తెలుసా?
Recommended image2
కంటిచూపు బాగుండాలంటే కచ్చితంగా తినాల్సినవి ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved