లవంగాల్లో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ఫ్రీ రాడికల్స్, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది.
కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలను తొలగించి జీర్ణక్రియను మెరుగుపరచడానికి లవంగం టీ తాగడం చాలా మంచిది.
లవంగాల్లో ఉండే యాంటీమైక్రోబియల్ గుణాలు జ్వరం, ఫ్లూ వంటి రోగాలను అడ్డుకోవడంలో సహాయపడతాయి.
నొప్పులు, వాపులు తగ్గించడానికి లవంగం టీ ఎంతో మేలు చేస్తుంది. తలనొప్పి, పీరియడ్ పెయిన్ కూడా ఇది బెస్ట్ రెమెడీ.
లవంగాల్లో ఉండే యాంటీమైక్రోబియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి.
లవంగాల్లోని గుణాలు నోటి ఆరోగ్యాన్ని కాపాడతాయి. పంటినొప్పి, చిగుళ్ల సమస్యలను అడ్డుకోవడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది.
ఆస్తమా, దగ్గు వంటి సమస్యలను దూరం చేసి శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి లవంగం టీ తాగడం చాలా ప్రయోజనకరం.
లవంగాల్లో ఎన్ని లాభాలు ఉన్నప్పటికీ, దీన్ని మితంగానే తీసుకోవాలి. అతిగా తీసుకుంటే అలర్జీ వంటి సమస్యలు రావచ్చు.
Blouse Designs: చీరలకు గ్రాండ్ లుక్ ఇచ్చే బ్లౌజు బ్యాక్ డిజైన్లు
Makhana: రోజూ మఖానా తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా?
Mixer Jar: మిక్సీ జార్ మూత లూజ్ అయిందా? ఈ ట్రిక్ తో ఈజీగా బిగించేయండి
Jasmine: ఎక్కువ శ్రమ లేకుండా ఇంట్లో కుండీల్లో ఈజీగా పెంచే మల్లె రకాలు