MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Life
  • Boil potatoes: నీరు వేయకుండా ప్రెషర్ కుక్కర్లో బంగాళాదుంపలు ఇలా ఉడకబెట్టేయండి

Boil potatoes: నీరు వేయకుండా ప్రెషర్ కుక్కర్లో బంగాళాదుంపలు ఇలా ఉడకబెట్టేయండి

Potato: బంగాళాదుంపలు ఉడకబెట్టాలంటే నీళ్లే వేసి ప్రెషర్ కుక్కర్లె పెట్టాలి. కానీ నీరు వేయాల్సిన అవసరం లేకుండానే ఆలూ దుంపలను ఉడికించవచ్చు. ఈ చిట్కా ఎలా తెలుసుకోండి. 

2 Min read
Author : Haritha Chappa
Published : Jan 30 2026, 11:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బంగాళాదుంపలు ఉడికించడం
Image Credit : Getty

బంగాళాదుంపలు ఉడికించడం

బంగాళాదుంపలు మన భారతీయ వంటల్లో ప్రధానమైనది. ప్రతి రెస్టారెంట్లో ఈ కూర ఉండాల్సిందే. ఇక పెళ్లి భోజనాల బంగాళాదుంప కూర లేనిదే భోజనం పూర్తి కాదు. ఈ దుంపలతో కూరలు, కర్రీలు, స్నాక్స్, చాట్ ఇలా ఎన్నో వంటకాలు చేసుకోవచ్చు. సాధారణంగా బంగాళాదుంపలను ఉడికించాలంటే నీరు తప్పనిసరిగా అవసరం. కానీ ఇప్పుడు ఒక కొత్త కిచెన్ హ్యాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రెషర్ కుక్కర్‌లో నీరు లేకుండానే బంగాళాదుంపలు ఉడికించవచ్చని ఆ వీడియో చెబుతోంది. నీటిలో వేసి ఉడికిస్తే బంగాళాదుంపల్లోని పోషకాలు నీటిలో కలిసిపోతాయని అంటారు. దీని వల్ల రుచి కొద్దిగా తగ్గుతుందని అంటారు. అందుకే నీరు లేకుండా, బంగాళాదుంపల్లో సహజంగా ఉండే తేమతోనే ఉడికిస్తే రుచి మరింత బాగుంటుందనే నమ్మకం ఎక్కువ మందిలో ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
నీరు లేకుండా ఉడికించడం
Image Credit : Getty

నీరు లేకుండా ఉడికించడం

ప్రెషర్ కుక్కర్లో నీరు వేయాల్సిన అవసరం లేకుండా బంగాళాదుంపలను ఉడికించవచ్చు. బంగాళాదుంపల్లో సహజంగానే కొంత తేమ ఉంటుంది. ప్రెషర్ కుక్కర్ వేడి అవుతున్నప్పుడు అదే తేమ ఆవిరిగా మారి బంగాళాదుంపలను ఉడికించడంలో సహాయపడుతుంది. దీనివల్ల అవి పూర్తిగా ఉడికిపోతాయి, కానీ నీటిలో మునిగిపోయినట్టు కాకుండా గట్టిగా, రుచిగా ఉంటాయి. ఇందుకోసం ముందుగా బంగాళాదుంపలను బాగా కడగాలి. మట్టి పూర్తిగా పోయేలా చూసుకోవాలి. తొక్క తీసేయాల్సిన అవసరం లేదు. తొక్కతోనే ఉడికిస్తే పోషకాలు బయటికి పోకుండా ఉంటాయి. తర్వాత ప్రెషర్ కుక్కర్‌లో బంగాళాదుంపలను నేరుగా పెట్టాలి. నీరు మాత్రం పోయకూడదు. కుక్కర్ మూత మూసి మంటను తక్కువగా పెట్టాలి. సాధారణంగా 2 నుంచి 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. స్టవ్ కట్టేశాక కుక్కర్ చల్లబడే వరకు వేచి ఉండాలి. తర్వాత మూత తీస్తే బంగాళాదుంపలు బాగా ఉడికిపోయి ఉంటాయి.

Related Articles

Related image1
Dream Astrology: రాత్రికి రాత్రే మీ జీవితాన్ని మార్చేసే కల ఇది, వస్తే మీరు అదృష్టవంతులే
Related image2
Jupiter Transit: గురు గ్రహ స్థితిలో మార్పు ఈ 4 రాశుల వారికి అద్భుత యోగం
34
దీనివల్ల లాభాలు
Image Credit : Getty

దీనివల్ల లాభాలు

ఈ పద్ధతితో బంగాళాదుంపలు ఉడకించడం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇలా ఉడికించడం వల్ల పోషకాలు నిలుస్తాయి. నీటిలో ఉడికిస్తే కొన్ని విటమిన్లు నీటిలోకి వెళ్లిపోతాయి. కానీ ఈ పద్ధతిలో అవి బంగాళాదుంపలోనే ఉంటాయి. బయటికి పోకుండా దుంపలోనే ఉంటాయి. అలాగే ఇలా ఉడికించడం వల్ల రుచి పెరుగుతుంది. నీరు లేకుండా ఉడికించడంతో బంగాళాదుంప సహజ రుచి మరింత బాగా ఉంటుంది.

44
జాగ్రత్తలు తప్పనిసరి
Image Credit : Getty

జాగ్రత్తలు తప్పనిసరి

అయితే ఈ పద్ధతిని పాటించే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రెషర్ కుక్కర్‌లో పూర్తిగా నీరు లేకుండా వంట చేయడం కొన్నిసార్లు ప్రమాదకరం కావచ్చు. అందుకే మంట చాలా తక్కువగా ఉండాలి. కుక్కర్ పాతదైనా లేదా సరిగా పనిచేయకపోయినా దాన్ని వాడకపోవడమే మంచిది. మొదటిసారి ప్రయత్నిస్తున్నవారు తక్కువ పరిమాణంలో బంగాళాదుంపలతో ట్రై చేయాలి. వాసన మాడిపోయినట్టు అనిపిస్తే వెంటనే మంట ఆపేయాలి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
ఆహారం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
వంటింట్లో స్టవ్ పక్కనే సింక్ ఉండొచ్చా? వాస్తు నిపుణులు ఏం చెబుతున్నారు?
Recommended image2
వాషింగ్ మెషీన్లో దుస్తులు ఉతికేటప్పుడు ఈ 7 తప్పులు చేస్తే మెషీన్ పోతుంది
Recommended image3
Potato Face Pack: బంగాళదుంప ఫేస్ ప్యాక్ తో ముఖంపై నల్లమచ్చలు మాయం!
Related Stories
Recommended image1
Dream Astrology: రాత్రికి రాత్రే మీ జీవితాన్ని మార్చేసే కల ఇది, వస్తే మీరు అదృష్టవంతులే
Recommended image2
Jupiter Transit: గురు గ్రహ స్థితిలో మార్పు ఈ 4 రాశుల వారికి అద్భుత యోగం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved