MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Life
  • Alcohol: మందు తాగుతున్నారా? అది మీ ఒంట్లో ఎన్ని రోజులు ఉంటుందో తెలుసా?

Alcohol: మందు తాగుతున్నారా? అది మీ ఒంట్లో ఎన్ని రోజులు ఉంటుందో తెలుసా?

Alcohol: మీకు ఆల్కహాల్ తాగే అలవాటు ఉందా? మీరు తాగిన ఆల్కహాల్ మీ శరీరంలో ఎన్ని రోజులు ఉంటుంది? ఎన్ని రోజుల తర్వాత అది శరీరం నుంచి బయటకు వెళ్తుంది? ఒంట్లో ఉన్నంతసేపు అది ఏం చేస్తుంది?

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 23 2026, 04:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Alcohol
Image Credit : Getty

Alcohol

ఈరోజుల్లో ఆల్కహాల్ తీసుకునేవారి సంఖ్య కాస్త ఎక్కువగా ఉందనే చెప్పొచ్చు. పార్టీ ఉందనో, లేదా వీకెండ్ అనో చాలా మంది అడపాదడపా మద్యం తీసుకుంటూ ఉంటారు. రాత్రి మందు తాగితే..ఉదయానికి హ్యాంగ్ ఓవర్ తో ఇబ్బంది పడేవాళ్లను చూసే ఉంటారు. ఉదయం కాస్త ఇబ్బందిగా అనిపించినా.. మధ్యాహ్నం టైమ్ కి నార్మల్ అయిపోతాం. రాత్రి మందు తాగిన విషయమే గుర్తుండదు. తాగింది మొత్తం దిగిపోయింది అనుకుంటాం. కానీ, ఒక వ్యక్తి తీసుకున్న ఆల్కహాల్ శరీరంలో ఎన్ని రోజులు ఉంటుంది అనే విషయం ఇప్పుడు చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఎన్ని గంటలు శరీరంలో ఉంటుంది?
Image Credit : Freepik

ఎన్ని గంటలు శరీరంలో ఉంటుంది?

ఒక వ్యక్తి మద్యం తాగితే.. అది ఆ వ్యక్తి శరీరంలో దాదాపు 20 నుంచి 25 గంటలపాటు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇక.. ఆ వ్యక్తి సేవించిన మద్యం పరిమాణం, అతని ఆహారపు అలవాట్లను బట్టి.. ఈ సమయం మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆల్కహాల్ సేవించినప్పటి నుంచి శరీరం నుంచి బయటకు వెళ్లే వరకు జరిగే ప్రక్రియ కడుపులో మొదలౌతుంది. అక్కడ వివిధ ఎంజైమ్ లు మొత్తం విచ్చిన్న ప్రక్రియను ప్రారంభిస్తాయి అని వైద్యులు చెబుతున్నారు. చాలా వరకు ఆల్కహాలు ఎలాంటి మార్పు చెందకుండా చిన్న పేగులోకి ప్రవేశించి... అక్కడి నుంచి రక్త ప్రవాహంలో చేరుతుంది.. ఆ తర్వాత అక్కడి నుంచి ఆల్కహాల్ కాలేయానికి చేరుకుంటుంది. లివర్ కి చేరి.. లివర్ డ్యామేజ్ అవ్వడానికి కారణం అవుతుంది. అంతేకాదు.. లివర్ కి చేరిన ఆల్కహాల్ అసిటాల్టిహైడ్ గా మారుతుంది.దీని కారణంగా కడుపులో వికారం, తలనొప్పి, గుండె దడ వంటి సమస్యలు రావడానికి కారణం అవుతుంది.

ఓ పరిశోధనలో తేలిన ప్రకారం, బీర్, వైన్, వోడ్కా లాంటి ఆల్కహాల్ తక్కువ మొత్తంలో తీసుకున్న తర్వాత.. మీ రక్తంలో ఆల్కహాల్ స్థాయి సుమారు గంట తర్వాత గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది. ఆ సమయం నుంచి ఆల్కహాల్ మీ శరీరం నుంచి పూర్తిగా బయటకు వెళ్లడానికి మరో 20 నుంచి 25 గంటల సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. కానీ, శరీరానికి ఆల్కహాల్ అలవాటుగా మారడం వల్ల.. ఎక్కువ సేపు మత్తు ఉన్నట్లు మీకు అనిపించకపోవచ్చు. కానీ, దాని ప్రభావం... మాత్రం మీ శరీరంలో అలాగే ఉంటుంది.

Related Articles

Related image1
Mukesh Ambani: కొడుకుతో వాచ్ మెన్ కి క్షమాపణలు చెప్పించిన ముఖేష్ అంబానీ.. ఎందుకో తెలుసా?
Related image2
Snakes: బ్రతికున్న పాము ఎంత ప్రమాదమో.. చనిపోయిన పాము కూడా అంతే ప్రమాదం.. ఎందుకో తెలుసా?
33
శరీరంలో ఆల్కహాల్ ఉందో లేదో ఎలా గుర్తించాలి..?
Image Credit : Getty

శరీరంలో ఆల్కహాల్ ఉందో లేదో ఎలా గుర్తించాలి..?

శరీరంలో ఆల్కహాల్ ఎంతసేపు ఉంది అనే విషయాన్ని కొన్ని రకాల పరీక్షలతో ఈజీగా తెలుసుకోవచ్చు. రక్తంలో 12 గంటల వరకు ఆల్కహాల్ ఉంటుంది. రక్త పరీక్షతో ఇది తెలిసిపోతుంది. 12 నుంచి 24 గంటల వరకు శ్వాస ద్వారా ఆల్కహాల్ ని గుర్తించవచ్చు. మూత్రంలో 12 నుంచి 72 గంటలపాటు ఉంటుంది. యూరిన్ టెస్ట్ లో ఈజీగా తెలిసిపోతుంది. ఇక, లాలాజలంలో 12 నుంచి 48 గంటలపాటు ఆల్కహాల్ ఉంటుంది. జుట్టులో అయితే ఏకంగా 90 రోజుల వరకు ఆల్కహాల్ ఉంటుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
మహిళలు నలభై దాటాక తిండి తగ్గించినా కూడా బరువు తగ్గడం కష్టమే
Recommended image2
Fish: చేపలతో పాటు వీటిని పొరపాటున కూడా తీసుకోకూడదు!
Recommended image3
Parenting: మీ ఇంట్లో టీనేజ్ పిల్లలు ఉన్నారా? పేరెంట్స్ మార్చుకోవాల్సిన 5 అలవాట్లు ఇవే
Related Stories
Recommended image1
Mukesh Ambani: కొడుకుతో వాచ్ మెన్ కి క్షమాపణలు చెప్పించిన ముఖేష్ అంబానీ.. ఎందుకో తెలుసా?
Recommended image2
Snakes: బ్రతికున్న పాము ఎంత ప్రమాదమో.. చనిపోయిన పాము కూడా అంతే ప్రమాదం.. ఎందుకో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved