Hair Care: రోజూ ఇవి తింటే చాలు...70 ఏళ్లు దాటినా జుట్టు నెరవదు, పట్టుకుచ్చులా మెరుస్తుంది
Hair Care: జుట్టు అందంగా కనిపించాలంటే షాంపూలు, నూనెలు వాడటమే కాదు.. శరీరానికి పోషకాలు అందడం ముఖ్యం. ముఖ్యంగా కొన్ని రకాల ఆహారాలు జుట్టు కుదుళ్లను బలంగా ఉంచుతాయి. సహజ మెరుపును కాపాడుకునేందుకు ఉపయోగపడతాయి. 70 ఏళ్లు వచ్చినా జుట్టు నెరవదు.

జట్టు ఆరోగ్యానికి ఇవి చాలా ముఖ్యం
జుట్టు రంగును మెలనిన్ (Melanin) అనే పిగ్మెంట్ నిర్ణయిస్తుంది. వయసు పెరగడం, కొన్ని పోషకాల లోపం, విపరీతమైన ఒత్తిడి వల్ల మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోవచ్చు. దీంతో జుట్టు నెరవడం మొదలవుతుంది. ఇలాంటప్పుడు పోషకాలు నిండిన ఆహారం తీసుకోవడం ద్వారా జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
డైట్లో ఉసిరిని చేర్చుకోండి
జుట్టు సంరక్షణ అనగానే ముందుగా గుర్తొచ్చేది ఉసిరి. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. జుట్టు సహజ రంగును కాపాడటానికి, చిన్న వయసులోనే జుట్టు నెరిసే సమస్యను అడ్డుకోవడానికి ఉసిరిని క్రమం తప్పకుండా తినండి.
కరివేపాకును అస్సలు తీసిపారేయొద్దు
కరివేపాకులో బీటా కెరోటిన్, ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కుదుళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, సహజ రంగును కాపాడతాయి. కరివేపాకును వంటల్లో వాడటమే కాదు, కొబ్బరి నూనెలో మరిగించి జుట్టుకు రాసుకోవచ్చు. పచ్చడి చేసుకుని కూడా తినొచ్చు.
నల్ల నువ్వులను మర్చిపోవద్దు
జుట్టు సహజ రంగును కాపాడటానికి డైట్లో చేర్చుకోవాల్సిన మరో అద్భుతమైన పదార్థం నల్ల నువ్వులు. వీటిలో కాపర్, ఐరన్, మెగ్నీషియం, బి విటమిన్లు మెండుగా ఉంటాయి. ఈ పోషకాలు జుట్టును దృఢంగా ఉంచి, మెలనిన్ ఉత్పత్తికి సాయపడతాయి.
క్యారెట్, బీట్రూట్ తినండి
క్యారెట్లో విటమిన్ ఎ, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మాడు ఆరోగ్యాన్ని కాపాడతాయి. క్యారెట్‌ను జ్యూస్, సలాడ్ లేదా కూరగా తినొచ్చు. బీట్రూట్లో ఫోలేట్, నైట్రేట్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. దీన్ని జ్యూస్, సలాడ్ లేదా ఉడికించి కూడా డైట్లో చేర్చుకోవచ్చు.
పాలకూరతో కావాల్సినన్ని పోషకాలు
పాలకూరలో ఐరన్, ఫోలేట్ సహా జుట్టు ఆరోగ్యానికి అవసరమైన పోషకాలున్నాయి. ఇవి జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సాయపడతాయి. పాలకూరను సలాడ్, కూర, గ్రీన్ జ్యూస్ లేదా స్మూతీ రూపంలో మీ డైట్లో చేర్చుకోవచ్చు.
వాల్నట్స్, బాదం కూడా మేలు చేస్తాయి
వాల్‌నట్స్‌లో కాపర్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, బయోటిన్ ఉంటాయి. వీటిని రోజూ డైట్లో చేర్చుకోవడం వల్ల జుట్టు, మాడు ఆరోగ్యంగా ఉంటాయి. రోజూ 4-5 వాల్నట్స్ తినే అలవాటు చేసుకోండి.
మునగాకు, గుడ్డును కూడా డైట్లో చేర్చండి
మునగాకులో జింక్, ఐరన్, విటమిన్ బి6 సహా ఎన్నో పోషకాలున్నాయి. మునగాకు పొడిని స్మూతీల్లో కలుపుకోవచ్చు. ఆకును కూర లేదా సూప్‌లా కూడా తాగొచ్చు. ఇక గుడ్డులో ప్రొటీన్, బయోటిన్, బి విటమిన్లు ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యాన్ని కాపాడతాయి.
వారానికోసారైనా జుట్టుకు నూనె రాయండి
ఆహారంతో పాటు జుట్టుకు పైపైన చేసే జాగ్రత్తలు కూడా ముఖ్యమే. వారానికోసారైనా జుట్టుకు నూనె రాసే అలవాటు చేసుకోండి. ఉసిరి, గుంటగలగర, బ్రాహ్మీ లాంటి మూలికలున్న నూనెతో మాడుకు మసాజ్ చేయండి.
తెల్ల జుట్టును శాశ్వతంగా నల్లగా మార్చొచ్చా?
తెల్లబడిన జుట్టును శాశ్వతంగా నల్లగా మార్చే కచ్చితమైన పద్ధతి ఏదీ లేదు. కానీ బ్యాలెన్స్డ్ డైట్, తగినన్ని పోషకాలు, సరైన కేర్‌తో జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. కొన్నిసార్లు చిన్న వయసులోనే జుట్టు తెల్లబడే వేగాన్ని తగ్గించుకోవచ్చు.













