- Home
- Life
- Fridge Door Cleaning: ఇంట్లో ఈ 2 వస్తువులుంటే చాలు...ఫ్రిడ్జ్ డోర్ ని నిమిషాల్లో క్లీన్ చేసేయొచ్చు
Fridge Door Cleaning: ఇంట్లో ఈ 2 వస్తువులుంటే చాలు...ఫ్రిడ్జ్ డోర్ ని నిమిషాల్లో క్లీన్ చేసేయొచ్చు
Fridge Door Cleaning: ఫ్రిడ్జ్‌ను తరచు శుభ్రం చేసినా, డోర్ చుట్టూ ఉండే రబ్బర్ దగ్గర నల్లటి మచ్చలు, మురికి పేరుకుపోతూ ఉంటుంది. అందుకని దీన్ని క్లీన్ చేయడానికి బ్లీచ్, వెనిగర్ లాంటివి వాడేస్తుంటారు. ఎక్కువ కష్టపడకుండా ఈ 2 వస్తువలతో క్లీన్ చేసేయొచ్చు.
15

Image Credit : Asianet News
ఫ్రిడ్జ్ డోర్ రబ్బర్‌పై మురికి ఎందుకు పేరుకుపోతుంది?
ఫ్రిడ్జ్ డోర్ చుట్టూ ఉండే రబ్బర్ కేవలం అందం కోసం పెట్టింది కాదు. దీన్ని డోర్ గ్యాస్కెట్ (Door Gasket) అంటారు. ఫ్రిడ్జ్ డోర్ మూసినప్పుడు గాలి బయటకు పోకుండా, బయటి వేడి గాలి లోపలికి రాకుండా ఇది అడ్డుకుంటుంది.
ఈ రబ్బర్‌లో చిన్న చిన్న మడతలు ఉంటాయి. వాటిలో ఆహారపు రేణువులు, నూనె జిడ్డు, దుమ్ము, తేమ లాంటివి పేరుకుపోతాయి. ముఖ్యంగా ఫ్రిడ్జ్ నుంచి ఆహార పదార్థాలు తీస్తున్నప్పుడు పడే కూర, పాలు లాంటి మరకలను పట్టించుకోకపోతే కాలక్రమేణా మురికిగా మారుతుంది.
అందుకే ఫ్రిడ్జ్‌లోని మిగతా భాగాలు శుభ్రంగా ఉన్నా, డోర్ రబ్బర్ మాత్రం నల్లగా కనిపిస్తుంది.
రబ్బర్‌ను శుభ్రం చేయడానికి కావాల్సిన 2 వస్తువులు ఏమిటి?
దీనికోసం ఖరీదైన క్లీనర్లు కొనాల్సిన అవసరం లేదు. రెండు సింపుల్ వస్తువులు చాలు.
• గోరువెచ్చని నీరు
• కొద్దిగా మైల్డ్ డిష్ వాష్ లిక్విడ్ (Mild Dishwashing Liquid)
వాటితో పాటు తుడుచుకోవడానికి మెత్తని మైక్రోఫైబర్ క్లాత్ లేదా పాత సాఫ్ట్ టూత్ బ్రష్ తీసుకోవచ్చు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
25
Image Credit : Asianet News
ఫ్రిడ్జ్ రబ్బర్‌ను శుభ్రం చేయడం ఎలా?
ముందుగా ఒక చిన్న గిన్నెలో గోరువెచ్చని నీళ్లు తీసుకోండి. అందులో కొద్దిగా మైల్డ్ డిష్ వాష్ లిక్విడ్ వేసి కలపాలి.
ఒక మెత్తటి క్లాత్‌ని ఈ మిశ్రమంలో ముంచి, నీళ్లు లేకుండా బాగా పిండేయండి. తర్వాత ఫ్రిడ్జ్ డోర్ చుట్టూ ఉండే రబ్బర్మెల్లగా తుడవాలి.
