Jupiter Transit: గురు గ్రహ స్థితిలో మార్పు ఈ 4 రాశుల వారికి అద్భుత యోగం
Jupiter Transit: గురు గ్రహం స్థితిలో మార్పు ఎన్నో రాశులకు కలిసి వస్తుంది. జనవరి 30న పునర్వసు నక్షత్రంలోకి గురుగ్రహం ప్రవేశించబోతోంది. ఇది 4 రాశుల వారికి శుభ ఫలితాలను ఇవ్వబోతోంది. ఆ రాశులేవో తెలుసుకోండి.

గురు నక్షత్ర సంచారం 2026
జనవరి 30న గురు గ్రహం తన స్థానాన్ని మార్చుకోబోతోంది. ఆ గ్రహం పునర్వసు నక్షత్రంలోకి అడుగుపెట్టబోతోంది. ఇది జ్యోతిష్యపరంగా ఎంతో ముఖ్యమైన మార్పుగా చెప్పుకోవాలి. గురువు తన సొంత నక్షత్రంలో ఉండటం వల్ల కొన్ని రాశుల వారికి విపరీతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. గురువుకు స్వీయ బలం ఎక్కువ. దీని వల్ల కొన్ని రాశుల వారికి శుభకార్యాలు, ఆర్థిక పురోగతి కలుగుతాయి. ఆ అదృష్ట రాశులేవో తెలుసుకోండి.
మేష రాశి
గురుగ్రహంలో జరిగే మార్పు మేష రాశికి విపరీతమైన శుభ ఫలితాలను ఇస్తాడు. ఇతరుల దగ్గర ఇరుక్కుపోయిన మొండి బాకీలు వసూలవుతాయి. అలాగే మేషరాశి కుటుంబంలో ప్రేమ, ఆప్యాయత పెరుగుతాయి. వీరు ఒక్క మాటతో ఎన్నో పనులను సాధిస్తారు. మేషరాశి వారికి సమాజంలో కీర్తి పెరుగుతుంది. అలాగే వ్యక్తిగతంగా వీరి ఆదాయం కూడా పెరిగే ఛాన్స్ ఉంది. ఈ రాశి వారికి ప్రేమ, వైవాహిక జీవితం చక్కగా సాగుతుంది.
మిథున రాశి
మిథున రాశి వారికి గురు గ్రహం వల్ల అన్ని రకాలుగా కలిసి వస్తుంది. గురువు శుభ దృష్టి వల్ల ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం అమాంతం పెరుగుతుంది. అలాగే ఈ రాశి వారు కొత్త వ్యాపారం మొదలుపెట్టాలనుకుంటే ఇది స్వర్ణయుగమని చెప్పుకోవాలి. అలాగే వీరి పిల్లల చదువులో పురోగతి కనిపిస్తుంది. వీరికి మంచి జీతంతో కొత్త ఉద్యోగం లభిస్తుంది. వ్యక్తిగత జీవితంతో పాటూ వృత్తి జీవితం కూడా అద్భుతంగా సాగుతుంది.
సింహ రాశి
సింహ రాశి వారికి గురుగ్రహం పునర్వసు నక్షత్రంలోకి అడుపెట్టడం ఆనందంగా సాగుతుంది. ఈ రాశివారి వృత్తిలో ఎన్నో మార్పులు వస్తుంది. ఇక ఉద్యోగం వెతుకుతున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. అలాగే ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్ లేదా బదిలీ జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ రాశి వారి గౌరవం, హోదా పెరుగుతాయి. వీరి వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది.
కన్యా రాశి
కన్యా రాశి వారికి 9వ ఇంట్లో గురువు సంచారం జరుగుతుంది. ఆ ఇల్లు భాగ్య స్థానంగా చెప్పుకుంటారు. ఇది కన్యా రాశికి అద్భుతమైన కాలంగా చెప్పుకోవాలి. కన్యా రాశి వారికి తండ్రి వైపు ఉన్న ఆస్తి సమస్యలు తీరిపోతాయి. అలాగే ఈ రాశి వారు చేసే విదేశీ ప్రయాణాలు సఫలమవుతాయి. అదృష్టం ఈ రాశి వారి వెంటే ఉంటుంది. కన్యా రాశి వారి జీవితంలో ఆనందం, శాంతి కలుగుతుంది.

