Telugu

నారింజ తొక్కలు ఎన్ని రకాలుగా ఉపయోగపడతాయో తెలుసా?

Telugu

రూమ్ ఫ్రెషనర్‌గా..

నారింజ తొక్కలను ఎండబెట్టి నీటిలో మరిగించాలి. తర్వాత వడకట్టి స్ప్రే బాటిల్‌లో పోసి ఇంటి మూలల్లో స్ప్రే చేస్తే చాలు.. ఇళ్లంతా సువాసన వస్తుంది.  

Image credits: Getty
Telugu

స్కిన్ కేర్‌

నారింజ తొక్కలను ఎండబెట్టి పొడి చేసుకోవాలి. దీన్ని పెరుగు, రోజ్ వాటర్‌తో కలిపి ముఖానికి రాస్తే మృతకణాలు తొలగిపోతాయి.

Image credits: Getty
Telugu

కిచెన్ క్లీనర్‌గా

నారింజ తొక్కలతో కిచెన్‌ను కూడా శుభ్రం చేయవచ్చు. నారింజ తొక్కలను 7-8 రోజులు వెనిగర్‌లో నానబెట్టాలి. ఆ మిశ్రమంతో గ్యాస్, సింక్ వంటి వాటిని శుభ్రం చేయవచ్చు.

Image credits: Getty
Telugu

జుట్టు కోసం

నారింజ తొక్కలు జుట్టుకు చాలా మేలు చేస్తాయి. తొక్కలను ఉడకబెట్టి, ఆ నీటితో తలస్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది.

Image credits: Getty
Telugu

మొక్కలకు ఎరువుగా

నారింజ తొక్కలను నీటిలో మరిగించి ఆ నీటిని మొక్కలకు పోయచ్చు. లేదా తొక్కలను నేరుగా మొక్క మొదట్లో వేసినా ఎరువుగా పనిచేస్తాయి. 

Image credits: Getty
Telugu

నారింజ తొక్కల టీ

నారింజ తొక్కలను ఎండబెట్టి పొడి చేసుకోవాలి. టీ చేసేటప్పుడు ఈ పొడిని కొద్దిగా కలిపితే చాలు టేస్టి టీ రెడీ అవుతుంది.

Image credits: Getty

హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్.. కాలేజి అమ్మాయిలకు బెస్ట్ ఆప్షన్

పరగడుపున నానపెట్టిన మెంతులు తీసుకుంటే ఏమౌతుంది?

ఈ 3 పనులు చేస్తే నెలలో బరువు తగ్గుతారు

Silver: బంగారంతో పని లేకుండా లో బడ్జెట్ వెండి ఇయర్ రింగ్స్