రబ్బర్ మడతల్లో మురికి ఎక్కువగా ఉంటే, సాఫ్ట్ టూత్ బ్రష్‌తో గట్టిగా రుద్దకుండా మెల్లగా క్లీన్ చేయొచ్చు. ముఖ్యంగా మూలల్లో, కింది వైపు మడతల్లో మురికి ఉంటే జాగ్రత్తగా తొలగించండి.
చివరగా, స్వచ్ఛమైన నీటిలో ముంచి పిండిన క్లాత్‌తో సబ్బు మరకలను తుడిచేసి, పొడిగా ఉన్న మెత్తటి క్లాత్‌తో తడి లేకుండా తుడవాలి. రబ్బర్ మడతల్లో తడి లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం.
35
Image Credit : Asianet News
బ్లీచ్, వెనిగర్ వాడవచ్చా?
అన్ని మోడళ్లలో ఫ్రిడ్జ్ రబ్బర్‌పై ఉన్న మురికిని వదిలించడానికి బ్లీచ్ లేదా వెనిగర్ లాంటివి వాడటం కరెక్ట్ కాదు. ముఖ్యంగా కొందరు తయారీదారులు రబ్బర్ గ్యాస్కెట్పై బ్లీచ్, క్లోరిన్ కలిపిన క్లీనర్లు, కఠినమైన కెమికల్స్ ఉపయోగించొద్దని చెబుతున్నారు.
GE Appliances కంపెనీ రబ్బర్ గ్యాస్కెట్ను మైల్డ్ సోప్, గోరువెచ్చని నీటితో క్లీన్ చేయాలని సూచిస్తోంది. Bosch కంపెనీ కూడా మెత్తని క్లాత్, సబ్బు నీళ్లు వాడమని సలహా ఇస్తోంది.
కాబట్టి, మీ ఫ్రిడ్జ్ కంపెనీ మాన్యువల్‌లో చెప్పిన క్లీనింగ్ విధానాన్ని ఫాలో అవ్వడం బెటర్.
45
Image Credit : Asianet News
క్లీన్ చేసేటప్పుడు ఈ తప్పులు చేయకండి!
• స్టీల్ స్క్రబ్బర్ లేదా కఠినమైన స్క్రబ్బర్ వాడి రుద్దకండి.
• బ్లీచ్, క్లోరిన్ కలిపిన క్లీనర్లు వాడొద్దు.
• రబ్బర్ మడతల్లో ఎక్కువ నీళ్లు పోయొద్దు.
• కత్తి, సూది లాంటి పదునైన వస్తువులతో మురికిని తీయడానికి ప్రయత్నించకండి.
• రబ్బర్‌ను బలవంతంగా బయటకు లాగకండి.
కఠినమైన క్లీనర్లు, గీతలు పడే వస్తువులు రబ్బర్, ప్లాస్టిక్ భాగాలను దెబ్బతీస్తాయని తయారీదారుల గైడ్‌లైన్స్ హెచ్చరిస్తున్నాయి.
55
Image Credit : Chat GPT
రబ్బర్ శుభ్రంగా ఉండటం ఎందుకు ముఖ్యం?
డోర్ రబ్బర్ కరెక్ట్‌గా అమరితేనే ఫ్రిడ్జ్‌లో చల్లని గాలి బయటకు పోకుండా ఉంటుంది. రబ్బర్‌పై మురికి పేరుకుపోవడమే కాదు, అది వదులవ్వడం, చిరగడం లేదా పగుళ్లు రావడం లాంటి సమస్యల వల్ల డోర్ సరిగ్గా మూసుకోదు.
అందుకే రబ్బర్ మడతల్లో మురికి ఉందా, డోర్ మూసేటప్పుడు గ్యాప్ వస్తుందా అనేది ఎప్పటికప్పుడు గమనించాలి. రబ్బర్‌లో పగుళ్లు లేదా డ్యామేజ్ ఉంటే క్లీన్ చేస్తే సరిపోదు; సర్వీస్ నిపుణుడితో చెక్ చేయించడం అవసరం.












