MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Snakes: బ్రతికున్న పాము ఎంత ప్రమాదమో.. చనిపోయిన పాము కూడా అంతే ప్రమాదం.. ఎందుకో తెలుసా?

Snakes: బ్రతికున్న పాము ఎంత ప్రమాదమో.. చనిపోయిన పాము కూడా అంతే ప్రమాదం.. ఎందుకో తెలుసా?

Snakes: పాము బతికి ఉంటే.. ఎక్కడ వచ్చి మనల్ని కాటేస్తుందా అనే భయం ఉండటం చాలా సహజం. కానీ, బతికున్న పాముతో ఎంత ప్రమాదమో.. చనిపోయిన పాముతో కూడా అంతే ప్రమాదం అని మీకు తెలుసా?

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 23 2026, 12:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
చనిపోయిన పాము పట్టుకుంటున్నారా?
Image Credit : Gemini

చనిపోయిన పాము పట్టుకుంటున్నారా?

వర్షాకాలంలో ఇంట్లోకి పాములు రావడం చాలా సహజం. అయితే.. పాము ఇంట్లోకి రాగానే సహజంగానే భయపడిపోతాం. అది మనల్ని ఎక్కడ కరుస్తుందా అని.. దానిని బయటకు పంపడానికి విశ్వప్రయత్నాలు చేస్తాం. కొందరు అయితే.. పాము కనిపించగానే.. దానిని కొట్టి చంపేదాకా వదిలిపెట్టరు. అయితే.. బతికున్న పాము ఎంత ప్రమాదమో.. చనిపోయిన పాము కూడా అంతే ప్రమాదం అని నిపుణులు చెబుతున్నారు. నమ్మసక్యంగా లేకపోయినా ఇదే నిజం. దాని వెనక ఉన్న కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
సైంటిఫిక్ కారణం ఇదే..
Image Credit : Gemini

సైంటిఫిక్ కారణం ఇదే..

బతికున్న పాము కోరల్లో విషయం ఉన్నట్లే.. పాము చనిపోయినా కూడా దాని కోరల్లో విషం ఉంటుంది. మనం తెలిసీ, తెలియక ఆ చనిపోయిన పాముని పట్టుకున్నా కూడా.. దాని కూరల్లోని విషయం మీ చర్మానికి తగిలితే ప్రాణానికి ప్రమాదం అని నిపుణులు చెబుతున్నారు. బతికున్న పాముల మాదిరిగానే, వీటి విషం మన శరీరంలోకి ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

అంతేకాదు, నాగు పాములు, కట్లపాములు, వైఫర్ లాంటి విషపూరితమైన పాములు హీమోటాక్సిన్ లను ఉత్పత్తి చేస్తాయి. ఈ విషం మన శరీరానికి తగిలితే, అది మన నాడీ వ్యవస్థ, రక్తంపై ప్రభావం చూపుతుంది. పాము చనిపోయిన తర్వాత కూడా, హీమోటాక్సిన్ అనే విషం దాని కోరల్లో మిగిలి ఉంటుంది. ఈ విషయం కొన్ని గంటల పాటు పవర్ ఫుల్ గా ఉంటుంది. దీని వల్ల కూడా మనకు ప్రమాదం జరగొచ్చు.

33
పాము చనిపోయింది కదా అని పట్టుకుంటే...
Image Credit : Asianet News

పాము చనిపోయింది కదా అని పట్టుకుంటే...

చనిపోయిన పామును ఒట్టి చేతులతో పట్టుకుంటే, పాము కోరలు( దంతాలు) మన చర్మానికి తాకినా కూడా ప్రమాదమే. చనిపోయిన తర్వాత కూడా పాములలోని కొన్ని కండరాలు కొంతకాలం పాటు సజీవంగా ఉంటాయి. పామును చేతితో పట్టుకున్నప్పుడు కండరాల కదలిక కారణంగా దాని కోరలు మన శరీరానికి గుచ్చుకునే ప్రమాదం ఉంది. దాని వల్ల విషం శరీరంలోకి చేరే అవకాశం ఉంది. కాబట్టి, పాము చనిపోయిన సరే దానిని పట్టుకోకూడదు. అంతేకాదు, ఒక్కోసారి గాయం తగిలి పాము చనిపోయినట్లుగా నిర్జీవంగా పడిపోయి ఉండొచ్చు. మీరు దానిని చనిపోయింది అనుకొని పట్టుకుంటే.. అప్పుడు అది కాటు వస్తే.. మీ ప్రాణానికే ప్రమాదం కాబట్టి.. ఇలాంటి పొరపాట్లు చేయకూడదు అని నిపుణులు చెబుతున్నారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Golden Tree: పసిఫిక్ మహాసముద్రంలో బంగారు చెట్టు.. కొత్తగా కనిపెట్టిన శాస్త్రవేత్తలు
Recommended image2
Gold: మనదేశంలోని ఇళ్లల్లో ఉన్న బంగారం ఎన్ని కిలోలు? ఏ దేశం దగ్గర ఎక్కువ బంగారం ఉంది?
Recommended image3
Arrested Person Rights : పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తే ఏంచేయాలి? ఈ 6 లీగల్ రైట్స్ గురించి తెలుసుకొండి
Related Stories
Recommended image1
Snake Safety : మీ దరిదాపుల్లోకి కూడా పాములు రాకుండా తరిమికొట్టే సింపుల్ చిట్కాలు
Recommended image2
Snake : నీటిలో ఉండగా పాములు కాటు వేయలేవని అంటారు.. ఇందులో నిజమెంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved