Flax Seeds: అవిసెగింజలు ఎలా తినాలి? రోజూ ఒక స్పూన్ తింటే జరిగే మ్యాజిక్ ఇదే..!
Flax Seeds: అవిసె గింజలు ఆరోగ్యానికి చాలా మంచిది అనే విషయం మీకు తెలుసు. కానీ, ఈ అవిసె గింజలను చాలా మందికి అవిసె గింజలను ఎలా తీసుకోవాలో సరిగా తెలీదు. ఎలా తింటే ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా?

Flax Seeds
అవిసె గింజలు చూడటానికి చిన్నగా, గోధుమ రంగులో మెరుస్తూ కనిపిస్తాయి. చూడటానికి చిన్నగా ఉన్నా.. వీటితో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా వీటిని సైలెంట్ పవర్ హౌజ్ అని కూడా పిలవచ్చు. ముఖ్యంగా జుట్టు రాలే సమస్య దగ్గర నుంచి.. అధిక బరువు దగ్గరి వరకు అన్ని సమస్యలను తగ్గించడంలో అవిసె గింజలు బాగా పని చేస్తాయి. మరి.. దీని ప్రయోజనాలు అన్నీ మనకు లభించాలి అంటే.. అవిసె గింజలను ప్రతిరోజూ ఏ రూపంలో తీసుకోవాలి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం...
అవిసె గింజలు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు..
1. జుట్టు రాలడానికి చెక్... ఒత్తైన జుట్టు సొంతం.. మీరు హెయిర్ ఫాల్‌తో బాధపడుతుంటే అవిసె గింజలు మీకు బెస్ట్ ఫ్రెండ్‌లా పనిచేస్తాయి. వీటిలోని విటమిన్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు కుదుళ్లను దృఢంగా మార్చి, జుట్టు వేగంగా పెరిగేలా ప్రోత్సహిస్తాయి.
2. కొలెస్ట్రాల్‌ను కరిగించి.. గుండెకు రక్షణ.. వీటిలో ఉండే స్పెషల్ సాల్యుబుల్ ఫైబర్ రక్తంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను (LDL) తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ రక్తనాళాల్లో కొవ్వు చేరకుండా చూసి హార్ట్ ఎటాక్, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
బరువు తగ్గించే అవిసెగింజలు..
అవిసె గింజలు తిన్న తర్వాత కడుపు చాలా సేపు నిండినట్లు అనిపిస్తుంది. దీనివల్ల పదే పదే జంక్ ఫుడ్ లేదా స్నాక్స్ తినాలనే కోరిక చచ్చిపోతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇదొక బెస్ట్ ఆప్షన్.
4. హార్మోన్ల అసమతుల్యతకి చెక్.. మహిళల్లో వచ్చే పీరియడ్స్ సమస్యలు, హార్మోన్ల అసమతుల్యతను అదుపు చేయడంలో ఇవి దివ్యౌషధంగా పనిచేస్తాయి. వీటిలో ఉండే 'లిగ్నాన్స్' అనే కాంపౌండ్ ఈస్ట్రోజెన్ స్థాయిలను బ్యాలెన్స్ చేస్తుంది. మెనోపాజ్ సమయంలో వచ్చే ఇబ్బందులను కూడా ఇది తగ్గిస్తుంది.
5. బ్లడ్ షుగర్ కంట్రోల్, కంటి ఆరోగ్యం: షుగర్ వ్యాధితో బాధపడేవారు వీటిని రోజూ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అలాగే ఇవి కంటి చూపు మెరుగుపడటానికి కూడా దోహదపడతాయి.
అవిసె గింజలు ఎలా తినాలి..?
అవిసె గింజల పైన ఉండే పొర చాలా గట్టిగా ఉంటుంది. అందుకే వీటిని నేరుగా నమలకుండా మింగేస్తే, జీర్ణం కాకుండా శరీరం నుండి అలాగే బయటకు వచ్చేస్తాయి. అందుకే వీటిని.. ఎలా తినాలంటే...
పొడి రూపంలో : అవిసె గింజలను దోరగా వేయించి, మిక్సీలో పొడి చేసుకుని గాజు సీసాలో పెట్టుకోండి. ఈ పొడిని రోజూ మనం తినే పెరుగు, ఓట్స్, స్మూతీస్, పప్పు లేదా చపాతీ పిండిలో ఒక టేబుల్ స్పూన్ కలుపుకుని తింటే సరిపోతుంది.
నానబెట్టిన నీళ్లతో: రాత్రి వేళ ఒక స్పూన్ అవిసె గింజలను నీటిలో నానబెట్టి, ఉదయాన్నే ఆ నీటిని తాగి, గింజలను బాగా నమిలి తినవచ్చు.
మొలకలు : వీటిని నానబెట్టి మొలకెత్తించడం వల్ల వీటిలోని ప్రోటీన్, ఒమేగా-3 గుణాలు రెట్టింపు అవుతాయి.
రోజుకు ఒక్క టేబుల్ స్పూన్ అంటే..10-15 గ్రాములు అవిసె గింజలు తినడం ఆరోగ్యానికి సరిపోతుంది. అతిగా తింటే కడుపు ఉబ్బరం లేదా జీర్ణ సమస్యలు రావచ్చు.

