MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Bathroom Cleaning: ఈ ఒక్క పౌడర్ చల్లితే.. మీ బాత్రూమ్ టైల్స్ కొత్త వాటిలా మెరిసిపోతాయి..!

Bathroom Cleaning: ఈ ఒక్క పౌడర్ చల్లితే.. మీ బాత్రూమ్ టైల్స్ కొత్త వాటిలా మెరిసిపోతాయి..!

Bathroom Cleaning: ఎన్ని కెమికల్స్ వాడినా కూడా.. మీ బాత్రూమ్ టైల్స్ శుభ్రపడటం లేదా? మరకలు వదిలించడానికి గట్టిగా రుద్దాల్సి వస్తోందా? ఎక్కువ కష్టం పడకుండా ఆ మరకలు ఎలా వదిలించాలో తెలుసా?

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 17 2026, 02:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Bathroom Cleaning
Image Credit : Gemini | AI generated

Bathroom Cleaning

మన మన ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో, బాత్రూమ్ ని కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి. అయితే, మేము ఎన్నిసార్లు, ఎంత శుభ్రం చేసినా కూడా బాత్రూమ్ లో మరకలు వదలడం లేదని చాలా మంది చెబుతూ ఉంటారు. ముఖ్యంగా బాత్రూమ్ లో టైల్స్ పై మరకలు అంత ఈజీగా వదలవు. దీంతో, వాటిని వదిలించడానికి చాలా మంది మార్కెట్లో దొరికే ఏవేవో లిక్విడ్స్ తెచ్చి క్లీన్ చేస్తూ ఉంటారు. అయితే, వాటి వల్ల మరకలు వదలకపోగా...కెమికల్స్ ఉన్న లిక్విడ్స్ వాడటం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. మరి, ఎక్కువ కష్టపడకుండా బాత్రూమ్ కొత్తదానిలా ఎలా మెరిపించాలో ఇప్పుడు చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
టైల్స్ మధ్య మురికి ఎందుకు పేరుకుపోతుంది?
Image Credit : AI

టైల్స్ మధ్య మురికి ఎందుకు పేరుకుపోతుంది?

టైల్స్ మధ్య ఉండే సిమెంట్ పూతను 'గ్రౌట్' అంటారు. ఈ సిమెంట్ ఆధారిత గ్రౌట్‌లు సహజంగానే తేమను, మురికిని పీల్చుకుంటాయి. మనం స్నానం చేసేటప్పుడు వాడే సోపులు, షాంపూల అవశేషాలు వీటిలో సులభంగా పేరుకుపోతాయి. అలాగే నీటిలోని ఖనిజాల వల్ల తెల్లటి లేదా పసుపు రంగు మరకలు ఏర్పడతాయి. బాత్రూమ్‌లో ఎక్కువ కాలం తేమ ఉండటం వల్ల నల్లటి లేదా ఆకుపచ్చ రంగులో బూజు తయారై మురికిగా మారుతుంది.

33
టైల్స్‌ను శుభ్రం చేయడానికి సులభమైన మార్గాలు:
Image Credit : Asianet News

టైల్స్‌ను శుభ్రం చేయడానికి సులభమైన మార్గాలు:

బేకింగ్ సోడా పద్ధతి: తేలికపాటి మురికి , మరకలను తొలగించడానికి ఇది గొప్ప పరిష్కారం. బేకింగ్ సోడాను కొద్దిగా నీటితో కలిపి చిక్కటి పేస్ట్ లా తయారు చేసి పగుళ్లపై పూయాలి. 5 నుండి 10 నిమిషాలు బాగా నానిన తర్వాత, పాత టూత్‌బ్రష్‌తో మెల్లగా రుద్ది పొడి క్లాత్‌తో తుడిస్తే సరిపోతుంది.

డిష్ వాష్ లిక్విడ్: సబ్బు , నూనె మరకలను పోగొట్టడానికి, కొన్ని చుక్కల డిష్‌వాషింగ్ లిక్విడ్‌ను గోరువెచ్చని నీటిలో కలిపి మృదువైన బ్రష్‌తో రుద్దాలి. ఆ తర్వాత నీటితో కడిగితే మరకలు తొందరగా వదులుతాయి.

వైట్ వెనిగర్: బాత్రూమ్ టైల్స్‌పై పేరుకుపోయిన మొండి మురికిని తొలగించడానికి వైట్ వెనిగర్ బాగా పనిచేస్తుంది. దీనిని మరకలపై చల్లి, కాసేపటి తర్వాత బ్రష్‌తో రుద్దితే మరకలు సులభంగా వదులుతాయి. అయితే వెనిగర్‌ను పాలరాయి (Marble) , గ్రానైట్ ఉపరితలాలపై అసలు వాడకూడదు, ఇది వాటి మెరుపును దెబ్బతీస్తుంది.

అలాగే మరకలు వదిలించడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ స్క్రబ్బర్లు వాడకూడదు. టైల్స్‌కు గీతలు పడకుండా కేవలం మృదువైన నైలాన్ బ్రష్‌లను లేదా క్లాత్‌ను మాత్రమే ఉపయోగించాలి.

సరైన గాలి ప్రసరణ లేకపోవడం వల్ల బాత్రూమ్‌లో నలుపు, ఆకుపచ్చ రంగులో మురికి పేరుకుపోతుంది. అలా జరగకుండా ఉండాలంటే ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేదా కిటికీ ద్వారా గాలి చక్కగా ఆడేలా చూసుకోవాలి.

బాత్రూమ్ ఎప్పుడూ మెరిసిపోవాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు: స్నానం చేసిన వెంటనే నేల, గోడలపై నిలిచిన నీటిని వైపర్‌తో తుడిచివేయడం మంచిది.

ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేదా కిటికీని ఉపయోగించి బాత్రూమ్‌లో తేమను ఎల్లప్పుడూ అదుపులో ఉంచుకోవాలి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Silver Anklets: ఈ ఒక్క ట్రిక్ తో నల్లబడిన వెండి పట్టీలు తళతళ మెరిసిపోతాయి
Recommended image2
Instant Vada: పప్పు నానబెట్టక్కర్లేదు, రుబ్బక్కర్లేదు.. బ్రెడ్‌తో కరకరలాడే వడలు!
Recommended image3
Kitchen Tips: బియ్యం, పప్పులు పురుగు పట్టకూడదంటే ఈ చిన్న పని చేయండి!
Related Stories
Recommended image1
Frogs: ఈ దేశంలో పాలల్లో బతికి ఉన్న కప్పలు వేస్తారు.. ఎందుకో తెలుసా?
Recommended image2
Whisky: విస్కీ అసలైన రుచి తెలియాలంటే ఎలా తాగాలి..? నీళ్లతోనా, ఐస్ తోనా..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved